పవన్‌తోనే తమ్ముళ్లకు పని

టీడీపీ కూటమిలో జనసేన కీలకంగా ఉంది. ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.

టీడీపీ కూటమిలో జనసేన కీలకంగా ఉంది. ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. పైగా ఆయన చేతిలో పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు ఉన్నాయి.

మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో 125కి పైగా నియోజకవర్గాలు గ్రామీణ నేపధ్యంతో కూడుకున్నవి. అలా చూస్తే కనుక పవన్‌ శాఖలతోనే అందరికీ అవసరం ఉంది. దాంతో తమ మండలాలు గ్రామాల అభివృద్ధి కోసం నిధులకు పవన్‌ కళ్యాణ్‌ను ప్రసన్నం చేసుకునే తమ్ముళ్లు అధికం అయ్యారు.

ఆయన వద్దకు వెళ్లి తమ నియోజకవర్గం సమస్యలను చెప్పుకుని నిధులను కేటాయించమని కోరే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. దాంతో పవన్‌ను ఆయన ఛాంబర్‌లో కలసి తమ నియోజకవర్గం అవసరాలను చెప్పుకుని వస్తున్నారు. పైగా ఆయనను తమ ప్రాంతంలో పర్యటించమని కోరుతున్నారు.

ఇటీవల విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన కూడా పవన్‌ను కలసి తమ నియోజకవర్గం సమస్యలను ప్రస్తావించారు. పవన్‌ సైతం తనకు ఇష్టమైన శాఖలలో అభివృద్ధిని కోరుకునే వారు కావడంతో ఆయన కూడా టీడీపీ ఎమ్మెల్యేలకు హామీ ఇస్తున్నారు. సానుకూలంగా స్పందిస్తున్నారు.

మొత్తానికి కూటమి ప్రభుత్వమైనా జనసేన అధినేతతోనే పనులు ఎక్కువ చేయించుకోవడానికి తమ్ముళ్లు పోటీ పడుతున్నారని అంటున్నారు.

4 Replies to “పవన్‌తోనే తమ్ముళ్లకు పని”

Comments are closed.