సయీ మంజ్రేకర్ కు అర్జెంట్ గా ఓ హిట్ కావాలిప్పుడు. లేదంటే ఆమె కెరీర్ కష్టాల్లో పడుతుంది. అందుకే అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాపైనే ఆమె ఆశలు పెట్టుకుంది. యూనిట్ లో అందరి కంటే సయీ మంజ్రేకర్ కే ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం.
గని లాంటి డిజాస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తర్వాత మేజర్ మూవీతో కాస్త కోలుకుంది. అయితే ఆ వెంటనే వచ్చిన స్కంద సినిమా గట్టిగా దెబ్బకొట్టింది.
స్కంద దెబ్బకు సయీకి అవకాశాలు తగ్గిపోయాయి. ఎట్టకేలకు కల్యామ్ రామ్ హీరోగా నటిస్తున్న అర్జున్న సన్నాఫ్ వైజయంతి మూవీలో ఛాన్స్ దక్కించుకుంది.
ప్రస్తుతం సయీ చేతిలో ఉన్న సినిమా ఇదే. తెలుగులో ఆమె కెరీర్ సాఫీగా సాగాలన్నా, మరిన్ని మంచి అవకాశాలు రావాలన్నా, ఈ సినిమా హిట్టవ్వడం ఆమెకు అత్యవసరం.
పైగా తెలుగులో ఇప్పుడు సక్సెస్ ఫుల్ హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉంది. ఈ సినిమా హిట్టయితే సయీ కెరీర్ గాడిన పడటమే కాదు, ఆ లోటును కూడా భర్తీ చేసినట్టవుతుంది.
హాయ్
హలో
balls Bagunnayi