గ్రీన్ కార్డ్ పెళ్లికొడుకుల దీన పరిస్థితి

వరుడికి అమెరికన్ గ్రీన్ కార్డ్ ఉంటే చాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసే వధువులు ఎందరో.

వరుడికి అమెరికన్ గ్రీన్ కార్డ్ ఉంటే చాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసే వధువులు ఎందరో.

గ్రీన్ కార్డ్ ఉంటే అమెరికాలో శాశ్వత నివాసం ఉన్నట్టే అని, దాదాపు పౌరసత్వం వచ్చేసినట్టే అని ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ట్రంపు బాబు దెబ్బకి ఆ అభిప్రాయం మారుతోంది.

అమెరికన్ పాస్పోర్ట్ చేతిలో ఉంటే తప్ప ఆ దేశం ఎవర్నీ ప్రశాంతంగా ఉంచట్లేదు. గ్రీన్ కార్డ్ ఉన్నా కూడా “నువ్వు విదేశీయుడివే” అని గుర్తు చేసి మరీ గుచ్చుతోంది. గ్రీన్ కార్డున్న వాళ్లు ఏ తప్పు చేస్తారా అని చూస్తూ, దొరకగానే “డిపోర్టేషన్” అంటున్నాయి అమెరికన్ వ్యవస్థలు. ఈ అవస్థలన్నీ పడుతూ సిటిజెన్షిప్ రావడానికి ఇంకా ఎంత కాలముందా అని కౌంట్ డౌన్ లెక్కలేసుకుంటున్న జనాలున్నారు.

గ్రీన్ కార్డ్ చేతికొచ్చాక ఐదేళ్లు “పద్ధతిగా” ఉంటే పౌరసత్వం పొంది పాస్పోర్ట్ తెచ్చుకునే వీలుంటుంది. “పద్ధతి” అంటే ఏంటి?

– విదేశాల్లో కంటిన్యూగా ఎక్కువనాళ్లు ఉంటే గ్రీన్ కార్డ్ పోవచ్చు.
– ఏ క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్నా గ్రీన్ కార్డ్ గోవిందే.
– గ్రీన్ కార్డుల కాల పరిమితి 10 ఏళ్లు. ఏ కారణం చేతనైనా అమెరికన్ పౌరసత్వాన్ని తీసుకోకోకపోతే నిర్ణీత సమయంలో గ్రీన్ కార్డ్ రిన్యూవల్ చేయించుకోవాలి.

కొందరు భారతీయ బడాబాబులు గ్రీన్ కార్డ్ చేతిలో ఉన్నా పౌరసత్వం తీసుకోకుండా కూర్చున్నవాళ్లున్నారు. దానికి ప్రధాన కారణం ఇండియాలో రాజకీయాలపై ఆసక్తి.

ఎందుకంటే అమెరికన్ పౌరసత్వం తీసేసుకుంటే ఇండియన్ పాలిటిక్స్ లోకి దిగడానికి లేదు. అందుకే అమెరికాలో సంపాదించిన డబ్బుని ఇండియాలో దించి, ఎన్నికల్లో దంచికొట్టి పదవులు చేపట్టినవాళ్లు మనకి తెలుసు. అలా పదవులుచ్చాక ఇండియాలో ఎక్కువనాళ్లు ఉండాల్సి వస్తుంది. అలా ఉంటే గ్రీన్ కార్డ్ కోల్పోవాల్సి వస్తుంది. అంతే కాదు, గ్రీన్ కార్డ్ అనేది అమెరికాలో ఉంటూ, అమెరికాలో పని చేసుకోవడానికి ఇచ్చేది. అంతే కానీ మరో దేశం వెళ్లి అక్కడ రాజకీయాల్లో పదవులు పొందడానికి కాదు. కనుక ఫోకస్ చేస్తే గ్రీన్ కార్డ్ పోవడం ఖాయం.

పోతే పోయిందిలే..గ్రీన్ కార్డ్ పోతే మాత్రమేంటి? రూ 45 కోట్లు (5 మిలియన్ డాలర్లు) పాడేసి ట్రంప్ ప్రకటించిన “గోల్డ్ వీసా” కొనుక్కోగలరులే ఆ బడాబాబులు, అనుకోవచ్చు. కానీ అది ఇంకా ప్రకటనగానే ఉంది. అది చలామణీలోకి వచ్చినప్పుడు సంగతి. రాదని చెబుతున్నవాళ్ళే ఎక్కువ. దానికి కారణాలు అనేకం.

సరే ఆదలా ఉంచితే, మ్యాట్రిమనీ కేంద్రాల్లో ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ల కన్నా గ్రీన్ కార్డున్న పెళ్లికొడుకులుకే డిమాండుండేది. ఇప్పుడది పోయిందన్నది తాజా వార్త.

మ్యాట్రిమనీ వాళ్లు చెప్పేదేంటంటే, “అమెరికన్ సిటిజెన్షిప్ ఉంటే తప్ప చాలామంది అమ్మాయిలు అమెరికన్ సంబంధాలకి ఒప్పుకోవట్లేదు. గ్రీన్ కార్డుని కూడా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగ చూస్తున్నారు”-అని. దీనినిబట్టి ట్రంపు బాబు దెబ్బ ఏ రేంజులో ఉందో చూడండి.

