శ్రీవారి ఆలయం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మంచిది కాదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అడ్డు చెప్పగా, సీఎం చంద్రబాబు మాత్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై టీటీడీ చైర్మన్, సీఎం మధ్య చిన్న వాదన చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది.
శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోడానికి ఓ సంస్థ సిద్ధపడితే దాన్ని టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు అడ్డుకోవడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా జోక్యం చేసుకుని గ్రీన్‌సిగ్నెల్ ఇవ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇదేనా టీటీడీలో సంస్కరణలు తీసుకురావడం అంటే అని భక్తులు నిలదీస్తున్నారు. అత్యంత ఆసక్తికర ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే….
చెన్నై నగరంలో జీ స్క్వేర్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ తన వెంచర్లు వున్న చోట సొంత నిధులతో టీటీడీ ఆలయాన్ని నిర్మిచాలని భావించి, టీటీడీకి ప్రతిపాదనలు పంపింది. దీనికి ఛైర్మన్ బీఆర్ నాయుడు ససేమిరా అన్నారు. టీటీడీ ఆలయం పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోడమే సదరు సంస్థ అభిప్రాయమన్న భావనతో ఛైర్మన్ అడ్డు చెప్పారు. ఈ విషయం బుధవారం అమరావతిలో, టీటీడీ అభివృద్ధిపై సీఎం సమక్షంలో జరిగిన సమీక్షా సమావేశంలో చర్చకు వచ్చింది.
ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటూ సొంత ఖర్చులతో ఆలయం నిర్మిస్తే అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? జీస్క్వేర్ సంస్థ నిర్మించతలపెట్టిన ఆలయానికి సహకరించండి అని ఆదేశించారట. ఎలాంటి సహకారమో ఏమో తెలియదు.
ఇక్కడ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవరైనా ఆలయాలు నిర్మించుకోవచ్చు. దానికి టీటీడీ అనుమతి అవసరం లేదు. జీస్క్వేర్ సంస్థ కూడా తన వెంచర్ వద్ద శ్రీవారి ఆలయాన్ని నిర్మించుకోవచ్చు. ఎవరూ అభ్యంతరపెట్టరు. అయితే జీస్క్వేర్ నిర్మించేది టీటీడీ ఆలయమని చెబితేనే అభ్యంతరం. అంటే సదరు సంస్థ ఆలయం నిర్మిస్తే, భవిష్యత్తులో ఆలయ నిర్వహణ బాధ్యతను టీటీడీ చూడాలన్నమాట. అంతేకాదు అక్కడ జరిగే అన్ని వ్యవహారాలకు టీటీడీ బాధ్యత వహించాల్సి వుంటుంది.
ఇలా ఎవరుబడితే వాళ్లు తమ రియల్ ఎస్టేట్ వెంచర్ల వద్ద సొంత నిధులతో ఆలయాలు నిర్మించి, వాటిని టీటీడీ ఆలయం అని పేరుపెట్టుకోవచ్చా? అలా నిర్మించుకునే సంస్థలకు టీటీడీ సహకారం అందించాలా?
ఇప్పటికే టీటీడీ దేశ వ్యాప్తంగా ఆలయాలు నిర్మిస్తోంది. ప్రభుత్వ సహకారంతో భూములు తీసుకుని, తన నిధులతో టీటీడీ ఆలయాలు నిర్మిస్తోంది. ఆ ఆలయాల నిర్వహణ బాధ్యతను కూడా దేవస్థానమే చూస్తోంది. అలాంటిది ప్రైవేట్ వ్యక్తులు తమకు ఇష్టమొచ్చిన చోట ఆలయం నిర్మించి, దానికి టీటీడీ ఆలయమని పేరుపెట్టి, టీటీడీకి అప్పగిస్తే…ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ముఖ్యమంత్రి ఆలోచించారా? ఇప్పటిదాకా ఇలాంటి విధానం, పద్ధతిలో టీటీడీ వుందా? మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇలాంటి ఆదేశాలు ఇచ్చారు?
ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చెడు సంప్రదాయానికి దారితీస్తుందని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు. మరి భక్తుల మనోభావాల్ని ఆయన గౌరవిస్తారా? అలాగే సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు దంచే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్… ఈ వ్యవహారంపై తన వైఖరి వెల్లడించాలి.
హిందువులు దేవస్థానం కట్టుకుంటామంటే అడ్డుకో అని చెప్తున్నావ్.. ఏంటీ సంగతి??
pawaa emipoyadu
Ridiculous decision by Chandrababu.
ఇక్కడ చంద్రబాబు గారికి అమిత్ షా గారికి అష్టి పంచాయితీ లు ఏమి లేవు ఆయన ప్రత్యేక హోదా ఇస్తానని బీజేపీ మోసం చేసిందని రాష్ట్రము తరపున పోరాటం చేసినారు బాబు గారు మన రాష్ట్రానికి కూడా ఒక అంబి వున్నాడు అని గ్రహించలేక పోయారు మన అంబి బీజేపీ తో రహస్య పొత్తు పెట్టుకొని బీజేపీ కి భరోసా ఇవ్వగలిగేరు కానీ బీజేపీ చేసిన మోసం దెబ్బ అప్పటి వరకు కలిసి వున్నా బాబు గారి మీద పడింది అది కాక వివేకా హత్య కేసు కోడి కత్తి ముప్పై రెండు కమ్మ డీస్పీ లు పింక్ డైమండ్ ఇవన్నీ బాబు గారికి సంబంధం లేకపోయినా జనం నమ్మటం తో చతికిల పడ్డారు ఎలక్షన్ లో గెలిచినా మరుక్షణం వైసీపీ నాయకులూ కేసు లన్నిటి లో స్టే లు తెచ్చుకొని పోలవరాన్ని ప్రత్యేక హోదాని అటకెక్కించేసి ఏది వదలకుండా విచ్చలవిడి అవినీతి అరాచకం తో రీసెంట్ ఎలక్షన్ లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంటికి తల గొరిగి పంపించిన సిగ్గు లేకుండా అప్పటి విషయం రాయమనడం లో అర్థమేముంది బాబు గారు ఎప్పటికి రాష్ట్రము కోసం పోరాటం చేసాడని జనాలకు అర్ధమైన తర్వాత రిజల్ట్స్ ఎలాగుందో వైసీపీ కి ఇప్పటికి అర్దమవకపోవడం మరి pity
గేటెడ్ కమ్యూనిటీ ఆలయాలను చాలా బాగా నిర్వహిస్తున్నారు. పండగలు చాలా బాగా సెలెబ్రేట్ చేస్తున్నారు. ఏమి తప్పు లేదు.. Self sustainable.. మంచి కార్యక్రమం
భక్తుల కోసమే ఆలయాలు నిర్మిస్తున్నప్పుడు భక్తుల మనోభావాలు ఎలా దెబ్బతింటాయో ఈ బోడి గ్యాస్ ఆంద్ర గాడే చెప్పాలి. జానడు మీడియాను నిర్వహించే నీకే ఇన్ని తెలివితేటలు ఉంటే ఒక రాష్ట్రాన్ని పాలించే వారికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి నువ్వు బోడి గారికి తెలిసిన ధర్మ సూత్రం వానికి తెలియదంటారా అడ్డ గాడిద ? ఎన్నో అడ్డమైన పనులు మీ అన్న అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో చేశారు మరి అప్పుడు నోట్లో ఏవండీ పెట్టుకొని ఉంటివో మరి నువ్వు.. ఇలా ఒకరి మీద పడి ఏడవడం లోనే నీ జీవితమంతా సరిపడేటట్టుగా ఉంది. ఇది ఏం బతుకు బతుకు