అల్లు అర్జున్ జన్మదినం- తెలుగు సినిమా కీర్తిపథం

ఎవరి బ్రాండ్ వేల్యూ నీడలోనో ఎదుగుతున్నాడనే అభిప్రాయం చెరిపేసి, తానే ఒక బ్రాండ్ గా మారాలనుకున్నాడు.

అందరికీ కేలెండర్ ఉన్నట్టే టాలీవుడ్ కి ఒక ప్రత్యేకమైన కేలండర్ ఉంటుంది. ఆగస్టు 22, సెప్టెంబర్ 2, ఆగస్టు 9, మే 20, అక్టోబర్ 23 ల మాదిరిగా కొన్ని ప్రత్యేక తేదీలుంటాయి. అవి స్టార్ల జన్మదినాలు. వాటిని ఫ్యాన్స్ పండుగగా జరుపుకుంటారు.

ఆ రోజు తమ అభిమాన హీరో తాలూకు కొత్త సినిమా స్టిల్‌లో, టీజరో ఆశిస్తారు. తమ అభిమాన నటుడి దర్శనం కోసం పరితపిస్తారు. బయటి వాళ్లకి ఇదంతా పిచ్చిలా అనిపించినా, ఆ పిచ్చే తెలుగు సినిమా రేంజ్ ని పెంచింది. ఎందరికో ఉపాధినిస్తోంది.

అలాంటి తేదీల్లో ఒకటి ఏప్రిల్ 8. ఈ తేదీకి పైన చెప్పుకున్న తేదీలన్నిటికంటే ప్రత్యేకత ఉంది. ఇది ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడి జన్మదినం. అవును, ఇది అల్లు అర్జున్ జన్మదినం- తెలుగు సినిమా కీర్తిపథం.

వారసత్వ సిరితో నటుడిగా అవతారమెత్తినా, శక్తివంతమైన టాలీవుడ్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా అభిమానగణం వెన్నుదన్నుతో ఎదిగినా, క్రమంగా తనకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకున్నాడు. ఎవరి బ్రాండ్ వేల్యూ నీడలోనో ఎదుగుతున్నాడనే అభిప్రాయం చెరిపేసి, తానే ఒక బ్రాండ్ గా మారాలనుకున్నాడు. ఆ దిశగా విశేషమైన కృషి చేసాడు. అల్లు బ్రాండ్ గా, ఐకాన్ స్టార్ గా తనని తాను నిలబెట్టుకున్నాడు.

రాజమౌళి అండలేకుండా టాప్ హీరోగా ఎదిగినవాడు అల్లు అర్జున్. ఇతర టాప్ హీరోలు ఎవరైనా రాజమౌళి అండతో ఎదిగినవాళ్లే, ఎదగాలనుకుంటున్నవాళ్లే. సుకుమార్ అండ ఉంది కదా అని అనుకోవచ్చు. కానీ “బాహుబలి” అనగానే దేశవ్యాప్తంగా రాజమౌళి, ప్రభాస్ ఇద్దరి పేర్లూ సమానంగా చెప్పుకుంటారు. “ఆర్ ఆర్ ఆర్” అనగానే రాజమౌళి పేరు తర్వాతే ఇద్దరి హీరోల పేర్లు వినిపిస్తాయి. కానీ “పుష్ప” అంటే అల్లు అర్జున్ పేరు వినిపించినంతగా సుకుమార్ పేరు వినపడదు. నాలుగేళ్లు “పుష్ప” అనే ఒకే సినిమాపై పని చేసి, కెరీర్ ని పణంగా పెట్టి నమ్మకంతో కృషి చేసి హిట్ కొట్టి చూపించాడు.

అన్నట్టు ఇంకొకటి. 2020 లో అలవైకుంఠపురములో విడుదల వేళ, మరో హీరో సినిమా విడుదలవుతుంటే అల్లు అర్జున్ తమ హీరోతో పోటీ ఏవిటి అని ఎద్దేవా చేసిన ఆ హీరో ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఈ రోజు అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నాడో వాళ్లకి అర్ధమయ్యే ఉంటుంది.