ఇక అమెరికాపై క్రేజ్ ఉండడానికి ఏకైక కారణం డాలర్ విలువ. అది ఎప్పుడూ కిందకి పడిన దాఖలాలు లేవు. ఎప్పుడూ పెరగడమే దానికి తెలుసు. ఆఖరికి కరోనా సమయంలో ప్రభుత్వం డాలర్లు ముద్రించి ప్రజలకి పంచినా కూడా, దాని విలువ పెరిగిందే తప్ప తగ్గలేదు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి ధరలు మూడింతలయ్యి జనం ఇబ్బంది పడినా, అంతర్జాతీయ విపణిలో డాలర్ విలువకి ఢోకా లేకుండా పోయింది. కానీ తాజాగా డాలర్ విలువ పడడం చూస్తున్నాం. ఆల్రెడీ రెండ్రూపాయల పైచిలుకు పడింది.

ట్రంప్ టారిఫ్ విధానాలు, పూటకో ప్రకటన..ఇలాగే కొనసాగితే డాలర్ 80 రూపాయలకి కూడా వస్తుందని ఆర్ధికవేత్తల అంచనా. అలా జరిగితే డాలర్ మీద మోజు కూడా తగ్గుతుంది.

ఇప్పుడైనా మోజు ఉన్నంతలో చేయగలిగింది ఏమీ లేదు. మునుపట్లాగ అక్కడ ఉద్యోగాలు రావట్లేదు. వచ్చినా ఎప్పుడు పోతాయో తెలియట్లేదు. వీసాలే ఊడిపోయే పరిస్థితులున్నాయి కాస్త గీత దాటినా.

విద్యార్థులకి పార్ట్ టైం జాబ్ చేసుకునే యోగం లేదు; హెచ్ 1 బి లు ధైర్యం చేసి జాబ్ మారే పనులు చేసే సీన్ లేదు; గ్రీన్ కార్డ్ ఉన్నా సేఫ్టీ లేదు.

ప్రతివాళ్లూ “ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరో..” అని పాడుకుంటున్నారు.

ఈ లెక్కలో అమెరికా కలలు కనే యువత తగ్గడం సహజం. గొర్రెల మందల్లాగ అందరూ అమెరికా బాట పట్టకుండా కొత్త మార్గాలు అన్వేషించి దేశాన్ని కొత్త దారిలో నడిపించే యువతని చూస్తామని ఆశిద్దాం.

దర్భశయనం శ్రీరామకృష్ణ

24 Replies to “గ్రీన్ కార్డ్ పెళ్లికొడుకుల దీన పరిస్థితి”

  1. మిడి మిడి జ్ఞానం ఉన్న ఆర్టికల్. ఇక్కడ

    రాజకీయాల్లోకి రావాలని అక్కడ సిటిజెన్షిప్ తీసుకోరా?

  2. అసలు American citizenship ఉన్న వాళ్ళు Indians ని పెళ్లి చేసుకోవడమనేది ఒక భ్రమ మాత్రమే. వాళ్ళు సిటిజెన్ అయ్యారంటే కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ కుటుంబాలు అక్కడే వుండిపోవటం వల్ల Cultural differences చాలా ఉంటాయి.

      1. Just a few compared how many kids you think there are in USA. That’s only an exception. In addition to GC and Citizen kids there are quite a lot of H4 kids that are in danger of losing the status once they reach 21 years. Since they are all brought up in US it is too difficlut for them to think of marrying someone they cannot really adjust culturally. I am not talking of exceptions again.

  3. ఎవరు చెప్పారో..

    మాకు ఇక్కడే బోల్డు సంబంధాలు వున్నాయి, ఇండియా నుంచి వెతుక్కునే ఆలోచన లేదు. పెళ్ళి అయ్యాక 2 సంవత్సరాలు పడుతుంది ఇండియా లో వున్న పార్టనర్ కి గ్రీన్ కార్డు రావడానికి.

  4. సొంత దేశం లో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్…పరాయి దేశం లో పెళ్లి కూడా చావు లాంటిదే బ్రదర్

  5. This article has no sense, NRI software engineers and MS students still has lot of craze and first preference for marriages in Andhra. All the flights from Hyderabad travelling to USA everyday filled with 80% these people only.

  6. మీ లెక్కలో విదేశాలకు చదువుల కి వెళ్లిన వారు అందరూ గొర్రె మందలేన?

    మీరు అమెరికా వెళ్ళినప్పుడు మీరు గొ*ర్రె నా లేక కు*క్క నా ?

  7. నైనా .. గ్రీన్ కార్డ్ రావడానికే అమెరికా వచ్చాక 10 ఏళ్లు మినిమం పడుతుంది అంటే తక్కువలో తక్కువ 35 ఏళ్లు … ఆపైన సిటిజెన్ అంటే ఇంకో ఐదేళ్లు అంటే 40 ఏళ్లు… నువ్వు చెప్పేదాని ప్రకారం 21-25 వయసు అమ్మాయిలు 40 ఏళ్ల వాళ్లని పెళ్లి చేసుకోవడానికి ఎగబడుతున్నారు అంటావ్ … ఏమి చేద్దామని … ఏదో రాయాలి కదా అని నోటికొచ్చింది కుశావ్

  8. Are you saying green car brides are in a good situation than bridegrooms.

    you could have said green card holders are having trouble finding matches in India.

    nowdays most of young people with green cards grew up in USA and they date someone in USA and get married. They are not looking for matches from India.

    young brides and grooms who are us citizens are mostly born and raised in USA and they get married.

    DONT WRITE HALF KNOWLEDGE ARTICLES SIR.

    WHAT MAKES YOU THINK THAT GREEN CARD GROOMS ARE IN DEENA STHITHI.

Comments are closed.