టాలీవుడ్ లో వ్యాపార వ్యవహారాలు చిత్రంగా వుంటాయి. అగ్రిమెంట్ లు వుంటాయి. కానీ మళ్లీ చర్చలు, సమావేశాలు, తీర్పులు ఇలా చాలా వుంటాయి. ఛాంబర్ ముందుకు ఫిర్యాదులు వస్తాయి. రోజుల తరబడి, నెలల తరబడి డిస్కషన్లు సాగుతాయి. చివరకు ఏదో విధమైన సెటిల్ మెంట్లు తప్పవు. ఇవన్నీ కూడా అగ్రిమెంట్లు వున్నా కూడా. ఇదే టాలీవుడ్ గొప్పదనం.
సినిమాలు కొంటారు. నష్టపోతారు. అగ్రిమెంట్ల ప్రకారం చూసుకుంటే మరే విధమైన పరిహారం వుండదు. కానీ ఇక్కడ వున్న కొన్ని కట్టుబాట్ల ప్రకారం ఎంతో కొంత పరిహారం ఇప్పిస్తారు. ఇందుకే నిర్మాతలు, బయ్యర్లు, హీరోలు, ఎగ్జిబిటర్లు ఇండస్ట్రీ జనాలు అంతా చాంబర్ ను ఆశ్రయిస్తారు. ఇప్పుడు ఓ నిర్మాత కూడా ఇలాగే చాంబర్ ను ఆశ్రయించారు. అయితే ఇది ఏమీ పెద్ద వార్త కాదు.
కానీ ఆ నిర్మాత డజన్ల కొద్దీ ఫిర్యాదులను ఒకేసారి దాఖలు చేయడం అన్నది విశేషం. హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి కేవలం నిర్మాత మాత్రమే కాదు. డిస్ట్రిబ్యూటర్ కూడా. చాలా ఏరియాల్లో చాలా సినిమాలు పంపిణీ చేసారు. కొన్ని సినిమాలు రెండు రాష్ట్రాల స్థాయిలో హక్కులు కొన్నారు. చాలా సినిమాల్లో నష్టపోయారు. డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమా వల్ల దారుణంగా దెబ్బతిన్నారు.
ఇప్పుడు అసలు తాను ఏయే సినిమాల వల్ల ఏయే విధంగా నష్టపోయారు, ఎవరెవరి వల్ల తనకు డబ్బులు రావాల్సి వుంది. తనకు పరిహారం రావాల్సి వుంది. ఇవన్నీ పేర్కొంటూ, వివిధ నిర్మాణ సంస్థల మీద నిరంజన్ రెడ్డి ఒకేసారి చాంబర్ లో కేసులు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నో నెలల కాలంగా మాట్లాడుతూ వస్తున్నా నిర్మాతలు ఎవ్వరూ స్పందించడం లేదని, తనకు న్యాయం చేయాలని నిరంజన్ రెడ్డి చాంబర్ గుమ్మం ఎక్కినట్లు తెలుస్తోంది.
లె-వె-న్”-మోహి-ని” ప-వ-న్ నాలు-గో భా-ర్య
T-h-i-s s-t-r-a-i-g-h-t a-w-a-y l-o-o-k-s l-i-k-e a Y-C-P fa-ke ac-co-u-nt. Th-ey a-r-e b-es-t i-n s-co-l-di-ng th-eir famil-ies. An-y-t-h-ing fo-r vot-es :). Sa-d s-ta-t-e of Y-C-P.
Hi
Hello
ponnavolu sudhakar reddy ki approach aithe court lo vadisthadu !!!!