మేమొచ్చాక..

రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇలాంటి దుస్థితి వలన పతనం అవుతాయే తప్ప.. పురోగమించవు. ఆ స్పృహ అన్ని పార్టీలూ కలిగి ఉండాలి.

అధికారంలో ఉన్నవారు కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించడం అనేది ఇవాళ్టి రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. తమ చేతిలో పెత్తనం ఉన్నది కదా అని విశృంఖలంగా నిర్ణయాలు తీసుకోవడం రివాజు అయింది. అయితే.. రాజకీయ వ్యవస్థ దారి తప్పి వ్యవహరిస్తే.. వారి దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి న్యాయవ్యవస్థ సహా అనేక వ్యవస్థలు ప్రపంచంలోనే ఎంతో పటిష్టమైన మన భారతీయ ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. ‘ప్రభుత్వం చేస్తున్నది తప్పు’ అని అనిపిస్తే.. ఆ తప్పు జరగకుండా అడ్డుకోవడంపై విపక్షాలు దృష్టి పెట్టకుండా.. ‘మేమొచ్చాక..’ అలా చేస్తాం, ఇలా చేస్తాం అని బెదిరించడం ఇవాళ మామూలు అయిపోతోంది. టైం మిషిన్ లో ఆ పరిస్థితుల్ని వెనక్కు తీసుకువెళతాం అని హెచ్చరించడం జరుగుతోంది. ఈ విషయంలో పాలక- విపక్షాలకు తేడా ఉండడం లేదు. ఒకరు బెదిరించే వారైతే.. మరొకరు ఆ బెదిరింపుల్ని కూడా తమ రాజకీయానికి వాడుకునే వారే! ఇలాంటి పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దారుణంగా పతనం దిశగా నడుస్తున్నాయనే భయం ఆలోచన పరుల్లో కలుగుతోంది. ఈ పెడపోకడల మీదనే.. ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘మేమొచ్చాక..’!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపక్షంగా పోరాడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. భారత రాష్ట్ర సమితి వారిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఇలాంటి సమీకరణాలు అన్నింటినీ కాసేపు పక్కన పెట్టండి. ఎవరు పాలకులు– ఎవరు ప్రతిపక్షాలు అనే సంగతి కాసేపు మరచిపోండి. కథల్లాగా.. ముందుగా రెండు ఉదాహరణలు చెప్పుకుందాం.

ఉదాహరణ 1:

ఒక ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ‘పెట్టుబడి దారుల్ని ఆహ్వానిస్తున్నాం.. వారికి భూములిస్తాం.. రాయితీలిస్తాం.. రండి వ్యాపారం చేసుకోండి.. మావాళ్లకు ఉద్యోగాలివ్వండి చాలు’ అని ప్రకటించింది. ప్రతిపక్షం కూడా చాలా స్ట్రాంగుగానే ఉన్న పార్టీ. ‘ఈ పెట్టుబడుల వ్యవహారంలో అవినీతి జరుగుతోంది.. పాలకపక్షం అవినీతికి పాల్పడుతోంది.. ఈ ప్రభుత్వ పదవీకాలం ముగిసిన తర్వాత మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం.. అప్పుడు మీకు ఇచ్చిన భూములన్నీ వెనక్కు లాక్కుంటాం.. మీ తాటతీస్తాం’ అని వారు ప్రకటించారనుకోండి. అప్పుడు ఆ పెట్టుబడిదారుడు ఏం చేస్తాడు.

