2026 భారీ యుద్దాలే

2025 కాస్త డల్ అయింది భారీ సినిమాల విషయంలో. కానీ అసలు సిసలు పోటీ 2026 లో వుండబోతోంది.

2025 కాస్త డల్ అయింది భారీ సినిమాల విషయంలో. కానీ అసలు సిసలు పోటీ 2026 లో వుండబోతోంది. టాప్ హీరోలంతా తమ తమ సినిమాలను 2026 బరిలో దింపబోతున్నారు. సంక్రాంతికి మెగాస్టార్-అనిల్ సినిమాతో మొదలుకాబోతోంది. మార్చిలో నాని పారడైజ్,రామ్ చరణ్ పెద్ది సినిమాలు రెడీ అవుతాయి యుద్దానికి. సమ్మర్ కు ప్రభాస్-హను రాఘవపూడి సినిమా వుండే అవకాశం వుంది. అదే సమ్మర్ లో కాస్త అటుగా ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా వుంటుంది.

2026 డిసెంబర్ వేళకు అట్లీ-బన్నీ సినిమాను రెడీ చేసే అవకాశం వుంది. మహేష్-రాజమౌళి సినిమా మీద క్లారిటీ ఇంకా రావాల్సి వుంది. మొత్తం మీద ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, నాని, రామ్ చరణ్ అంటే అయిదు సినిమాలు వస్తాయి. ఇవి కాక బాలయ్య నుంచి ఒకటి, విజయ్ దేవరకొండ నుంచి ఒకటి కూడా వస్తాయి. నాని ఏడాదికి ఒక సినిమాతో వదలరు. మరోటి ఎలాగూ వదులుతారు. అంటే దాదాపు గా ప్రతి నెల.. నెలన్నరకు ఓ భారీ సినిమా రంగంలోకి దిగుతుంది అన్నమాట.

అయితే ఇవేమీ ప్లాన్డ్ గా ప్రతి నెలకు, నెలన్నరకు ఒకటి వంతున వదలరు. అందువల్ల ఉంటే వరుసగా భారీ సినిమాలు లేదంటే చిన్న సినిమాలు అన్నట్లు వుంటుంది పరిస్థితి. ఇప్పటికే చరణ్ పెద్ది.. నాని పారడైజ్ ఒకేసారి ఢీ కొనబోతున్నాయి.

ఇదిలావుంటే మిడ్ రేంజ్, చిన్న హీరోల సినిమాలు వుండనే వుంటాయి. అవి ఎలా లేదన్నా కనీసం ఓ 20 వరకు వుండే అవకాశం వుంది. మొత్తం మీద 2026లో థియేటర్లకు పండగలా వుంటుంది టాలీవుడ్ తో.

One Reply to “2026 భారీ యుద్దాలే”

Comments are closed.