జస్ట్ ఒక్క చిన్న వీడియో బైట్. అల్లు అర్జున్-అట్లీ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువరించేందుకు వదిలిన చిన్న వీడియో బైట్. దీంతోనే ఆ సినిమా మీద అంచనాలు అమాంతం పెంచేసారు.
పుష్ప 2 తరువాత బన్నీ చేయబోయే సినిమా ఇది. అట్లీతో సినిమా అంటే ఏదో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనుకున్నారు. కాదు, బోలెడు గ్రాఫిక్స్ సిజి వర్క్ వుంటాయని ముందే ‘గ్రేట్ ఆంధ్ర’ వెల్లడించింది. ఇప్పుడు ఆ సినిమా ప్రకటన వీడియో బైట్ ఆ విషయాన్ని ధృవీకరించింది.
సన్ పిక్చర్స్ భారీ వ్యయంతో నిర్మించే ఈ సినిమా ప్రకటన విడియోను కొంత మేరకు లాస్ ఏంజెల్స్ లోని గ్రాఫిక్స్ స్టూడియోలో చిత్రీకరించారు. అక్కడి నిపుణులతో బన్నీ, అట్లీ మాట్లాడిన సన్నివేశాలను రికార్డు చేసారు. రకరకాల క్రీచర్స్, గన్స్ ఇలా చాలా విషయాలు వీడియోలోకి తెచ్చారు. అంతే కాదు, కథ అదిరిపోయిందని అక్కడి నిపుణులు చెప్పిన మాటలు రికార్డు చేసారు.
దీంతో బన్నీ ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేసాయి. సినిమా నెక్ట్స్ లెవెల్ లో వుండబోతోందని అర్థం అయిపోయింది. ఇప్పటి నుంచే సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. రాజమౌళితో సినిమా చేయకుండానే, ఆ రేంజ్ కు చేరుకున్న హీరోగా బన్నీకి పేరు ఇప్పటికే వచ్చింది. ఇప్పుడు సిజి వర్క్ లతో కూడిన భారీ సినిమా చేసి ఆ పేరును మరింత పెంచుకోబోతున్నాడని అర్థం అయింది.
జాయిన్ అవ్వాలి అంటే
తోలు బొమ్మలాటకు కూడా ఏలేవేషన్ .. అంత పూనకాలు ఎందుకు వస్తున్నాయి నీకు?
Anni vuntayi, story vundadu.
ఇలా లేపి లేపి మా అన్న నీ 11 తో gud.pin.చారు..
ఇపుడు ఐకాన్ స్టార్ నీ ఏం చేస్తారో మీ ఊహ కి వదిలేస్తున్నా.
Over action gallu yee tamil industry