జూలై 24.. విశ్వంభర విడుదల!

కృష్ణా జిల్లా నందిగామ దగ్గర వున్న భారీ ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర ఈ పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎప్పుడు వస్తుంది.. మెగాస్టార్ విశ్వంభర సినిమా.. చిరకాలంగా టాలీవుడ్ లో వినిపిస్తున్న ప్రశ్న. మెగాస్టార్ హిట్ సినిమాల డేట్ లు ఒకటీ ఒకటీ చెబుతూ, ఆ డేట్ కు విడుదల అంటూ గ్యాసిప్ లు వినిపిస్తూ వచ్చాయి. ఆఖరికి ఇప్పటికి ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.

జూలై 24న న విశ్వంభర విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇంద్ర రిలీజ్ డేట్. విశ్వంభర సినిమాను యువి సంస్థ భారీ ఖర్చుతో నిర్మిస్తోంది. దాదాపు రెండు వందల కోట్లకు పైగా ఖర్చు. ఫస్ట్ గ్లింప్స్ గ్రాఫిక్స్ సరిగ్గా రాకపోవడంతో, ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. దాంతో బోలెడు గ్యాసిప్ లు. వివి వినాయక్ ఎంటర్ అయ్యారు. కొంత ఆయన కూడా వర్క్ చేసారని కూడా వార్తలు వినిపించాయి.

మరోపక్క నాన్ థియేటర్ అమ్మకాల మీద అనుకున్న రేట్లు రాలేదనే టాక్ వినిపించింది. మరి ఇప్పటికీ అమ్మకాలు ఏ మేరకు జరిగాయో ఇంకా తెలియదు కానీ, విడుదల డేట్ మాత్రం ఫిక్స్ చేసారని తెలుస్తోంది. జూలై 24న విడుదల అంటూ డేట్ అనౌన్స్ మెంట్ వచ్చినట్లు తెలుస్తోంది.

12న ఫస్ట్ సాంగ్

ఇదిలా వుంటే ఈ నెల 12న ఫస్ట్ సాంగ్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ పాట రాముడి మీద వుంటే భక్తి పాట. అందుకే కృష్ణా జిల్లా నందిగామ దగ్గర వున్న భారీ ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర ఈ పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కీరవాణి స్వరకల్పన చేసిన ఈ పాట సినిమాకు హైలైట్ అవుతుందని మేకర్లు నమ్ముతున్నారు.

5 Replies to “జూలై 24.. విశ్వంభర విడుదల!”

Comments are closed.