జ‌గ‌న్ ‘అపాయ‌’మెంట్స్‌!

ఏ ర‌కంగా వైసీపీకి, జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా, ఇత‌ర‌త్రా ఉప‌యోగ‌ప‌డుతున్నారో ఆలోచించాల్సిన అవ‌స‌రం వుంది.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అపాయింట్‌మెంట్స్‌పై భిన్నాభిప్రాయాలున్నాయి. అనేక విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. ఓవ‌రాల్‌గా చూస్తే, జ‌గ‌న్‌కు ఉప‌యోగ‌ప‌డేవాళ్లు ఆయ‌న్ను క‌ల‌వాల‌ని అనుకున్నా, చాలా క‌ష్టం. కానీ జ‌గ‌న్‌ను ఉప‌యోగించుకోవాల‌ని అనుకునే వాళ్ల‌కు మాత్రం…సులువుగా అపాయింట్‌మెంట్స్ దొరుకుతున్నాయ‌నే విమ‌ర్శ‌ను కొట్టి పారేయ‌లేం.

క్షేత్ర‌స్థాయిలో ప‌ది ఓట్లు లేనోళ్లు కూడా, పే…ద్ద నాయ‌కులుగా చెలామ‌ణి అవుతూ తాడేప‌ల్లిలో జ‌గ‌న్ వ‌ద్ద ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నారు. వంద‌ల ఓట్ల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల నాయ‌కుల‌కు జ‌గ‌న్‌ను క‌లుసుకునే ర‌హ‌స్యం తెలియ‌డం లేదు. జ‌గ‌న్‌పై అభిమానంతో సొంత డ‌బ్బు ఖ‌ర్చు పెట్టుకుంటూ, ప్ర‌త్య‌ర్థుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న నాయ‌కులు క‌ళ్లు కాయ‌లు కాచేలా జ‌గ‌న్ ద‌ర్శ‌నం కోసం నిరీక్షించాల్సిన ప‌రిస్థితి. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు, దాన్ని బాగా వాడుకున్నోళ్లు మాత్రం, ద‌ర్జాగా అనుకున్న‌ప్పుడ‌ల్లా జ‌గ‌న్‌ను క‌ల‌వ‌గ‌లుగుతున్నారు.

అది కూడా జ‌గ‌న్‌ను క‌లిసిన వాళ్లే, మ‌ళ్లీమ‌ళ్లీ క‌లుస్తుండ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. జ‌గ‌న్‌ను ఒక్క‌సారి క‌లిస్తే చాలు అని క‌ల కంటున్న వాళ్ల కోరిక క‌ల‌గానే మిగులుతోంది. జ‌గ‌న్ అపాయింట్‌మెంట్స్‌ను కేఎన్ఆర్ (కె.నాగేశ్వ‌ర‌రెడ్డి), కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి చూస్తుంటారు. జ‌గ‌న్ అపాయింట్‌మెంట్స్ ఇవ్వ‌డానికి ప్రాతిపదిక ఏంటో ఎవ‌రికీ అర్థం కాదు. అధికారం కోల్పోయి ప‌ది నెల‌లు దాటుతున్నా, ఇంకా త‌మ నాయ‌కుడిని క‌ల‌వ‌డం క‌ష్టంగా వుంద‌నే నిట్టూర్పులు క్షేత్ర‌స్థాయి నుంచి వ‌స్తున్నాయంటే ఆశ్చ‌ర్యంగా వుంది.

వైసీపీ కోసం నిజంగా త‌పిస్తూ, కేడ‌ర్ కోసం ప‌ది రూపాయిలు ఖ‌ర్చు పెట్టుకునే నాయ‌కుల‌కు జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ కోసం ప్ర‌య‌త్నించి, ఇక ఇది అయ్యే ప‌ని కాద‌ని విసిగి వేసారిపోయిన వాళ్లున్నారు. ఈ పార్టీ వ‌ద్దు, రాజ‌కీయాలు వ‌ద్దు, జ‌గ‌న్ అస‌లే వ‌ద్దు అని నిరాశ‌నిస్పృహ‌ల‌కు గురి అయిన‌, అవుతున్న వాళ్లు వేల‌ల్లోనే ఉన్నారు. కొంద‌రి అపాయింట్‌మెంట్స్ గురించి రాయ‌డానికి సంస్కారం అడ్డొస్తుంది కానీ, అస‌లు వాళ్ల‌ను ఎందుకు జ‌గ‌న్‌ను క‌ల‌వ‌నిస్తున్నారో కూడా అర్థం కావ‌డం లేద‌నే మాట వినిపిస్తోంది.

వైసీపీ కోసం ప‌నిచేసే వాళ్ల‌కు జ‌గ‌న్ ద‌ర్శ‌నభాగ్యం క‌ల‌గ‌క‌పోవ‌డం, కార్య‌క‌ర్త‌ల‌కు ఎవ‌రో తెలియ‌ని వాళ్లంతా ఆయ‌న్ను క‌లుస్తూ సోష‌ల్ మీడియాలో ఫొటోలు పెట్టుకుంటున్నారు. దీంతో కొంద‌రికి మండిపోతోంది. ఛీ, ఈ పార్టీ కోసం ప‌నిచేయాలా? అనే ఆగ్ర‌హం క‌ట్టలు తెంచుకుంటోంది. అందుకే జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ ఇచ్చేట‌పుడు… క్షేత్ర‌స్థాయిలో వీళ్లు చేస్తున్న ప‌నేంటి? ఏ ర‌కంగా వైసీపీకి, జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా, ఇత‌ర‌త్రా ఉప‌యోగ‌ప‌డుతున్నారో ఆలోచించాల్సిన అవ‌స‌రం వుంది.

