నిర్మాత‌ల బుస‌ల‌కి స‌మీక్ష‌కులు భ‌య‌ప‌డ‌రు!

ఇళ్ల‌లో గొడ‌వ‌లు ప‌డి ప్రెస్‌మీట్లు పెట్ట‌కండి. స‌మీక్ష‌కుల చ‌ర్మం చాలా మందం. బుస‌ల‌కి భ‌య‌ప‌డ‌రు.

నిర్మాత‌ల్లో కొంద‌రికి అతి తెలివితో కూడిన అమాయ‌క‌త్వం వుంటుంది. త‌మ కోడి కూయ‌క‌పోతే తెల్లార‌ద‌నే భ్ర‌మ‌లో వుంటారు. అజ్ఞానం వ‌ల్ల అనేక ర‌కాలుగా మాట్లాడుతూ వుంటారు. మౌన‌మే జ్ఞానం, మాటే అజ్ఞానం అని తెలుసుకోవ‌డం మ‌హానుభావుల వ‌ల్లే కాలేదు. నిర్మాత‌ల్లో కూడా మ‌హానుభావులుంటారు.

ప్రేక్ష‌కుల కోసం సినిమాలు తీస్తుంటారు. తాము లేక‌పోతే ఇండ‌స్ట్రీనే లేద‌నుకుంటారు. ఆహుతి ప్ర‌సాద్ ఫేమ‌స్ డైలాగ్‌… విల‌న్ విల‌న్ కొట్లాడి క‌మెడియ‌న్ మీద ప‌డ్డ‌ట్టు, మ‌న వాళ్లు హ‌ఠాత్తుగా స‌మీక్ష‌కుల మీద ప‌డ‌తారు. వాళ్లు ప‌ట్టు ప‌ట్టి, కంక‌ణం క‌ట్టుకుని క‌ఠోర దీక్ష‌తో సినిమాని బ్యాడ్ చేస్తున్నార‌ట‌!

మీరు తీసిందే బ్యాడ్ -2. మ‌ళ్లీ దానికో బిల్డ‌ప్‌. హిట్ అయ్యింది, డ‌బ్బులొచ్చాయి. కూల్‌, ఇంకేంటి ప్రాబ్ల‌మ్‌. అయినా మీరు రాయ‌మంటే స‌మీక్ష‌కులు రాస్తారా? మానేయ‌మంటే మానేస్తారా? సోష‌ల్ మీడియా అతిపెద్ద ప్ర‌పంచం. దానిమీద ఎవ‌రికీ కంట్రోల్ లేదు. వ‌ద్దంటే ఇంకా స్పీడ్ పెరుగుతుంది.

థియేట‌ర్‌లో వ‌చ్చిన కాసేప‌టికే ఐ బొమ్మ‌లో సినిమా వ‌చ్చేస్తా వుంది. దాన్ని ఆప‌గ‌లిగితే అంద‌రికీ లాభం. ఆ ప‌ని చేయ‌కుండా స‌మీక్ష‌కుల్ని చీల్చి చెండాడితే న్యూట‌న్ సూత్రం ప్ర‌కారం చెండాటే తిర‌గొస్తుంది. అస‌లే వాళ్ల చేతుల్లో పెన్నులుంటాయి.

ఇంట్లో భార్య‌తో కొట్లాడి రివ్యూలు బ్యాడ్‌గా రాస్తున్నార‌ట‌, న్యాయ‌మైన విమ‌ర్శ‌. అయినా భార్య‌తో కొట్లాడ‌ని మొగుళ్లు వుంటారా ఈ ప్ర‌పంచంలో. తెల్లారి ఆరు గంట‌ల‌కి లేచి, ప్ర‌సాద్ థియేట‌ర్ వ‌ర‌కూ వ‌చ్చి , రెండున్న‌ర గంట‌లు మీరు చూపించే దారుణాల‌న్నీ చూసి , ఇంట‌ర్వెల్‌లో హీరో , డైరెక్ట‌ర్ల బిల్డ‌ప్‌లు, బ్లాక్‌బ‌స్ట‌ర్ అని అరిచే పెయిడ్ ఆర్టిస్టుల కేక‌లు విని, బ‌య‌ట కోర‌లు చాచిన కెమెరాల్ని త‌ప్పించుకుని , ఏం చూసామో అర్థం కాని స్థితిలో , స‌మీక్ష‌లు రాయ‌డం ఎంత క‌ష్ట‌మో, రాస్తే తెలుస్తుంది. అస‌లు స‌మీక్ష‌లు రాసినందుకు కాదు, డ‌బ్బులు ఇవ్వాల్సింది. మీ సినిమాలు చూసినందుకు ఎదురు డ‌బ్బులు ఇవ్వాలి.

