ఏడెనిమిది దశాబ్ధాలు అయినా టాలీవుడ్ లో ఎన్ని నిర్మాణ సంస్థలు మిగిలాయి అని లెక్క వేసుకుంటే పట్టుమని పది బ్యానర్లు లెక్కకు రావు. పైగా ఈ బ్యానర్లు కూడా దాదాపు గత పదేళ్లలో వచ్చినవే ఎక్కువ. సినిమా నిర్మాణంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పెద్ద బ్యానర్లు ఏవీ ఇప్పుడు చాలా వరకు లేవు. వాళ్ల వారసులు ఎవ్వరూ సినిమా రంగంలోకి రాలేదు. రాలేకపోయారు.
గత దశాబ్ద కాలంలో వచ్చిన మార్పు ఏమిటంటే విదేశాలకు వెళ్లి బాగా సంపాదించిన యువతరం సినిమాల్లోకి రావడం. మైత్రీ మూవీస్ ఒక విధంగా ఓ పేరెంటల్ కంపెనీగా మారింది. మైత్రీ అధినేతలతో సంబంధాలు, చుట్టరికాలు, స్నేహాలు వున్నవారు ఒక్కొక్కరుగా సినిమా రంగంలోకి దిగుతున్నారు.
సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, సివిఎన్ ఇలా వచ్చిన వారే. ప్రతి మైత్రీ సినిమాకు ముందుగా ఓ కార్డ్ పడుతుంది. వెంకట సతీష్ కిలారు అంటూ.. ఇప్పుడు ఆయనే నేరుగా సినిమాల్లోకి వచ్చారు. రామ్ చరణ్- బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నారు. ఇది చాలక వరుసగా మరో రెండు మూడు భారీ సినిమాలకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.
అంటే మరో పెద్ద బ్యానర్ టాలీవుడ్ లోకి వస్తోంది అన్నమాట. బాలకృష్ణ- గోపీచంద్ మలినేని, బాబీ- చిరంజీవి ఇలా కాంబినేషన్ల సెట్ చేసుకునే ప్రయత్నంలో వుంది ఆ బ్యానర్. మైత్రీ మూవీస్ మాదిరిగానే కాంబినేషన్ల మీదే వెళ్తున్నారు. ఆ విధంగానే అడ్వాన్స్ లు ఇస్తున్నారు.
మొత్తం మీద టాలీవుడ్ లోకి మరో పెద్ద బ్యానర్ వస్తున్నట్లే. దాని వల్ల టాలీవుడ్ కు మంచిదే. ఎన్ని ఎక్కువ బ్యానర్లు అయితే అంత మంచిది.
No problem, heros arpestaru తొందరలో
జాయిన్ కావాలి అంటే