తనదైన శైలి డ్యాన్స్, తనదైన విధంలో డైలాగ్ డెలివెరీ, తన ముద్ర పడే తీరులో బాడీ లేంగ్వేజ్, తన ఉనికిని విస్తరంపజేసే పద్ధతిలో హై-స్కేల్ మేకింగ్..ఇలా అన్ని విషయాల్లోనూ ఎక్కడా రాజీ పడకుండా తన కెరీర్ శిల్పాన్ని తానే చెక్కుకుంటున్నాడు. తనకంటూ సొంత టీం ని ఏర్పాటు చేసుకున్నాడు. తనదొక ఎంపైర్ గా కనిపిస్తోంది.

రాం చరణ్ “ఆర్ ఆర్ ఆర్” తో కీర్తి గడించినప్పటికీ ఇప్పటికీ తండ్రి చాటు కొడుకే అన్నట్టు కనిపిస్తాడు. తనకంటూ ఓన్ టీం, వ్యక్తిత్వ ప్రదర్శన లాంటివి జరగడంలేదు. అల్లు అర్జున్ అలా కాదు.. పూర్తి ఇండివిడ్యువాలిటీని ప్రదర్శిస్తున్నాడు. ఇంట్లో వాళ్లకి, బంధువులకి ఎలా అనిపించినా ఫ్యాన్స్ కి నచ్చేది మాత్రం అదే.

ఇది పోటీ ప్రపంచం. సినీ రంగంలో ఆ పోటీ మరింత ఎక్కువ. నెపో కిడ్ అయినంత మాత్రాన జీవితమంతా ప్రశాంతంగా ఉంటుందని కాదు. ఎందరో నెపో కిడ్స్ ఆరిపోయారు. ఇంకెందరో కనీసం మిడ్ రేంజ్ హీరోగా అయినా ఎదగలేక చతికిలబడిపోయారు. అలాంటి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఎదిగే పట్టుదల, దీక్ష ఉండి.. విపరీతమైన కృషి చేయడం సామాన్యమైన విషయం కాదు.

మాస్ నటుడిగా తనని తాను స్కేలప్ చేసుకుంటూనే, వ్యక్తిగతంగా కూడా స్ట్రాంగ్ ఇండిపెండెంట్ పర్సనాలిటీని బయటపెడుతున్నాడు. తన కుటుంబ సభ్యులు ఒక పార్టీకి చెంది ఉండగా, తన మిత్రుడు వేరే పార్టీ తరపున పోటీ చేస్తూ ప్రచారానికి రమ్మంటే, మిత్రధర్మంతో వెళ్లి ప్రచారం చేసాడు.

గతంలో తన కుటుంబ సభ్యులు, తన నీడలో ఉన్న వ్యక్తులు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంటే వాళ్లకి తన సినిమాల్లో భాగస్వామ్యం కలిపించి డబ్బొచ్చేలా చేసాడు. ఆ రకంగా బంధుప్రీతి కూడా చూపించాడు, చూపిస్తుంటాడు.

పొరపాటు వల్లో, అజాగ్రత్త వల్లో సంధ్యా టాకీస్ సంఘటన జరిగినప్పుడు భయపడి దాక్కోవడం, దేశం వదిలి వెళ్లిపోవడం, భయంతో ఎవరి కాళ్లో పట్టుకోవడం లాంటివి చేయలేదు. హుందాగా లీగల్ ప్రొసీజర్ ఎదుర్కున్నాడు. జైల్లో రిమాండ్ ఖైదీగా ఒక రాత్రి గడిపాడు. బాధిత కుటుంబానికి ఆర్ధికంగా సాయం చేసాడు. చట్టం తన పని తాను చేసుకుపోయింది, తన తదుపరి సినిమా పని తాను చేసుకుంటూ పోయాడు.

అల్లు అర్జున్ చర్యలు కాంఫిడెన్స్ కి నిదర్శనాలు. అయితే అవి కొందరికి పొగరుగా కనిపించొచ్చు. తనని పెద్దరికంతోనో, పవర్ తోనో అదుపులో ఉంచుకుని తాము పిలిచినప్పుడల్లా పలకాలని ఎవరు అనుకున్నా వాళ్లకి లొంగడు. అల్లు అర్జున్ స్నేహానికి మాత్రమే లొంగుతాడని అతని స్నేహితులు కూడా చెప్తుంటారు.