సాధారణంగా మనం– పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాడు– విపక్షాల వల్ల నష్టం జరుగుతుంది– అని అనుకుంటాం. అది నిజమే. కానీ అలాంటి నిర్ణయానికి వచ్చే ముందు నిజమైన పెట్టుబడిదారుడు కొంత రీసెర్చి చేస్తాడు. విపక్షాలు ఇలా బెదిరిస్తున్నాయి గానీ.. నిజంగా అలా చేస్తారా? అని ట్రాక్ రికార్డు చెక్ చేస్తాడు. వారికి నిజంగానే అధికారంలోకి వచ్చేంత, పరిస్థితుల్ని తిరగరాసేంత బలం ఉన్నదా అనే సంగతి కూడా క్రాస్ చెక్ చేస్తాడు. విపక్షం అలాగే చేస్తుందని, ఎందుకంటే ఇప్పుడున్న పాలకపక్షం కూడా అదేరీతిలో గత ప్రభుత్వం చేసిన డీల్స్ ను వెనక్కు మళ్లిస్తున్నదని.. కాబట్టి వారు కూడా మళ్లీ ప్రతీకారం తీర్చుకుంటారని అతనికి అర్థమైందని అనుకోండి. అన్నీ బెదిరింపుల ప్రకారం కన్ఫర్మ్ అయితే.. అప్పుడిక ‘చేసేదేముంది.. పెట్టుబడులు పెట్టకుండా వెనక్కు తగ్గుతాడు’ అని మనం అనుకుంటాం.

నిజమే సాధారణ వ్యాపారవేత్త /పెట్టుబడిదారుడు అలాగే చేస్తాడు. కానీ తెలివైన వ్యాపారి చేసే పని అది కాదు. ఉన్న ప్రభుత్వం ఇచ్చే అన్ని రాయితీలను వాడుకుని వ్యాపారం ప్రారంభిస్తాడు. పొందగల ఎడ్వాంటేజీలన్నీ పుచ్చుకుంటాడు. ప్రభుత్వ పదవీకాలం ముగిసి, మరో పార్టీ వచ్చేలోగా.. తన పెట్టుబడికి మించిన లాభాలన్నీ గిట్టుబాటు అయ్యేలాగా వ్యాపారం ప్లాన్ చేసుకుంటాడు. ఒప్పందాలను తదనుగుణంగా తయారుచేసుకుంటాడు. ఒకవేళ ప్రభుత్వం మారితే.. బెదిరించినట్టుగా వేధిస్తే.. వ్యాపారాన్ని అక్కడితే వదిలేసి, ఉద్యోగులను గాలికొదిలేసి.. తను లాభాలు దండుకోవడం ఎటూ పూర్తయింది గనుక.. దుకాణం సర్దుకుని వెళ్లిపోతాడు. ప్రభుత్వం మారకపోతే.. తాను లాభాలు దండుకోవడాన్ని కంటిన్యూ చేస్తాడు. పెట్టుబడిదారులు సాధారణమైన వారైనా, తెలివైన వారైనా విస్తృత ప్రయోజనాల దృష్ట్యా చూసినప్పుడు.. రాష్ట్రానికి మాత్రం నష్టమే జరుగుతుంది.

ఉదాహరణ 2:

ఉన్నత స్థానంలో ఒక ప్రభుత్వోద్యోగి ఉన్నాడు. పోలీసు శాఖ కావొచ్చు, ఏ ఇతర కీలకమైన శాఖ అయినా కావొచ్చు. అధికారంలోకి వచ్చిన పార్టీ ఎలా చెబితే అలా పనిచేయక తప్పదు. ఆ మాటకొస్తే.. ఎవ్వరు అధికారంలోకి వచ్చినా.. తాము ఎలా చెబితే అలా పనిచేసే అధికారులు మాత్రమే కీలక స్థానాల్లో ఉంటారు. విపక్షానికి చేరువైన అధికార్లుగా ముద్రపడిన వారు లూప్ లైన్లలో కాలం వెళ్లదీస్తూ ఉంటారు. లేదా వారి మీద ఏదో ఒక నెపం మీద సస్పెన్షన్ వేటులు పడి ఉంటాయి. కీలక స్థానంలో ఒక అధికారి ఉన్నారు కదా.. మరి ఆయన మీద విపక్షానికి చెందిన వారు కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు. అధికార పార్టీకి తొత్తుల్లాగా పనిచేస్తారా.. మీకు ఆత్మాభిమానం లేదా అని నానా బూతులు తిడుతుంటారు. ఆ అధికారులు తమకు కిట్టని పని చేసినప్పుడు గానీ.. తమను ఇబ్బంది పెట్టినప్పుడు గానీ.. విపక్ష నేతలు బెదిరింపుల్లో రెచ్చిపోతారు. ‘మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. అప్పుడు మీరు సప్తసముద్రాల అవతల దాక్కుని ఉన్నా సరే వెతికి మిమ్మల్ని పట్టుకుని తీసుకువస్తాం. నడిబజార్లో మీ బట్టలూడదీయించి కొడతాం’ అని బెదిరిస్తారు. లేదా, ‘మీ జాతకాలన్నీ రెడ్ బుక్ లో రాస్తున్నా. మేం అధికారంలోకి రాగానే మీ భరతం పడతా.. మీ అంతు తేలుస్తా’ అని కూడా హెచ్చరించగలరు. చెప్పినట్టే అధికారం చేతులు మారితే అధికారుల్ని వేధించడం కూడా గ్యారంటీ అని అనేక దృష్టాంతాలు నిరూపిస్తుంటాయి కూడా!

