సక్సెస్ కోసం రేటు కూడా తగ్గించాడు?

హృతిక్ మాత్రం అవసరమైతే తను పారితోషికం కూడా తగ్గించుకుంటానని ప్రకటించడం విశేషం.

హిందీ హీరోలంతా సౌత్ వైపు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది తెలుగు డైరక్టర్లు చేస్తున్న సినిమాలు నార్త్ బెల్ట్ లో కూడా బాగా ఆడుతున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఈ విషయంలో మరో అడుగు ముందుకేశాడు హృతిక్ రోషన్. సౌత్ డైరక్టర్స్ తో కలిసి పనిచేయడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. హృతిక్ మాత్రం అవసరమైతే తను పారితోషికం కూడా తగ్గించుకుంటానని ప్రకటించడం విశేషం.

హృతిక్-బాబి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటూ నిన్నట్నుంచి ప్రచారం నడుస్తోంది. ఈ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు కానీ, కొన్ని రోజుల కిందట హృతిక్ చేసిన ఈ స్టేట్ మెంట్ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది.

అన్ని అర్హతలుండి, బ్లాక్ బస్టర్ కొట్టలేకపోయిన హీరో ఎవరైనా ఉన్నారంటే బాలీవుడ్ లో అది హృతిక్ మాత్రమే. సౌత్ దర్శకులతో కలిసి ఆ లోటును భర్తీ చేసుకోవాలని భావిస్తున్నాడు హృతిక్.

ఎన్టీఆర్ తో కలిసి వార్-2 సినిమా చేసిన ఈ నటుడు, తారక్ ను తన బెస్ట్ కో-స్టార్ గా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తెలుగు దర్శకుల కోసం రెడ్ కార్పెట్ పరిచాడు. ఈ అవకాశాన్ని ఏ దర్శకుడు వాడుకుంటాడో చూడాలి.

One Reply to “సక్సెస్ కోసం రేటు కూడా తగ్గించాడు?”

Comments are closed.