ఇంత పేరున్నా, ఇన్ని విజయాలున్నా తన ఫ్యామిలీ ఇమేజ్ ని కూడా కాపాడుకుంటున్నాడు. భార్యా, పిల్లలతో క్వాలిటీ టైం గడుపుతుంటాడు. ఇది సమాజంలో తన గౌరవాన్ని నిలబెట్టే అంశం.

నేటికి 43 ఏళ్లు నిండిన వ్యక్తిగా, నటుడిగా అల్లు అర్జున్ తన వ్యక్తిత్వాన్ని తనదైన శైలిలో పరిమళింపజేయాలని, మరిన్ని విజయాలు పొందుతూ తెలుగు సినిమా కీర్తిని దేశ సరిహద్దులు దాటించాలని కాంక్షిస్తూ గ్రేట్ ఆంధ్ర జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

25 Replies to “అల్లు అర్జున్ జన్మదినం- తెలుగు సినిమా కీర్తిపథం”

  1. అన్న కి ఎలేవేషన్ ఇచ్చే రేంజ్ నుండి అన్న పార్టీ తరపున పోటీ చేసిన వ్యక్తికీ సపోర్ట్ చేసిన స్టార్ కి ఎలేవేషన్ ఇచ్చే రేంజ్ కి పడిపోయారు…తప్పదు బయటకి ఎలా రాసిన లోపల మీ ఎజెండా వేరు

  2. హీరోగా ఎంట్రీ నాటీ నుంచే సెపరేట్ బ్రాండ్ పెట్టుకుంటే బావుండేది… ఎదిగాక సెపరేట్ అవ్వడమే ఇక్కడ పాయింట్.

    1. ఔను ఎలక్షన్స్ ముందే వర్మని దూరం పెట్టి ఉంటే కూడా బావుండేది.

  3. ఫారెక్స్ మూతికి రూపాయి కాసంత చిల్లు పెట్టుకుని చెట్టుకింద మధుకరం చేసేవాడు చాలా మెరుగు ఇలాంటి రాతలతో సంపాదించే వాడి కంటే

  4. పెద్ద ఇరగదీసే నటుడు ఏమీకాదు. ఏదో నీలాంటి బిల్డప్ ల మీద చలామణి అయిపోతున్నాడు

  5. అంతా బానే రాసావ్ G A…. కాని వేరే హీరో లను తక్కువ చేసి రాయడం ఎందుకు?? నీ గురించి చెప్పేటప్పుడు ,, ఈనాడు తో పోలిస్తే ఎలా ఉంటుంది??

  6. Jag….gu payment late అయిందని ఇటు పలుకుతున్నావా …దీన్ని సెపరేట్ brand anaru..తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం అంటారు..చిరు కుటుంబం ఎప్పుడూ బానిసత్వం కోరుకోలేదు…అభిమానం తప్పా..వీళ్ళదే నక్క బుద్ధి…….వూసరవెల్లి ముం….జ dudaka

  7. కీర్తిపధం .. అంతంత పెద్ద పదాలు ఎందుకు గాని .. నీ అంతరంగం ఏంటో మాకు తెలుసు .. ఎక్కువ ఎక్సయిట్ అవ్వకు ..

  8. పైకొచ్చిన ఒకే ఒక రెడ్డి హీరో మన అర్జున్ రెడ్డి. అందుకేనమన సపోర్ట్.

    ( కన్వర్టెడ్ రెడ్డి అని బయట టాక్.. నాకేం తెలీదు)

  9. రాంచరణ్ తండ్రి చాటు కొడుకా, వ్యక్తిత్వ ప్రదర్శన చేయట్లేదా? అల్లు అరవింద్ అనే వ్యక్తికి తోడు చిరంజీవి కూడా ఉండబట్టే, ఈరోజు నువ్వు రాసిన ఈ

Comments are closed.