వార్ 2 – షర్ట్‌లెస్ ఎన్టీఆర్

సిక్స్ ప్యాక్ లుక్ షూట్‌ను కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ ముంబయిలో పూర్తి చేశారు.

సిక్స్ ప్యాక్ చేసి ఉపయోగం ఏమిటి? బాడీ చూపించనప్పుడు! అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌ను ప్రదర్శించినప్పుడు ఫ్యాన్స్ ఉర్రూతలూగారు. మాస్ అప్పీల్ అనేది అలాంటిదే. ఇప్పటికీ అదే స్టిల్‌ను ఫ్యాన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మళ్లీ తర్వాత అలాంటి లుక్ ఇప్పటివరకు రాలేదు. ఈ లోటును వార్ 2 సినిమా తీర్చబోతున్నట్లు తెలుస్తోంది. వార్ 2 లో ఇంట్రడక్షన్ ఫైట్ సీన్‌లోనే ఎన్టీఆర్ షర్ట్‌లెస్‌గా కనిపిస్తారని తెలుస్తోంది.

ఈ మాస్ యాక్షన్ బిట్ పది నుంచి ఇరవై నిమిషాల మధ్య ఉంటుందని తెలుస్తోంది. వార్ 2 ఈ సమ్మర్ ఎండ్ లో, ఆగస్ట్ 14న రాబోతోంది. విశ్వంభర తర్వాత రాబోయే పెద్ద సినిమా ఇదే. హిందీ సినిమా అయినా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడం, ఎన్టీఆర్ ఒక హీరోగా నటించడం వల్ల తెలుగు నాట కూడా భారీ క్రేజ్ ఉంది. తెలుగులో భారీగా విడుదలకు సన్నాహాలు, చర్చలు జరుగుతున్నాయి. మరో హీరో హృతిక్ రోషన్ కూడా మన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. పైగా, ఈ ఇద్దరి మీద నాటు నాటు లాంటి డ్యాన్స్ సాంగ్ ఉంది.

సిక్స్ ప్యాక్ లుక్ షూట్‌ను కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ ముంబయిలో పూర్తి చేశారు. షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

One Reply to “వార్ 2 – షర్ట్‌లెస్ ఎన్టీఆర్”

Comments are closed.