ప్రేమ పేరుతో ఒకరు.. పరువు పేరిట మరొకరు

తాజాగా చిత్తూరులో పరువు హత్య.. విశాఖలో ప్రేమ హత్య జరిగాయి. ఈ రెండు ఘటనల్లో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

తరాలు మారుతున్నా మనుషులు మారడం లేదు, వాళ్ల ఆలోచన విధానం మారడం లేదు. ఇప్పటికీ పరువు హత్యలు, ప్రేమ మాటున అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి చోట మహిళలే బాధితులుగా మారుతున్నారు. తాజాగా చిత్తూరులో పరువు హత్య.. విశాఖలో ప్రేమ హత్య జరిగాయి. ఈ రెండు ఘటనల్లో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

చిత్తూరులోని బాలాజీనగర్ కు చెందిన యాస్మిన్ బాను, పూతలపట్టు మండలానికి చెందిన సాయితేజ ప్రేమించుకున్నారు. కాలేజీ రోజుల నుంచే ఇద్దరి మధ్య ప్రేమ ఉంది. దాదాపు నాలుగేళ్లు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మతాలు వేరు కాబట్టి ఇంట్లో అంగీకరించనే విషయం ఇద్దరికీ తెలుసు. అందుకే నెల్లూరు పారిపోయి పెళ్లి చేసుకున్నారు.

2 నెలలుగా వీళ్ల కాపురం చక్కగా సాగింది. సరిగ్గా అప్పుడే యాస్మిన్ బాను కుటుంబం సీన్ లోకి వచ్చింది. కొన్ని రోజులుగా యాస్మిన్ తో మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో ఓ రోజు కాల్ చేసి తండ్రి షౌకత్ అలీకి ఆరోగ్యం బాగాలేదని ఇంటికి రావాలని పిలిపించుకున్నారు. స్వయంగా సాయితేజ్, తన భార్య యాస్మిన్ బానును డ్రాప్ చేసి వచ్చాడు.

అలా పుట్టింట్లో అడుగుపెట్టిన గంటకే ప్రాణాలు కోల్పోయింది యాస్మిన్. అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని షౌకత్ అలీ కుటుంబం చెబుతోంది. సాయితేజ్ మాత్రం నమ్మడం లేదు. తన భార్యను, ఆమె తల్లిదండ్రులే హత్య చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి తండ్రి షౌకత్ అలీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

చిత్తూరులో జరిగిన ఘటనలో అమ్మాయి తండ్రే హంతకుడిగా మారితే, విశాఖలో జరిగిన ఘటనలో కట్టుకున్న భర్తే, కాలయముడిగా మారాడు. జ్ఞానేశ్వర్, అనూష కులాంతర వివాహం చేసుకున్నారు. ఇంట్లో చెప్పకుండా విశాఖలోని మధురవాడలో కాపురం పెట్టాడు జ్ఞానేశ్వర్. పెళ్లయి మూడేళ్లయినా భార్యను ఇంట్లో పరిచయం చేయలేదు. ఈ గ్యాప్ లో అనూష గర్భందాల్చింది. తనను అత్తమామలకు పరిచయం చేయాలని ఒత్తిడి తెచ్చింది.

మరోవైపు రకరకాల సాకులు చెప్పి భార్యను మోసం చేసే ప్రయత్నం చేశాడు జ్ఞానేశ్వర్. అతడు ఎన్ని కథలు చెప్పినా అనూష నమ్మలేదు. దీంతో నిన్న ఉదయం భార్య గొంతు పిసికి హత్య చేశాడు. నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఈ దురాగతానికి పాల్పడ్డాడు. తననే నమ్మి వచ్చిన భార్య పాలిట తనే కాలయముడిగా మారాడు.

16 Replies to “ప్రేమ పేరుతో ఒకరు.. పరువు పేరిట మరొకరు”

    1. మీ కామెంట్స్ మరీ శృతి మించుతున్నాయి.. వ్యంగ్యంగా ఉంటే పర్వాలేదు. మరీ కూతుళ్ళని లాగి ఇంత దిగజారడం అవసరమా?

  1. T-h-i-s s-t-r-a-i-g-h-t a-w-a-y l-o-o-k-s l-i-k-e a Y-C-P fa-ke ac-co-u-nt. Th-ey a-r-e b-es-t i-n s-co-l-di-ng th-eir famil-ies. An-y-t-h-ing fo-r vot-es :). Sa-d s-ta-t-e of Y-C-P.

Comments are closed.