కేవ‌లం జ‌గ‌న్ ద‌గ్గ‌ర హాజ‌రు వేయించుకోడానికి త‌పించే నాయ‌కులే కాని నాయ‌కుల్ని చూస్తున్నాం. ఈ ప‌ది నెల‌ల కాలంలో వైసీపీ ఆందోళ‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న వాళ్ల‌కు ఎంత మందికి జ‌గ‌న్‌ను క‌లిసే అవ‌కాశం క‌ల్పించారో లెక్క‌లు తీస్తే, ఏం జ‌రుగుతున్న‌దో అర్థ‌మ‌వుతుంది. ఆ దిశ‌గా జ‌గ‌న్ అపాయింట్‌మెంట్స్ చూసే వాళ్లు ఆలోచించాల‌ని వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి.

19 Replies to “జ‌గ‌న్ ‘అపాయ‌’మెంట్స్‌!”

  1. జగన్ 2.0 ఇంత దరిద్రం గా ఉంటుందన్నమాట..

    జగన్ 1.0 నే భరించలేక దింపేసుకొన్నారు.. ఇక ఇలా ఉంటె జగన్ 2.0 ని దేకను కూడా దేకరు కాబోలు..

    ..

    సింగల్ సింహం అని విర్రవీగే జగన్ రెడ్డి కి దాదాపు 20 ఏళ్ళు రాజకీయం చేసిన తర్వాత కూడా .. ఏది మంచో.. ఏది చెడో.. ఏది అవసరమో.. ఏది అవసరం లేదో కూడా ఇంకా తెలుసుకోలేకపోతున్నాడా..?

    ఇంకా ఎవరో గైడ్ చేస్తే గాని.. దారి చూడలేకపోతున్నాడా..

    ..

    ఒక పక్క చంద్రబాబు, లోకేష్ రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్నారు.. అయినదానికీ, కాని దానికి వెళ్లిపోతున్నారు.. పిలిచినా, పిలవకపోయినా.. పరుగెత్తుకెళ్లిపోతున్నారు..

    ఈ పనికిమాలినోడు.. ఇంట్లో కూర్చుని పిల్లి బొచ్చు గొరుగుతున్నాడు..

    ఇక వీడిని నమ్ముకుని.. వీడి తోక పట్టుకుని గోదారి ఈదమంటున్నావా ..!

  2. అపాయింట్మెంట్ రేట్లు:

    చూడటానికి పది వేలు,

    ఆటోగ్రాఫ్ కి పాతిక వేలు,

    సెల్ఫీ పోటో కి 50 వేలు,

    కలిసి మాట్లాడాలి అంటే : లచ్చ.

    ఈ రెట్లు అందరికీ తెలిసి కదా. ఏదో తెలియనట్లు బడాయి కొడతావు కాని.

    1. ఇలా వచ్చిన డబ్బు తోనే వాడు తనకి ప్యాలెస్ లో రోజు తనకి అన్నం పెట్లే టిక్కెట్లు కొనుకుంటున్నాడు. అదీ లెక్క.

      డబ్బు వింటేనే తిండి.

  3. ఇది మీ అన్న పరిస్థితి గ్యాస్ ఆంధ్ర

    అన్నీ తెలిసి కూడా ఆయన సంక గుద్ధ నాకడం మాత్రం వదలడం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పిన లెక్కల్లో అయితే మీ అన్న బతికి బట్టకట్టినట్టే గ్యాస్ ఆంధ్ర

  4. అరే, అసలు వీడు రోజు 24 గంటలు లో , ఏమి చేస్తాడు అని హరగోపాల్ సూరపనేని చేత ఇన్వెస్టిగేషన్ ఆర్టికల్ రాయించి చూడు.

    అధికారం కూడా లేదు కదా, చక్కగా వచ్చిన పార్టీ కార్యకర్తలు నీ కలవ వచి కదా.

    నీకు కూడా తెలుసు , వాడికి * బలుపు. మామూలు మనుషుల తో కలవడం ఇష్టం వుండదు, వాడికి.

  5. అసలు మొగుడే సరిగ్గా ఉంటే అని ఒక సామెత ఉంది.

    సొంత తల్లి మీద నే , అది కూడా ఆస్తులు కోసం కేసు పెట్టిన జగన్ రెడ్డి అనే వాడు, నువ్వు రాసిన ప్రకారం ఒక మనిషి కింద కూడా లెక్క లోకి రాడు.

    మరల అతను విసిరేసిన బిచ్చం ఏరుకుని అతనే నెక్స్ట్ cm కావాలి అని ప్రచారం చేస్తున్నావు చూడు, అబ్బో నువ్వు చాలా గొప్పొవ్దివి.

  6. అన్నని కలవాలంటే పది వేలు టికెట్ పెడితే బాగా గిట్టుబాటు అవుధేమో ఆలోచన ఎందుకు చెయ్యరు

  7. మాట్లాడితే వీళ్ళు సొంత సామాజిక వర్గానికి పదవులు ఇస్తున్న చంద్రబాబు అని ప్రచారం చేస్తారు కదా ..

    మా అన్నయ్య ను కలవాలంటే అపాయింట్మెంట్ ఇచ్చేది నాగేశ్వర రెడ్డి, కృష్ణమెహన్ రెడ్డి వీళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందిన వారుంటారు..

  8. ఏదో పెద్ద బిల్డ్ అప్ కానీ, అసలు ఈయన అప్పోయింట్మెంట్ ఎవరు కావాలంటున్నారు.

Comments are closed.