తెలంగాణలో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం కోర్టు పరిధిలో వుంది. పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. దీంతో బీఆర్ఎస్ న్యాయ పోరాటం మొదలు పెట్టింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో అనర్హత బంతి వుంది.
ఈ నేపథ్యంలో జస్టిస్ బీఆర్ గవాయ్, అగస్టీన్ జార్జ్‌తో కూడిన ధర్మాసనం విచారణలో భాగంగా కీలక కామెంట్స్ చేసింది. అనర్హత విషయమై నిర్ణయం తీసుకోడానికి ఇంకెంత కాలం కావాలని జస్టిస్ గవాయ్ అసెంబ్లీ కార్యదర్శి తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ప్రశ్నించారు.
ఒక్కమాటలో చెప్పాలంటే ఆరు నెలల సమయం కావాలని అభిషేక్ సమాధానం ఇచ్చారు. దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ఇప్పటికే 14 నెలల కాలం వృథా అయ్యిందని, ఇంకా ఆరు నెలల సమయం అడగడం ఏంటని జస్టిస్ గవాయ్ నిలదీశారు. అయితే స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలనే విషయమై న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదనేది వాళ్ల వాదన.
స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుని వుంటే, తాము జోక్యం చేసుకునే పరిస్థితి వచ్చేది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పది షెడ్యూల్‌ను అవమానించడమే అని కూడా న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తుది తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.
\\ అనర్హత విషయమై నిర్ణయం తీసుకోవటానికి ఇంకెంత కాలం కావాలి \\
19 ED , సిబిఐ అవినీతి కేసుల మీద ఇంతవరకు కనీసం విచారణే మొదలవ్వలేదు.
ఇలోపల పక్క నున్న ఓ పెద్ద రాబందు తలకాయ ఢిల్లీ కు తోకని పంపో మరొ విధం గానో తీర్పు తెప్పించడానికి ప్రయత్నాలు ఉంటాయి..