అలాంటి నేపథ్యంలో ఏ అధికారి అయినా ఏం చేస్తారు? కీలకమైన స్థానాల్లో ఉండాలంటే.. అధికార పార్టీకి కొమ్ముకాయక తప్పదు. అందుచేత.. విపక్ష నాయకులకు టార్గెట్ కాక కూడా తప్పదు. అధికారం చేతులు మారితే.. ఇక తన కెరీర్ శంకరగిరి మాన్యాలు పట్టిపోతుందనే తెలివిడి వారికి తప్పకుండా ఉంటుంది. అనివార్యమైన, గతిలేని పరిస్థితుల్లో వారు ఉంటారు. అలాంటప్పుడు ఆ అధికారి ఏం చేస్తారు? తన కెరీర్ కు ఇప్పుడు పదవిలో ఉన్న అయిదేళ్లు మాత్రమే ఆఖరి అవకాశం అని తెలిసినప్పుడు.. ఆ ప్రభుత్వ పదవీకాలం ముగిసేలోగా.. తన యావజ్జీవితానికి సంబంధించిన సంపాదన మొత్తం పూర్తి చేసేయాలని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడడం ప్రారంభిస్తారు. ఎటూ అధికారం ఏదో ఒకనాటికి చేతులు మారక తప్పదు.. అలా జరిగితే.. తనకు జీతం తప్ప గీతం దక్కని అప్రాధాన్య పోస్టులే ఉంటాయనే క్లారిటీ వారికి ఉంటుంది. తత్ఫలితంగా.. అందిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ఎడా పెడా దోచుకోవడం మొదలు పెడతారు.
ఇలా జరిగినప్పుడు కూడా నష్టం జరిగేది ఎవ్వరికి? రాష్ట్ర ప్రజలకే! అధికారుల దోపిడీకి, అవినీతికి బలయ్యేది ఎఫ్పుడూ కూడా ప్రజలే! అలాగే, నష్టం వాటిల్లేది ప్రభుత్వ ఖజానాకు మాత్రమే.

తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది ఇలాంటి దుస్థితే!

తాజాగా హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ గురించి నానా బీభత్సమైన రచ్చ జరుగుతోంది. ఏఐ రూపంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఏవి నిజాలో.. ఏవి అబద్ధాలో అర్థం కాని ఫోటోలు, వీడియోలతో విపరీతమైన అనుకూల, ప్రతికూల ప్రచారం జరుగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 400 ఎకరాలు ప్రభుత్వానిదే అని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క చెబుతారు. కాంగ్రెస్ ఏం మాయ చేసినా సరే.. అక్కడ స్థలాలు ఎవ్వరూ కొనవద్దని.. మరో మూడేళ్లలో తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ స్థలాలన్నీ వెనక్కు లాక్కుంటాం అని కేటీఆర్ హెచ్చరిస్తారు.

అదే మాదిరిగా ఏపీ విషయానికి వస్తే.. విశాఖలో సాగర తీరంలో అత్యద్భుతమైన స్థలాన్ని కేవలం ఒక షాపింగ్ మాల్ కోసం లులు సంస్థకు ఇచ్చేసింది గతంలో చంద్రబాబు ప్రభుత్వం. జగన్ రాగానే దాన్ని వెనక్కు లాక్కున్నారు. ఇప్పుడు బాబు సర్కారు వచ్చాక మళ్లీ అదే స్థలాన్ని లులుకు ధారాదత్తం చేసింది. మళ్లీ తాము అధికారంలోకి రాగానే ఆ స్థలాన్ని వెనక్కు తీసుకుంటాం అని, అనుమతులు రద్దు చేస్తాం అని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.

ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి వ్యవహారాలు రాష్ట్రాన్ని ఏదిశగా నడిపిస్తాయి? పెట్టుబడి దారులు రారు.. వచ్చినా ఎంత త్వరగా రాష్ట్రాన్ని దోచుకోగలం అని మాత్రమే ఆలోచిస్తుంటారు తప్ప.. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేంత ఫోకస్ తో పనిచేయరు! రెండు రాష్ట్రాలను కూడా పతనం దిశగా నడిపించే ఇలాంటి రాజకీయ పోకడలు ఇప్పుడు శ్రుతిమించుతున్నాయి.

అధికారుల్లో కూడా మనం పైన చెప్పుకున్న పరిస్థితే. కాంగ్రెస్, తెలుగుదేశం సర్కారులకు అనుకూలంగా పనిచేస్తున్న అధికారులందరికీ.. పరిస్థితుల్లో తేడా వస్తే తమ పరిస్థితి ఏంటో స్పష్టత ఉంది. వారు నిజాయితీగా ఎందుకు పనిచేస్తారు?

ఎడ్వాంటేజీగా మార్చుకుంటున్న ఏపీ సర్కార్..

నిజానికి ఏపీలో చిత్రమైన పరిస్థితి ఉన్నది. తెలంగాణలో కేటీఆర్ బెదిరిస్తున్నట్టుగా ఏపీలో విపక్షనేత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి బెదిరింపులు చేయడం లేదు. సైలెంట్ గానే ఉన్నారు. కానీ.. వారి మీద అలాంటి నిందలు వేస్తూ ఎడ్వాంటేజీ తీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. నారా లోకేష్ మాటలను గమనిస్తే.. తమ ప్రభుత్వ చేతగానితనం ఎక్కడ బయటపడినా సరే.. దానిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. నారా లోకేష్ ఏం అంటున్నారంటే.. ‘మేం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం.. కానీ వైసీపీ నాయకులు ఆ పెట్టుబడులను అడ్డుకుంటున్నారు’ అని ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. దీనికి రుజువు ఏమిటి? వారు ఏ పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తుండగా.. వైసీపీ నాయకుల్లో ఎవరు ఏ రీతిగా అడ్డం పడ్డారో వారు ఆధారాలతో చెప్పగలరా? అలాంటి ప్రశ్న ఎదురైతే గనుక.. ‘మా వద్ద ఆధారాలున్నాయి.. సమయం వచ్చినప్పుడు బయటపెడతాం..’ అనే అత్యంత పేలవమైన చెత్త ప్రకటనతో నాయకులు బుకాయిస్తారు.

వాస్తవంగా ఇలాంటి పరిస్థితి ఉంటే గనుక.. ఏ సంస్థ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడానికి తమ ప్రభుత్వం ఎంత కృషి చేసిందో ప్రజలకు చెప్పాలి. కృషి అనగా.. ఆ సంస్థ ప్రతినిధులను వారి ఆఫీసుకు వెళ్లి కలవడం శాలువాలు కప్పడం బొబ్బిలి వీణలను, వెంకటేశ్వరస్వామి బొమ్మలను, అరకు కాఫీ ప్యాకెట్లను గిఫ్టులు ఇవ్వడం, ఫోటోలు దిగి వచ్చేయడం కాదు. అంతకు మించి.. అడుగు ముందుకు పడిందని ప్రజలకు నిరూపించాలి.

