ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డిపై దాడికి సొంత శ్రేణులే య‌త్నం!

పోలీసులు అడ్డుకోవ‌డంతో దాడి నుంచి రాంగోపాల్‌రెడ్డి త‌ప్పించుకోగ‌లిగారు.

వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం టీడీపీలో ఆధిప‌త్య పోరు ప‌తాక‌స్థాయికి చేరింది. పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్‌గా బీటెక్ ర‌వి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డికి కూడా టీడీపీ పెద్ద‌ల‌తో స‌న్నిహిత సంబంధాలున్నాయి. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి స‌విత ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన పులివెందుల నియోజ‌క‌వ‌ర్గ విస్తృత‌స్థాయి స‌మావేశంలో ఎమ్మెల్సీపై సొంత పార్టీ శ్రేణులే దాడికి య‌త్నించాయి.

దీంతో స‌మావేశం ర‌సాభాస‌గా మారింది. చివ‌రికి రాంగోపాల్‌రెడ్డిని పోలీసులు వెళ్లి కాపాడాల్సిన ద‌య‌నీయ స్థితి నెల‌కుంది. నియోజ‌క‌వ‌ర్గ విస్తృత స‌మావేశంలో భాగంగా వేదిక‌పైకి ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి వెళ్లారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వేదిక‌పై రాంగోపాల్‌రెడ్డి కూచోడానికి వీల్లేదంటూ బీటెక్ ర‌వి వ‌ర్గీయులు ర‌చ్చ‌ర‌చ్చ చేశారు. ముఖ్యంగా వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసులో నిందితుడైన టీడీపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు పార్థ‌సార‌థిరెడ్డి తమ్ముడు శేషారెడ్డి, ఆయ‌న అనుచ‌రులు గొడ‌వ‌కు దిగారు. ఎమ్మెల్సీపై దాడికి తెగ‌బ‌డ్డారు.

వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు రాంగోపాల్‌రెడ్డి వ‌త్తాసు ప‌లుకుతున్నార‌నేది వాళ్ల ఆరోప‌ణ‌. మైనింగ్ విషయంలో అధికారుల‌కు త‌ప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ రాంగోపాల్‌పై దాడికి దిగారు. అలాగే ట్రిపుల్ ఐటీలో ఉద్యోగాలు, క్యాంటీన్ లను సైతం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వైసీపీ శ్రేణులకు అమ్ముకున్నారంటూ పెద్ద ఎత్తున సమావేశంలో నినాదాలు చేశారు.

మ‌రోవైపు వేదిక దిగ‌డానికి రాంగోపాల్‌రెడ్డి స‌సేమిరా అన్నారు. దీంతో ఆయ‌న‌పై దాడికి ప్ర‌య‌త్నించారు. పోలీసులు అడ్డుకోవ‌డంతో దాడి నుంచి రాంగోపాల్‌రెడ్డి త‌ప్పించుకోగ‌లిగారు. మ‌రోవైపు పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘ‌న‌ను స‌హించేది లేద‌ని మంత్రి స‌విత హెచ్చ‌రిస్తున్నా, ఏ ఒక్క‌రూ ప‌ట్టించుకోలేదు. ఇలాంటి చ‌ర్య‌ల్ని ఉపేక్షించేది లేద‌ని, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు ఆర్‌.శ్రీ‌నివాస్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

5 Replies to “ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డిపై దాడికి సొంత శ్రేణులే య‌త్నం!”

    1. మందికి పుట్టిన మంజర్ lam జా ko డాకా.. మీ హమ్మకు ఒక డు లేడా రా..పేరు కూడా తేడా గా ఉంది..

Comments are closed.