దేశ సంపద అంతా కార్పోరేట్ల చేతుల్లో!

ఈ దేశంలో ఉన్న మూల సంపద అంతా కార్పోరేట్ల చేతుల్లోనే ఉందని సినీ హీరో, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ దేశంలో ఉన్న మూల సంపద అంతా కార్పోరేట్ల చేతుల్లోనే ఉందని సినీ హీరో, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దేశంలో పది శాతం మాత్రమే ఉన్న కార్పోరేట్లకు సంపద అంతా దోచి పెట్టే విధానం అమలు అవుతోందని ఆయన అన్నారు. దీనిని అంతా వ్యతిరేకించాలని ఆ విధంగా చైతన్యం రావాలని ఆయన పిలుపు ఇచ్చారు.

విశాఖలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల తీరు మీద ఫైర్ అయ్యారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. భిన్న మతాలు తెగలు జాతులు ఉన్న ఈ దేశానికి అందరినీ కలిపే రాజ్యాంగం ఉందని అన్నారు. అదే అందరికీ రక్షంగా ఉండాలని అంబేద్కర్ రచించారు అని గుర్తు చేశారు.

ఈ దేశాన్ని సమిష్టిగా కలిపి ఉంచుతూ లౌకిక వాదాన్ని చాటి చెప్పిన వారుగా అంబేద్కర్ ఉన్నారని అన్నారు. అటువంటి రాజ్యాంగం విషయంలో ఉల్లంఘన జరుగుతోందని ఆయన విమర్శించారు. ప్రైవేటీకరణ పేరుతో జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని ఆయన కోరారు. విద్య వైద్యం ప్రైవేట్ పరం అయితే అది మొత్తం సమాజానికే ఇబ్బందిగా మారుతుందని ఆయన హెచ్చరించారు.

ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు కావాలీ అంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ఒక్కటే మార్గమని నారాయణ మూర్తి అన్నారు. దేశ మూల సంపద అందరికీ చెందాలని దాని కోసం అంతా పోరాడాలని అన్నారు. కార్మిక చట్టాలతో పాటు అన్నీ సక్రమంగా అమలు అయ్యేలా ఉద్యమించాలని కోరారు.

5 Replies to “దేశ సంపద అంతా కార్పోరేట్ల చేతుల్లో!”

  1. రిజర్వేషన్స్ అని అడుక్కన్నత పని చేయకుండా ఏదయినా దగ్గర్లో సముద్రానికి వెళ్లి మొత్తం కట్టకట్టుకుని దూకేయచ్చు గ. ప్రైవేట్ జాబ్స్ లో రిజర్వేషన్స్ ఎవడు ఒప్పుకోడు ఇచ్చిన చేయలేరు ఎందుకంటే గంట గంట కు ఏమి చేసావో చెప్పాలి. గౌట్ జాబ్ లాగా సాఫీగా ఉండదు. కాళ్లు లేనోళ్ళు కూడా ఎదో పని చేసుకుని బ్రతుక్కుంటున్నారు. మీరు ఇంకా రిజర్వేషన్స్ లేకుంటే బ్రతకలేము అనేలా యువకులకు చెడు నూరిపోస్తున్నారు.

  2. రిజర్వేషన్స్ ఎంత తగ్గించి కష్టపడే తాత్వానికి అంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే దేశం బాగుపడుతుంది…రిజర్వేషన్స్ తో ఉద్యోగాలు పొందాక అంతా లంచ గొన్డులు, బద్ధకస్తులు తయారయ్యారు…..అంత కన్నా గొప్ప మార్పు ఏమి లేదు……

  3. కార్పొరేట్ లు తరిమేసి మనం చిప్ప పట్టుకు తిరుగుదాం వాళ్ళు చేసిన తప్పు నాలుగు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు లాభం పొందడం ప్రభుత్వానికి పన్నులు కట్టడం మీకు తప్పుగా వుంది నీకు ఇష్టం లేకపోతె ప్రైవేట్ జాబ్ మానెయ్ దాంట్లో వాడికి ఎవరు అవసరం ఉంటే వాళ్ళను పెట్టుకొంటారు మధ్యలో నీ బొడిపెత్తనం ఏమిటి ముందు నీ పిల్లలు ఎక్కడ చదివేరు నీవు ఎక్కడ వైద్యం చేయించుకొంటున్నావో చెప్పు ఆ కార్పొరేట్ కంపెనీ లలో షేర్ లలో సామాన్యులే పెట్టుబడి దార్లు గ వున్నారు ప్రభుత్వ రంగాన్ని సంకనాకించేరు ఇక ప్రైవేట్ రంగం మిగిలిపోయింది

Comments are closed.