ఎవ‌రు చూడ‌మ‌న్నారు? మంచి ప్ర‌శ్న‌.
ఎవ‌రు తీయ‌మ‌న్నారు? మామంచి ప్ర‌శ్న‌.
సినిమా అనేది క‌ళ కాదు, క‌ల కానే కాదు. అది పాత కాలం. ఇపుడు పూర్తిగా వ్యాపారం. స్ప‌ష్టంగా చెప్పాలంటే సినిమా ఒక ప్రాడ‌క్ట్‌. ప్రేక్ష‌కుడు వినియోగ‌దారుడు. వంద‌ల రూపాయిలు ఖ‌ర్చు పెట్టి, సినిమా చూసిన ప్ర‌తివాడికీ మాట్లాడే హ‌క్కు, విమ‌ర్శించే అర్హ‌త వుంటాయి.

మార్కెట్‌లోకి ఒక వ‌స్తువు వ‌స్తే, దాని మంచిచెడ్డ‌లు చెప్పే నిపుణులు వుంటారు. సినిమాకి స‌మీక్ష‌కులు కూడా అంతే. విదేశాల్లో వైన్ రుచి చూసి కొనుక్కోవ‌చ్చు (మ‌న దేశంలో ఆ సౌక‌ర్యం లేదు. వుంటే వైన్ మార్టులు ఉచితంగా ఖాళీ అయిపోయేవి). ఆ విధంగా సినిమా అర‌గంట చూపించి టికెట్ డ‌బ్బులు తీసుకోగ‌ల‌రా? సినిమాని కొన్న డిస్ట్రిబ్యూట‌ర్‌కి, టికెట్ కొన్న ప్రేక్ష‌కుడికి కూడా ఆ సినిమాలో ఏముందో తెలియ‌దు. ప్రెస్‌మీట్స్‌, ఈవెంట్స్‌లో అద్భుతం తీసామ‌ని మీరు చెబుతూ వుంటారు. మేము న‌మ్మి వ‌స్తాం. తీరా చూస్తే కొత్త సీసాలో పాత సారాయి. క‌నీసం సారా అయినా ఫ‌ర్వాలేదు. కొంచెమైనా కిక్ వ‌స్తుంది. ముక్కు మూసి , నోరు తెరిపించి క‌షాయం పోస్తున్నారు. అరిగించుకోలేక ప్రేక్ష‌కులు వాష్‌రూమ్‌లు తిరుగుతున్నారు.

వెబ్‌సైట్స్‌, చానెల్స్ మీ ద‌య‌తో బ‌త‌క‌వు. ద‌మ్ముంటే బ‌తుకుతాయి. లేదంటే పోతాయి. స‌మీక్ష‌కుల వ‌ల్ల చెత్త సినిమాలు బ‌త‌క‌వు. మంచి సినిమాలు చ‌చ్చిపోవు. ప్రేక్ష‌కుడు తిరుగులేని జ‌డ్జి. న‌చ్చితే ఏదీ ప‌ట్టించుకోడు. న‌చ్చ‌క‌పోతే బండ‌కేసి బాదుతాడు. స‌మీక్ష‌కుడు కెట‌లిస్ట్ మాత్ర‌మే.

ఇళ్ల‌లో గొడ‌వ‌లు ప‌డి ప్రెస్‌మీట్లు పెట్ట‌కండి. స‌మీక్ష‌కుల చ‌ర్మం చాలా మందం. బుస‌ల‌కి భ‌య‌ప‌డ‌రు.

జీఆర్ మ‌హ‌ర్షి

19 Replies to “నిర్మాత‌ల బుస‌ల‌కి స‌మీక్ష‌కులు భ‌య‌ప‌డ‌రు!”

  1. 🤣😂🤣😂🤣😂🤣😂😂😂

    మీ గ్రేట్ ఆంధ్ర న్యూస్ లు, review లు చుస్తే- ఒక వర్గాన్ని బాగా సపోర్ట్ చేస్తూ రాస్తారు, ఇంకో వర్గాన్ని కొంచంపరుస్తూ రాస్తారు…. మీరు జర్నలిస్ట్ లు – ఉన్నది ఉన్నట్టు రాయకుండా- సొంత పైత్యాలు ఉంటాయి, అవి రుద్దినప్పుడు ఎవడికో ఒకడికి కాలుతుంది…. నిన్న రియాక్ట్ అయినట్టు అవుతారు….

    మీ న్యూస్ లో జగన్ ని సపోర్ట్ న్యూస్, పవన్ కళ్యాణ్ ని కించపరుస్తూ న్యూస్ ఆర్టికల్స్ రాస్తారు…. మరి nutral గా రాయాలి గా సార్….