‘మేం కలిశాం.. ఆ సంస్థ మన రాష్ట్రానికి వచ్చేస్తున్నది’ అని తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో చాటుకోవడమూ, తమ అనుకూల మీడియాతో డప్పు కొట్టించుకోవడమూ మాత్రమే కాదు. కనీసం ఆ సంస్థ తమ అధికారిక వెబ్ సైట్ లో గానీ, సోషల్ మీడియాలలో గానీ.. మన నాయకులతో భేటీని ఒక అచీవ్‌మెంట్‌గా ప్రకటించుకున్నదా? ఏపీలో పెట్టుబడుల గురించి ప్రతిపాదనలు వచ్చాయని, కనీసం తమ సంస్థ వాటి గురించి ఆలోచిస్తున్నదని అధికారికంగా ప్రకటించినదా? లేదా.. ఏపీలో పెట్టుబడులు పెట్టబోతున్నట్టుగా చెప్పినదా..? అలా జరిగితేనే అడుగు ముందుకు పడినట్టు లెక్క. ఆ దశకు వచ్చిన తర్వాత– ప్రతిపక్షం వాళ్లు ఎలాంటి కుట్రలు చేస్తే ఆ పెట్టుబడులు రాకుండా ఆగిపోయాయో కూడా చెప్పాలి. లేఖ రాశారా? ఫోను చేశారా? ఎలా బెదిరించారు? ఏం ఆధారాలున్నాయి.. తేల్చాలి. అదేమీలేకుండా గాలివాటుగా.. తామేదో డాంబికంగా ప్రకటించుకున్న సంస్థలు రాష్ట్రానికి ఎప్పటికీ వచ్చే ఉద్దేశం కనపరచకపోతే.. అదంతా విపక్షాల కుట్ర అని చాటేస్తే, తమ చేతగానితనం చాటుకోవడమే అవుతుంది.

నిష్కృతి లేదా?

ఇలాంటి బెదిరింపులకు, వ్యవస్థలు గాడితప్పడానికి తరణోపాయం లేదా? అంటే ఉంది. ముందుగా పార్టీల నాయకులకు చిత్తశుద్ధి ఉండాలి. సమాజహితం పట్ల కాంక్ష ఉండాలి. ప్రభుత్వం చేస్తున్న పని తప్పు అనే అభిప్రాయం విపక్షానికి ఉంటే.. తాము అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో చెప్పి బెదిరించడం కాదు.. అసలు ఆ తప్పు జరగనివ్వకుండా వారు పోరాడాలి. ప్రజాపోరాటాలు, న్యాయపోరాటాలు అనేక మార్గాలు అందుకు ఉన్నాయి. ఒక పార్టీ అధికారంలోకి వచ్చినంత మాత్రాన రాష్ట్రం మీద వారికి గుత్తాధిపత్యం దక్కదు. అధికారం అనేది చక్రవర్తిత్వం కాదు. వారి నిర్ణయాలను అడ్డుకోవడానికి ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలి.. పోరాడాలి.. సాధించాలి! తమ పోరాటాల ద్వారా ప్రజల హృదయాలను కూడా గెలవాలి. ప్రభుత్వాలు చేస్తున్నది తప్పు అని సాధికారికంగా నిరూపించాలి. కానీ.. అలాంటి పనిచేయకుండా.. ప్రభుత్వాలు కేవలం బెదిరింపుల మీదనే తాము మనుగడ సాగించాలని అనుకోవడం దారుణం.

రాజకీయ పార్టీలు వ్యక్తిగత శత్రువుల్లాగా మారిపోయి ఇలాంటి దూషణలకు, నిందలకు, బెదిరింపులకు దిగుతుండడం అనేది అత్యంత నిరాశాజనకమైన పరిస్థితి. నిబద్ధతతో, నిజమైన వ్యాపార దృక్పథంతో, తన వ్యాపారం ద్వారా నలుగురికీ మంచి జరగాలని, స్థిరమైన ఉపాధి ఇవ్వాలనే సదాలోచనతో వ్యవహరించే పెట్టుబడిదారులు కరవైపోతారు. ప్రభుత్వం ఉన్నత హోదాలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నందుకు, తన వల్ల సమాజానికి ప్రజలకు గరిష్ట మేలు జరగాలనే అధికారులు మాయమైపోతారు.

రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇలాంటి దుస్థితి వలన పతనం అవుతాయే తప్ప.. పురోగమించవు. ఆ స్పృహ అన్ని పార్టీలూ కలిగి ఉండాలి.

