విమానం ఎగరడం లేదు మంత్రి గారూ!

విశాఖతో ఇతర ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ పూర్తిగా తెగిపోతున్న భావనతో ప్రయాణీకులు ఉన్నారు.

పౌర విమానయాన మంత్రిగా అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కేంద్రంలో కీలక స్థానంలో ఉన్నారు కింజరాపు రామ్మోహన్ నాయుడు. గట్టిగా నాలుగు పదులు వయసు కూడా నిండకుండానే మంచి పోర్టు ఫోలియోతో కేబినెట్ మంత్రి పదవి వచ్చింది ఆయనకు. దానిని ఉత్తరాంధ్ర జిల్లాలకు మంచి చేసేందుకు ఎంత వరకూ ఉపయోగించారు అన్నది ఇపుడు జనాల నుంచి ప్రశ్నలుగా వస్తున్నాయి.

ఈ మధ్యకాలంలో చూసుకుంటే విశాఖ నుంచి వరసగా విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి. దాంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన విమానాలు ఒక్కసారిగా రద్దు కావడంతో ప్రయాణీకులే కాదు కీలక నాయకులు ప్రముఖులు కూడా కలవరపడుతున్నారు.

మే 5వ తేదీ నుంచి మలేషియా బ్యాంకాగ్ విమాన సేవలు రద్దు కాబోతున్నాయని అంటున్నారు. గడచిన పది నెలల కాలంలో విశాఖ నుంచి దేశంలోని కీలక డెస్టినేషన్స్ కి సర్వీసులు అందిస్తున్న ఆరు విమానాలు తమ సేవలను నిలుపుదల చేశాయి. దాంతో విశాఖతో ఇతర ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ పూర్తిగా తెగిపోతున్న భావనతో ప్రయాణీకులు ఉన్నారు.

విశాఖ నుంచి పూణే, గోవా, విజయవాడ, కోల్ కతాలకు నడిచే ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేసినట్లుగా ప్రకటించారు. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ నడుపుతున్న హైదరాబాద్, బెంగళూరు సర్వీసులు కూడా రద్దు అయ్యాయని చెబుతున్నారు. తమకు గిట్టుబాటు కావడం లేదనో మరేదో కారణాలతో విమాన సర్వీసులను ఆయన సంస్థలు హఠాత్తుగా రద్దు చేసుకుంటూంటే సంబంధిత మంత్రి ఉత్తరాంధ్ర వాసి అయి ఉండి చేపట్టాల్సిన చర్యలు ఏమిటని ప్రయాణీకులు ప్రశ్నిస్తున్నారు.

తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా విమాన సేవలు విశాఖ నుంచి విజయవాడకు అందుబాటులో లేకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన ఏపీ నుంచి ఏపీకి వెళ్ళాలంటే మధ్యలో హైదరాబాద్ కి వెళ్ళాలని సెటైర్లు వేశారు. ఆయన విజయవాడ వెళ్లాలని ముందు హైదరాబాద్ కి వెళ్ళి ఆ తరువాత గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

ఉదయాన్ని విశాఖ నుంచి విజయవాడకు నడిచే రెండు విమాన సర్వీసులు రద్దు కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది అని అంటున్నారు. ఇలా చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి రామ్మోహన్ నాయుడు ఈ రద్దు అయిన సర్వీసులను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుకుంటున్నారు.

7 Replies to “విమానం ఎగరడం లేదు మంత్రి గారూ!”

  1. **”అయ్యో గ్రేట్ఆంధ్రా మళ్లీ మొదలయ్యిందా? రోజూ లేవగానే కాస్ట్ కాస్ట్ అంటూ అరుపులు వేయకపోతే మీకు నిద్ర పట్టదేమో! ఏమైనా నిజంగా ఓ షేsమ్ అనేది మీ జీవితంలో ఉందా? రాజకీయ నేతల కోసం కుల ప్రోపగాండా చేయడమే మీకు ఉన్నతమైన జర్నలిsజం అనిపిస్తోంది.

    పబ్లిక్ మాత్రం చాలా క్లియర్గా చూపించింది – 175 సీట్లలో 11 సీట్లు మాత్రమే ఇచ్చింది మీ అభిమాన పార్టీకీ. అది ఓ ఓటింగ్ కాదు గురూ… ప్రజల చెంపపెట్టే! అయినా ఇంకా అదే కుల పాడే పాట పాడుతూనే ఉన్నారు. ఎంత ఓవరా మీరు!

    మీరు జర్నలిస్ట్ అనుకోవడం అన్నదే ఒక జోక్ లా ఉంది. బేసిక్ ఎథిక్స్, నిజాsయితీ ఎక్కడా కనబడటం లేదు. ‘ఇండిపెండెంట్ మీడియా’ అని చెప్పుకుంటూ ఉంటే, ఏం గురూ… నిజాsల నుండి ఇండిపెండెంట్ అని అర్థం పెట్టుకోవాలా?

    ఒక్కసారి అద్దంలో చూసుకోండి. కనీసం అప్పుడు అయినా మిగిలి ఉన్న షేsమ్ గుర్తుకు వస్తుందేమోs!”**

  2. ponile le neeli kj lk , mana shekka rule lo international flight option tesesaru ap nundi

    appudu nee notlo l 11 di vunda – netizens question kj lk

Comments are closed.