ఎట్టకేలకు ప్రత్యక్షమైన హీరో

రాజ్ తరుణ్ అంతే. తన సినిమాల ప్రచారం ఉన్నప్పుడు ప్రత్యక్షమౌతాడు, ఆ తర్వాత మాయమౌతాడు.

రాజ్ తరుణ్ అంతే. తన సినిమాల ప్రచారం ఉన్నప్పుడు ప్రత్యక్షమౌతాడు, ఆ తర్వాత మాయమౌతాడు. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు.

గమ్మత్తైన విషయం ఏంటంటే, అతడితో పాటు, అతడి సినిమాలు కూడా మాయమౌతుంటాయి. ఏ సినిమా చేస్తున్నాడు, టైటిల్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ లాంటి విషయాలు కూడా పెద్దగా బయటకురావు.

మళ్లీ ఉరుములేని పిడుగులా రాజ్ తరుణ్ మీడియా ముందుకొస్తాడు. అప్పుడే అతడి సినిమాల సంగతులు కూడా బయటకొస్తుంటాయి. ఈరోజు అదే జరిగింది.

పాంచ్ మినార్ అనే సినిమాతో మీడియా ముందుకొచ్చాడు రాజ్ తరుణ్. సినిమా టీజర్ లాంచ్ చేశారు. ఇకపై వరుసగా ప్రమోషనల్ మెటీరియల్ వదుల్తారు. త్వరలోనే రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఎప్పట్లానే రాజ్ తరుణ్ మాయమౌతాడు.

రాజ్ తరుణ్ తన భర్త అంటూ లావణ్య అనే మహిళ చేసిన హడావుడి అందరికీ తెలిసిందే. ఆ గొడవ సద్దుమణిగిన తర్వాత రాజ్ తరుణ్ మాయమయ్యాడు. ఆ తర్వాత లావణ్య, రాజ్ తరుణ్ కు సారీ చెప్పింది. కనిపిస్తే కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరుతానంది.

ఎవరైతే ఆరోపణలు చేశారో, ఆమెనే క్లీన్ చిట్ ఇవ్వడంతో, రాజ్ తరుణ్ వెంటనే బయటకొస్తాడని అంతా భావించారు. కానీ ఇతడు మాత్రం ఎప్పట్లానే అజ్ఞాతం వీడలేదు. మళ్లీ తన సినిమా రెడీ అయింది కాబట్టి బయటకొచ్చాడు.

2 Replies to “ఎట్టకేలకు ప్రత్యక్షమైన హీరో”

Comments are closed.