.. ఎల్. విజయలక్ష్మి

38 Replies to “మేమొచ్చాక..”

  1. ఎం రాస్తున్నారు మేడం, ఒక పక్క లులు కి ఇచ్చిన భూములని వెనక్కి తీసుకుంటాం అని వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు అని రాసారు , మళ్ళీ నాలుగు లైన్స్ రాయగానే , జగన్ మౌనం గానే ఉన్నారు అని రాసారు . అదేంటి అండి అశోక్ లేలాండ్ కంపెనీ పూర్తి అయిపోయింది , ప్రొడక్షన్ కి సిద్ధం గ ఉన్న గత 5 ఏళ్లలో ఎటువంటి ఉత్పత్తి ఎందుకు జరగలేదు , దాన్నే గ మొన్న మళ్ళీ పునః ప్రారంభం చేసి ఉత్పత్తి స్టార్ట్ చేసింది , అమర్ రాజా బ్యాటరీస్ ఎందుకు పోయింది , జువారి సిమెంట్ , జాకీ లాంటివి కొన్ని ఉదాహరణలు.

    1. ప్రతి వాళ్ళకి రాజకీయమే గ కావాల్సింది . రాష్ట్రము ఎటు పోతే ఎవడికి కావాలి. ఎవడైనా పెట్టుబడులు తీసుకొస్తున్నపుడు సహకరించకుండా ఆ కంపెనీకి emails పెట్టిన ఘనత ఎవరిదో అందరికి తెలుసు . KTR కి ఉన్న సమస్య , ఆ 400 ఎకరాలు బహిరంగ వేలం లో కనుక అమ్మితే ప్రభుత్వానికి చాల డబ్బు వస్తుంది , దాన్ని వల్ల కొని కార్యక్రమాలు చేయగలిగితే వాళ్ళకి ప్లస్ అవుతుంది , అది అడ్డుకోవడానికి వాళ్ళు ఆలా చెప్తారు , ఇదే పని తెరాస అధికారం లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇలాగె వాడుకుంటారు . ఎటొచ్చి ఆ పార్టీల మద్దతుదారులు కాకుండా సామాన్య ప్రజానీకం ఎటు కాకుండా పోతారు .

    2. enni busses uthpathhi chesthunaru AL lo . daani video choosthe body building plant laaga vundi . edo ego tho ope chesincharu kaani akkada emi uhthpathhi kaavadam ledu .

      mee ruddudu aapandi . expasion chese tappaudu differet states ni choosukuntaru . alae amara raja next plant ki TG ni enchukudi . Jockey sangathi adariki thelusu . 2019 ennikala mude vellipoeidi . news lo kooda vachhidi.

      ippudu kooda guntur distirct lo 2 cement companies moothapaddaei . mee MLA dabbu dahaiki . Ramayapaatam port contractor ekanga central gov complaint chesadu .

      1. సర్ , మీరు చెప్పినట్టు అది బాడీ బిల్డింగ్ ప్లాంట్ ఏ , అదే ఎందుకు 2019-2024 మధ్య మొదలు కాలేదు , అదేమీ కమ్మ కంపెనీ కాదు . అమర్ రాజా మొదట పెట్టాలన్నది చిత్తూర్ లో కదా , ఆల్రెడీ వాళ్ళ ఇండస్ట్రీ ఉంది కదా అక్కడ , అక్కడ నుండి హైదరాబాద్ ఎందుకు పోయింది ?మీరు చెప్పినట్టు టీడీపీ హయం 2019 లో కంపెనీ పోతే ఆ విషయం మీకు 2022 అసెంబ్లీ లో గుర్తు వచ్చిందా . గుంటూరు లో 2 సిమెంట్ కంపెనీస్ మూసుకున్నాయా? అది అవినీతి వల్ల అని మీరే చెప్తున్నారు , ఇక్కడ నేను మాట్లాడుతుంది రాజకీయ బెదిరింపులు గురించి, అది చేయడం లో ప్రస్తుతానికి మీరు సిద్ధహస్తులు , మీరు తీసుకొచ్చినవి ఏవైనా కూటమి ప్రభుత్వం వెళ్లగొడితే, అప్పుడు ఇదే డిస్కషన్ మనం కచ్చితంగా మాట్లాడుకుందాం.

