కాకాణిని అరెస్ట్ చేయాల‌నే పంతం!

మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డిని అరెస్ట్ చేయాల‌ని కూట‌మి స‌ర్కార్ ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డిని అరెస్ట్ చేయాల‌ని కూట‌మి స‌ర్కార్ ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్టు తెలుస్తోంది. కూట‌మి ప్ర‌భుత్వంపై ఆయ‌న ఒంటికాలిపై లేస్తుంటారు. ఒక‌వైపు వైసీపీ నాయ‌కుల్ని అరెస్ట్ చేస్తూ, ప్ర‌భుత్వం బెద‌ర‌గొడుతోంది. మంత్రి నారా లోకేశ్ నోరు తెరిస్తే చాలు, రెడ్‌బుక్ పేరు చెప్పి భ‌య‌పెట్టాల‌ని అనుకుంటున్నారు. రెడ్‌బుక్ అంటే కేసుల్లో ఇరికించ‌డం, రోజుల త‌ర‌బ‌డి జైలులో పెట్ట‌డం. ఇదే రెడ్‌బుక్ అర్థంగా అంద‌రికీ అర్థ‌మైంది.

ఈ నేప‌థ్యంలో మైన్స్‌లో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని పొద‌ల‌కూరు పోలీసులు కాకాణిపై కేసు న‌మోదు చేశారు. ఇది చాల‌ద‌న్న‌ట్టు ఆయ‌న‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. ఇప్ప‌టికే మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జినీపై ఎస్సీ, ఎస్టీ కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కాకాణి ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌పై కేసుల్ని క్వాష్ చేయాల‌ని పిటిష‌న్ వేశారు. మ‌ధ్యాహ్నానికి కేసు విచార‌ణ వాయిదా ప‌డింది.

మ‌రోవైపు విచార‌ణ‌కు రావాలంటూ కాకాణి ఇంటికి వ‌రుస‌గా పోలీసులు నోటీసులు అంటించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు గ‌ట్టి మ‌ద్ద‌తుగా ప్ర‌త్య‌ర్థుల‌పై కాకాణి దూకుడుగా మాట్లాడుతున్నారు. కాకాణి నోరు మూయించాలంటే కేసులొక్క‌టే మార్గ‌మ‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు భావిస్తున్నార‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. అయితే ఇలాంటి కేసుల‌కు, జైలుకు భ‌య‌ప‌డే ప్ర‌శ్నే లేద‌ని కాకాణి ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

అయిన‌ప్ప‌టికీ కాకాణి అరెస్ట్ నుంచి త‌ప్పించుకోడానికి అజ్ఞాతంలో వుంటున్నారు. ఇప్ప‌టికే కాకాణిని అరెస్ట్ నుంచి మిన‌హాయింపు ఇవ్వ‌లేమ‌ని హైకోర్టు ఒక కేసు విష‌యంలో స్ప‌ష్టం చేసింది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న న్యాయ‌పోరాటం ఆప‌డం లేదు. హైకోర్టులో ఉప‌శ‌మ‌నం దొర‌క్క‌పోతే, సుప్రీంకోర్టును ఆయ‌న ఆశ్ర‌యించొచ్చు.

ముఖ్యంగా కాకాణి ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి అయిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు చెబుతున్నారు. కాకాణిని ఎలాగైనా అరెస్ట్ చేయాల‌నే సోమిరెడ్డి పంతం ప‌ట్ట‌డంతో ప్ర‌భుత్వం కూడా వేగంగా పావులు క‌దుపుతోంద‌ని అంటున్నారు. ప్ర‌భుత్వం అనుకుంటున్న‌ట్టుగా కాకాణిని అరెస్ట్ చేయ‌గ‌ల‌దా? అనేదే ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

5 Replies to “కాకాణిని అరెస్ట్ చేయాల‌నే పంతం!”

  1. ఏమిటో ఒకడు అరెస్ట్ అవ్వడాన్నికి సిద్దం అంటాడు, ఇంకొకడు బెదరం అంటారు, విచారణ కు రమ్మంటే మాత్రం అజ్ఞాతంలోకి పోతారు

    1. పంతానికి వెల్లితె ఈయన ముందస్తు బైల్ కి వెళ్ళె వరకూ అర్రెస్ట్ చెయకుండా కూర్చుంటారా?

  2. ముందు 11 రెడ్డి ని కంప్లీట్ గా ఎలిమినేట్ చెయ్యండి, వాడుంటే AP , India కి దరిద్రం.

Comments are closed.