  2. దొమ్మరాటలాడే వాళ్ళు సొమ్ముల కోసమే..వాల్లడితే జనాలు పైసలు పడేస్తారు..వాళ్ళాడకపోతే వాళ్ళ డొ క్కే మాడుద్ది..ఎవ్వ రికి నష్టం..తెలుసుకదా..అలాంటి వాళ్లే వీళ్ళు..

  3. Reviews perutho, Story mottham reveal chese GreatAndhra ivem maatladakoodadhu. What you are doing in the name of reviews is Crime i think.

  4. బిచ్చగాడి కి బిచ్చగాడు అంటే కోపం వచ్చిందట.

    అయినా నాగవంశీ కి చెప్పే హక్కు లేదా. ఆడు చెప్పింది అదే కదా.. సమీక్ష రాయండి కానీ suitcase అంద లేదని నెగటివ్ వార్తలు రాయకండి. ఏంటి మహర్షి.. అర్థం అయ్యిందా

  5. arey sigguleni maharshi ga.. vadu open challenge chesadu dammunte na movies ki reviews ivvaddu ani.. chethanaithe chesi chupinchu, lekapothe paid dog ani oppuko

  6. Baaga manduthunnatundhi..!

    niku nijamga G lo dhammu unte..take his challenge and don’t write reviews for his films and don’t discuss on his interviews

  7. చాల్చాల్లేవయ్యా చెప్పొచ్చావ్. “డబ్బులు పెట్టి టికెట్ కొన్న ప్రతివాడికి మాట్లాడే హక్కు, విమర్శించే హక్కు ఉంటుంది” , మాట్లాడే హక్కు ఉంటుంది. కానీ ఎక్కడ? తన చుట్టుపక్కల వాళ్ళతో. దాన్నే మౌత్ టాక్ అంటారు. అది ఎలాగూ సినిమా ఫేట్ ని డిసైడ్ చేస్తుంది. అప్పటి వరకూ ఆగలేక మొదటి రోజే ఈ రచ్చ ఎందుకు? పనిమాలా ప్రజల తరఫున వకాల్తా పుచ్చేసుకుని తర్వాత తిట్లు పడటం ఎందుకు? ఎవడు అడిగాడు నిన్ను సమీక్ష చెయ్యమని? అసలు నీకున్న అర్హత ఏంటి?

    విమర్శించే హక్కు ఉంటుంది – నువ్వు చేసేదానిని విమర్శ అనద్దు. తిట్టడం అను. విమర్శ అంటే “గుణ దోష వివరణ”. అది చెయ్యాలంటే చాలా తెలిసి ఉండాలి. తిట్టడానికి ఫ్రస్ట్రేషన్ ఉంటే చాలు. సినిమా ఎలా ఉంది, సినిమా నీకు ఎలా అనిపించింది అనేవి రెండూ చాలా భిన్నమైన విషయాలు. ఎలా ఉంది అనేది నిజమైన విమర్శకుడు మాత్రమే సరిగా చెప్పగలుగుతారు. నీకు ఎలా అనిపించింది అంటే అడిగిన ప్రతివాడు బోలెడు సోది చెప్తాడు. నీలాగ.

  8. సమీక్షలు రాయడం ఎంత కష్టమో అని బీరాలు పోతున్నావ్? దశాబ్దాల తరబడి ఒకేలాంటి సినిమాలు తీస్తున్నా, వాటినే అద్భుతం అమోఘం అని ప్రమోట్ చేస్తూనే ఉన్నా, ఇంకా బుద్ధి లేకుండా వాటిని నమ్మి సినిమా కి ఎవడు వెళ్ళమన్నాడు?

    నేను సినిమాలు థియేటర్ లో చూడటం ఎప్పుడో మానేసాను. నీ రివ్యూ ల వల్ల కాదు. నాకు సినిమాలు నచ్చక. చూసే ఓపిక ఉన్నవాళ్ళని కూడా ఆసక్తి పోయేలా పిచ్చి పిచ్చి రాతలు ఎందుకు?

    “సమీక్షకుడు క్యాటలిస్ట్ మాత్రమే” – ఈ సెల్ ఫోన్ , వాట్సాప్ యుగం లో నీ లాంటి క్యాటలిస్ట్ లు అవసరం లేదు. ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడే మౌత్ టాక్ బయటకి స్ప్రెడ్ అయిపోతోంది.

    నువ్వు కేవలం డబ్బుల కోసం ఈ పని చేస్తున్నావ్. అది ఒప్పుకో. అది కూడా, మీ వెబ్సైటు యజమానికి తప్పితే ఎవరికీ లాభం లేక పోగా కొంత మందికి నష్టం కూడా. అలాంటప్పుడు తిట్లు పడు. నిన్ను ఎవడూ వెనకేసుకు రాడు.

Comments are closed.