      2. మీరు MLA ధన దాహం వల్ల అని రాసారు బావుంది , మా MLA ఎవరో మీకు ఎలా తెలుసు? ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేవి పల్నాడు జిల్లాల్లో , నేను ఆ ప్రాంతం వాడినని మీరు ఎలా కంఫర్మ్ చేసారు . రామాయపట్నం కాంట్రాక్టర్ ని వేధించాడని కేసు పెట్టాడు , అది డబ్బు వ్యవహారం అని అందరు కంఫర్మ్ చేసారు , అంటే అది అవినీతి వ్యవహారం , కానీ నువ్వు తెచ్చావ్ కాబట్టి అది రాష్ట్రానికి పనికి రాదు అనే ధోరణి అయితే కాదు కదా ?

      3. మీరు MLA ధన దాహం వల్ల అని రాసారు బావుంది , మా MLA ఎవరో మీకు ఎలా తెలుసు? ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేవి పల్నాడు జిల్లాల్లో , నేను ఆ ప్రాంతం వాడినని మీరు ఎలా కంఫర్మ్ చేసారు . రామాయపట్నం కాంట్రాక్టర్ ని వేధించాడని కేసు పెట్టాడు , అది డబ్బు వ్యవహారం అని అందరు కంఫర్మ్ చేసారు , కానీ మీరు తెచ్చారు కాబట్టి అది రాష్ట్రానికి పనికి రాదు అనే ధోరణి అయితే కాదు కదా ?

      4. మీరు MLA కక్కుర్తి వల్ల సిమెంట్ ఫ్యాక్టరీస్ మూతపడ్డాయి అని రాసారు బావుంది , ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేవి దాచేపల్లి దగ్గరలో , నేను ఆ ప్రాంతం వాడినని మీరు ఎలా కంఫర్మ్ చేసారు .

      5. మీకు అర్థం కాకపోతే కొంచెం వివరిస్తా, ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ రాష్ట్రానికి తెచ్చారు , గవర్నమెంట్ మారి ఆ కాంట్రాక్టు ని రద్దు చేశారనుకోండి, అలంటి ఉదంతాలు మాత్రమే ఈ ఆర్టికల్ కి సంబంధం , నేను చెప్పిన ఉదాహరణకి చెప్పినవి అలాంటివే , మీరు చెప్తున్నా ఉదాహరణలు వేరే టాపిక్ (పొలిటికల్ కరప్షన్) అది వేరే సందర్భం లో కచ్చితంగా మాట్లాడుకుందాం.

  2. అనుకున్న విధంగా పరిశ్రమ సాదించుకుని వస్తే ప్రభుత్వం మారాక మా నేత లేఖ రాయడం వల్లే వాళ్ళు పరిశ్రమ పెట్టారని అసెంబ్లీలో ఆర్థిక మంత్రి గారు ప్రకటిస్తారు కూడా ఇది ఎందుకు రాయలేదు విజయలక్ష్మి గారు..

  3. ///అధికారంలో ఉన్నవారు కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించడం అనేది ఇవాళ్టి రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. తమ చేతిలో పెత్తనం ఉన్నది కదా అని విశృంఖలంగా నిర్ణయాలు తీసుకోవడం రివాజు అయింది.///

    .

    ఈ మాటలు జగన్ కె సరిగ్గ సరిపొతాయి.

    మరి జగన్ తీసుకున్న 3 రాజదానులు, పొలవరం రైవెర్సె టెండరింగ్, ప్రజావెదిక కూల్చివెత, కాలుష్యం పెరిట అమర్ రాజా ని మూయించటం, మార్గదర్సి చిట్స్ మీద దాడులు, RRR మీద 3ర్ద్ డిగ్రీ, చంద్రబాబు సహా పలు నాయకుల అక్రమ అర్రెస్ట్ లు… ఇవేవి తమరికి ఎనాడు విశృంఖలంగా అనిపించకపొగా, సంకలు గుద్దుకున్నారు కదా!

  4. అక్క కి ఆధారాలు కావాలంట..

    అక్కా.. మరి నారసురరక్తచరిత్ర అని కూసినప్పుడు.. నీకు ఏ ఆధారాలు చూపించారు..?

    అక్కా.. మరి పింక్ డైమండ్ అని కోసినప్పుడు .. నీకు ఏ ఆధారాలు చూపించారు..?

    అక్కా.. అమరావతి లో అందరూ కమ్మోల్లె అని వాగినప్పుడు.. నీకు ఏ ఆధారాలు చూపించారు..

