అసలే కెరీర్ స్పాన్ తక్కువ. ఉన్నంతలో సినిమాలు చేసి చక్కబెట్టుకుందామని చూసే హీరోయిన్లే ఎక్కువ. అయితే 20 ఏళ్లుగా పరిశ్రమలో కొనసాగుతున్న తమన్న లాంటి హీరోయిన్ల మైండ్ సెట్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది.
చాలా చూసేశాం.. చాలా చేసేశాం.. అనే ఫీలింగ్ లో ఉంటారు వీళ్లు. అయినప్పటికీ అప్పుడప్పుడు తమ వద్దకొచ్చే పాత్రలతో కాస్త ఎక్సయిట్ అవుతుంటారు. ప్రస్తుతం అలాంటి భావోద్రేకంలోనే ఉంది మిల్కీబ్యూటీ.
ఓదెల-2 సినిమాలో చేసిన శివశక్తి పాత్ర తన కెరీర్ ను మరో ఎత్తుకు చేరుస్తుందని ఆమె నమ్ముతోంది. అంతేకాదు, అనుష్కకు అరుంధతి ఎలా మైల్ స్టోన్ గా నిలిచిందో, తనకు ఓదెల-2 అలా నిలిచిపోతుందని ఆశ పడుతోంది.
ఈ సినిమాకు అన్నీతానై వ్యవహరించిన సంపత్ నంది (దర్శకుడు మాత్రం కాదు) కూడా ఇదే విషయం చెబుతున్నాడు. తమన్నాను ఇప్పటివరకు ఎవరూ ఊహించుకోని విధంగా ఆమె పాత్ర ఉంటుందంటున్నాడు.
స్టార్ హీరోకు ఏమాత్రం తీసిపోని విధంగా ఓదెల-2లో తమన్నాకు ఎలివేషన్స్, డైలాగ్స్ ఉన్నాయంట. మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా, తమన్నా నమ్మకాన్ని ఏ మేరకు నిలబెడుతుందో చూడాలి.
రియల్లీ?
Open dp
Hi
Hello
Good joke