ప‌వ‌న్ కుమారుడికి గాయాలు.. జ‌గ‌న్ భావోద్వేగం!

సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్‌ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి నేను షాక్ అయ్యాను.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్, అన్నా లెజినోవా దంప‌తుల కుమారుడు మార్క్ శంక‌ర్ గాయాల‌పాలు కావ‌డంపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న‌, సానుభూతి వ్య‌క్త‌మ‌వుతోంది. మార్క్ త్వ‌ర‌గా కోలుకోవాల‌నే ఆకాంక్ష యావ‌త్ స‌మాజం నుంచి వెల్లువెత్తుతోంది. రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రూ ప‌వ‌న్ కుమారుడు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఈ సంద‌ర్భంగా మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురి కావ‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు ఆయ‌న సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్టు వైర‌ల్ అవుతోంది. ఆ పోస్టులో జ‌గ‌న్ ఏం కోరుకున్నారంటే…

“సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్‌ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి నేను షాక్ అయ్యాను. ఈ కష్ట‌కాలంలో నా ఆలోచనలన్నీ ప‌వ‌న్ కుటుంబంతోనే ఉన్నాయి. మార్క్ శంక‌ర్‌ త్వరగా, సంపూర్ణ ఆరోగ్య‌వంతుడిగా కోలుకోవాలని మ‌న‌స్సారా కోరుకుంటున్నాను” అని జ‌గ‌న్ పేర్కొన్నారు.

రాజ‌కీయంగా జ‌గ‌న్‌, ప‌వ‌న్ ఉప్పునిప్పులా వుంటారు. జ‌గ‌న్‌ను వ్య‌క్తిగ‌తంగా ప‌వ‌న్ ద్వేషిస్తున్నార‌నే అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో వుంది. అందుకే జ‌గ‌న్ ఎప్పుడూ ప‌వ‌న్ పేరు ప్ర‌స్తావించ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌రు. కానీ ప‌వ‌న్ కుమారుడికి అగ్ని ప్ర‌మాదంలో గాయాల‌య్యాయ‌ని తెలిసిన వెంట‌నే, రాజ‌కీయ వైరాన్ని ప‌క్క‌న పెట్టి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మ‌న ముందుకు రావాల‌ని జ‌గ‌న్ ఆకాంక్షించ‌డం హ‌ర్ష‌ణీయం. జ‌గ‌న్ స్పంద‌న ముఖ్యంగా జ‌న‌సేన శ్రేణుల మ‌న‌సు చూర‌గొనేలా వుంది.

46 Replies to “ప‌వ‌న్ కుమారుడికి గాయాలు.. జ‌గ‌న్ భావోద్వేగం!”

  1. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ లో పవన్ సీఎం గా ప్రోజెక్ట్ చేస్తూ జనసేన తో పొత్తు పెట్టుకుంటే సరి. ఎలాగూ CBN ఉన్నంత వరకూ ఈయాన్ని సీఎం చేయరు. జనసేన ఆశ కూడా తీరుతుంది.

  2. ఇలాంటి మంచి ముద్దులు 2019 -24 లో ఉంటే మరల సీఎం అయ్యి ఉండేవాడు . చాలా చాలా లేట్.

  3. ఇక్కడ మనం కొంచెం పాస్ట్ లోకి వెళదాం..

    ఇదే ట్వీట్ 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసి ఉంటె.. తమరి రాతలు మరోలా ఉండేవి..

    ..

    పవన్ కళ్యాణ్ కి బట్టర్ పూస్తున్న బాబు..

    పవన్ కళ్యణ్ తో పొత్తు కోసం చిన్న పిల్లలను కూడా వాడుకొంటున్న చంద్రబాబు..

    రాజకీయాల్లో ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్న చంద్రబాబు ..

    ..

    నిజమా కాదా వెంకటి..

    మరి జగన్ రెడ్డి ట్వీట్ చేస్తే మాత్రం.. మీకు భావోద్వేగం పొంగిపోయిందని.. కారిపోయింది.. తవికలు వదులుతున్నావా.. ఛీ..

      1. అవును.. ఎక్కడ మీ జగన్ రెడ్డి మా బట్టలు ఊడదీసి చూసేస్తాడో .. అని ఫ్రస్ట్రేషన్..

  4. “అందుకే జ‌గ‌న్ ఎప్పుడూ ప‌వ‌న్ పేరు ప్ర‌స్తావించ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌రు.”..but behind the scenes, he will ask his followers to abuse Pavan…siggu leni che ddi fellow

  5. “అందుకే జ‌గ‌న్ ఎప్పుడూ ప‌వ‌న్ పేరు ప్ర‌స్తావించ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌రు.”…so Jagan has nothing to do with all the abuse thrown at Pavan?

    siggu vadilesava?

  6. “అందుకే జ‌గ‌న్ ఎప్పుడూ ప‌వ‌న్ పేరు ప్ర‌స్తావించ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌రు.”..lol

  7. ఆరే , భావోద్వేగం అంటే

    సొంతగా ఫోన్ చేసి నేరుగా పవన్ తో మాట్లాడటం.

    మోదీ చేసినట్లు.

    దానిని భావోద్వేగం అంటారు.

    అంతే గాని, ఎవడు పెట్టాడో తెలియని పోస్ట్ చేయడం కాదు.

  8. భావోద్వేగాలు లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకులే?! అవి మన personality కి suit అవ్వవు!

  9. జనాల నీ గుర్తు చేసి మరీ,

    కెలికి మరీ జగన్ ని,

    దొబ్బులు పెట్టించడం లో వెంకట్ రెడ్డి తర్వాతే ఎవరైన.

    జగన్ సొంతగా ఆ పోస్ట్ చేశాడు అంటే తాడేపల్లి ప్యాలెస్ వాచ్ మన్ కూడా లాగు ఎట్టి మరీ నవ్వుతాడు.

    1. Of course సొంత పిల్లొడికి ఫైర్ యాక్విడెంట్ అంటే కన్నతండ్రీగా ఆమాత్రం భయపడటం సహజం దానికి కూడా తిట్టాలసిన అవసరం లేదు

Comments are closed.