టాయిలెట్ పేపర్ పై రాజీనామా లేఖ

కంపెనీ ఇన్నాళ్లూ అతడ్ని టాయిలెట్ పేపర్ గానే చూసిందట, వాడుకొని వదిలేసిందట.

ఇప్పటివరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా రాజీనామాలు చేసిన ఉదంతాలు చూశాం. ‘గుడ్ బై’ అంటూ సింపుల్ గా రాసి మొహాన కొట్టినోళ్లు కొందరైతే.. కవితలతో రాజీనామాలు చేసినోళ్లు కూడా ఉన్నారు. ఇది మరింత విడ్డూరమైన రాజీనామా.

ఓ ఉద్యోగి, టాయిలెట్ పేపర్ పై రాజీనామా లేఖ రాసి మేనేజ్ మెంట్ కు సమర్పించాడు. సింగపూర్ లో జరిగింది ఈ ఘటన. అదే కంపెనీకి చెందిన ఓ మహిళా ఉద్యోగి, ఈ రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అయితే రాజీనామా చేయడానికి అతడు ఈ పద్ధతినే ఎంచుకోవడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. కంపెనీ ఇన్నాళ్లూ అతడ్ని టాయిలెట్ పేపర్ గానే చూసిందట, వాడుకొని వదిలేసిందట. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, తన రిజిగ్నేషన్ లెటర్ కోసం టాయిలెట్ పేపర్ ను వాడాడు సదరు ఉద్యోగి. చివర్లో ‘ఐ క్విట్’ అంటూ సింపుల్ గా ముగించాడు.

ఆవేదనలో కూడా క్రియేటివిటీ చూపించాడంటూ అతడ్ని కొంతమంది మెచ్చుకుంటుంటే, మరికొంతమంది మాత్రం అతడి వృత్తి జీవితానికి ఈ పని ఏమాత్రం పనికిరాదంటూ కామెంట్లు పెడుతున్నారు.

2 Replies to “టాయిలెట్ పేపర్ పై రాజీనామా లేఖ”

Comments are closed.