హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. కేసులో నిందితులుగా ఉన్న వాళ్లందరికీ ఉరిశిక్ష విధించింది. గతంలోనే ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. 2013లో జరిగిన ఈ పేలుళ్లలో 18 మంది మృతి చెందగా.. 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్ భత్కల్ ను 2013లో నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఇతడే ప్రధాన నిందితుడు. పథకానికి రూపకల్పన చేసిన మరో కీలక నిందితుడు రియాజ్ భత్కల్ పాకిస్థాన్ పారిపోయాడు. ఇతడు మినహా, మిగతా ఐదుగురికి ఉరిశిక్షలు పడ్డాయి.
2013.. ఫిబ్రవరి 21, సాయంత్రం 6 గంటల 58 నిమిషాలకు హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ లో బాంబు పేలుడు జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికే అక్కడికి సమీపంలో ఉన్న థియేటర్ దగ్గర మరో బాంబు పేలుడు జరిగింది. ఒక్కసారిగా భయంకరమైన శబ్దం. కాలికింద నేల కంపించింది. రెప్పపాటు కాలంలో విధ్వంసం జరిగిపోయింది. ఎటుచూసినా మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దగ్గరదగ్గరగా 2 బాంబు పేలుళ్లు జరగడంతో ఒకటే గందరగోళం, జనాలు పరుగులు తీశారు. నడిరోడ్డుపై మాంసం ముద్దలు.
ఈ కేసును ఎన్ఐఏ హ్యాండిల్ చేసింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ మొదలుపెట్టింది. పేలుళ్ల వెనక పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ఉన్నట్టు తేల్చింది. విచారణలో భాగంగా 3 ఛార్జ్ షీట్లు దాఖలు చేసి అసదుల్లా అక్తర్, జయా ఉర్ రెహ్మాన్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్ షేక్ పై ఆరోపణలు మోపింది. పాకిస్థాన్ పారిపోయిన రియాజ్ భత్కల్ ఇప్పటివరకు దొరకలేదు. ఈ కేసును విచారించిన ఎన్ఐఏ కోర్టు, వీళ్లను దోషులుగా ప్రకటించి ఉరిశిక్ష విధించింది. దీంతో వీళ్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు హైకోర్టు కూడా వీళ్ల ఉరిశిక్షను సమర్థించింది.
పాకిస్థాన్ కేంద్రంగా ఈ పేలుళ్లకు పథకం రచించారు. పాకిస్థాన్ నుంచి మంగళూరుకు పేలుడు పదార్థాలు, డబ్బు పంపించారు. మంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన ఉగ్రవాదులు, రామోజీ ఫిలింసిటీకి సమీపంలో ఉన్న అబ్దుల్లాపూర్ మెట్ లో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంట్లోనే బాంబులు తయారుచేశారు. పేలుళ్ల కోసం కుక్కర్లు, సైకిళ్లు, వైర్లు లాంటివి హైదరాబాద్ లోనే కొనుగోలు చేశారు.
అంతేకాదు, పేలుళ్లను వీళ్లు అబ్దుల్లాపూర్ మెట్ లోని క్వారీల్లో ట్రయల్ రన్ కూడా చేశారు. శబ్దాలు విన్న స్థానికులు, రోజూ జరిగే క్వారీలో పేలుళ్లు అనుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే దిల్ సుఖ్ నగర్ లో రెక్కీ నిర్వహించి మరీ బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు.
జాయిన్ అవ్వాలి అంటే
ఇప్పుడు హైకోర్టు. మళ్ళీ వీళ్ళు సుప్రీమ్ కోర్ట్, అక్కడే revision పిటిషన్లు, రాష్ట్రపతి క్షమాభిక్ష అభ్యర్ధనలు ఉంటాయా? వీళ్ళని ఎప్పుడు ఉరి వేస్తారో ఏమో