    ..

    అక్కా.. PAYTM కోసం పెంట తిను.. మీ బతుకే అది..

    కానీ ఆ పెంట ఎదుటి మనుషులకు పూయకు .. పేకాడేస్తారు..

    ..

    రోజా ని రాజకీయాల్లో చూసాకా.. ప్రతి లంజా పరమాన్నం వండేస్తోంది.. దొమ్మరి గుడిసెల్లో దూరే సంకర జాతి మనుషులు..

  5. అక్క కి ఆధారాలు కావాలంట..

    అక్కా.. మరి నారసురరక్తచరిత్ర అని కూసినప్పుడు.. నీకు ఏ ఆధారాలు చూపించారు..?

    అక్కా.. మరి పింక్ డైమండ్ అని కోసినప్పుడు .. నీకు ఏ ఆధారాలు చూపించారు..?

    అక్కా.. అమరావతి లో అందరూ కమ్మోల్లె అని వాగినప్పుడు.. నీకు ఏ ఆధారాలు చూపించారు..

    ..

    అక్కా.. PAYTM కోసం పెం ట తిను.. మీ బతుకే అది..

    కానీ ఆ పెం ట ఎదుటి మనుషులకు పూయకు .. పేకాడేస్తారు..

    ..

    రోజా ని రాజకీయాల్లో చూసాకా.. ప్రతి లంజా పరమాన్నం వండేస్తోంది.. దొమ్మరి గుడిసెల్లో దూరే సంకర జాతి మనుషులు..

  6. అక్క కి ఆధారాలు కావాలంట..

    అక్కా.. మరి నారసురరక్తచరిత్ర అని కూసినప్పుడు.. నీకు ఏ ఆధారాలు చూపించారు..?

    అక్కా.. మరి పింక్ డైమండ్ అని కోసినప్పుడు .. నీకు ఏ ఆధారాలు చూపించారు..?

    అక్కా.. అమరావతి లో అందరూ కమ్మోల్లె అని వాగినప్పుడు.. నీకు ఏ ఆధారాలు చూపించారు..

    ..

    అక్కా.. PAYTM కోసం పెంట తిను.. మీ బతుకే అది..

    కానీ ఆ పెంట ఎదుటి మనుషులకు పూయకు .. పేకాడేస్తారు..

    ..

    రోజా ని రాజకీయాల్లో చూసాకా.. ప్రతి లం జా పరమాన్నం వండేస్తోంది.. దొమ్మరి గుడిసెల్లో దూరే సంకర జాతి మనుషులు..

  7. అక్క గత రెండు వారాలు గా కనిపించడం లేదు.. గుండె పోటు కానీ రాలేదు కదా…

  8. ఓలమ్మో.. ఓలమ్మో.. లచ్చమ్మో.. పేమెంట్ పడిపోనాదా ఏటి మరి.. మరి బేగి పారెల్లి వచ్చీసినావు మరి నీతులు సెప్పేదానికి..

  9. ఓలమ్మో.. ఓలమ్మో.. లచ్చమ్మో.. పేమెంట్ పడిపోనాదా ఏటి మరి.. మరి బేగి పారెల్లి వచ్చీసినావు మరి నీతులు సెప్పేదానికి..

  10. ఒరేయ్ విజయలక్ష్మి గా నువ్వు ఇంకా ఆడ పేరుతోనే రాస్తున్నావా?? 100% GA అనే బోకు పేపర్ కి ఆడవాళ్ళు ఎవరూ పనిచేయరు!!

  11. అన్న చెప్పాడు చేస్తాడు. అమరావతిని నాశనం చేస్తానని చెప్పాడా, చెయ్యలేదు?

  12. ఆర్టికల్ బాగుంది కానీ… ఏపీలో విపక్షనేత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి బెదిరింపులు చేయడం లేదు. సైలెంట్ గానే ఉన్నారు. అని రాశారు చూడండి అక్కడ దొరికిపోయారు. పోలీసుల్ని గుడ్డలూడదీసి కొడతాం అని ఇవాళ కూడా జగన్ బెదిరించాడు. ఆ వీడియో మీరు చూడలేదా..? ముందు అది చూడండి…

Comments are closed.