మ‌న్న‌న‌లు అందుకుంటున్న‌ అన్నా లెజినోవా

తిరుమ‌ల‌లో అన్నా లెజినోవా ప్ర‌తి క‌ద‌లికా ఆమెపై ప్ర‌తి ఒక్క‌రిలో గౌర‌వం పెంచింద‌న‌డంలో సందేహం లేదు.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌తీమ‌ణి అన్నా లెజినోవాను త‌ప్ప‌క అభినందించాలి. త‌మ కుమారుడు మార్క్ శంక‌ర్ అగ్ని ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ‌డంతో క‌లియుగ దైవం శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామి వారికి మొక్కులు తీర్చుకోవాల‌ని ప‌వ‌న్ దంప‌తులు భావించారు. భ‌ర్త‌తో క‌లిసి తిరుమ‌లకు అన్నా లెజినోవా వెళ్లారు.

క్రిస్టియ‌న్ మ‌తానికి చెందిన ఆమె తిరుమ‌ల శ్రీ‌వారి సంద‌ర్శ‌న‌కు మొద‌టిసారి వెళ్లారు. మ‌రీ ముఖ్యంగా స్వామి వారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. టీటీడీ ఉద్యోగుల సూచ‌న‌ల ప్ర‌కారం ఆమె ఆల‌య సంప్ర‌దాయాల ప్ర‌కారం పూజ‌లు చేశారు. సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఆమె ఆల‌యంలో పూజాది కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌డం హిందువుల మ‌న్న‌న‌లు అందుకుంటోంది. అన్య‌మ‌త‌స్తురాలైన ఆమె శ్రీ‌వారిపై విశ్వాసాన్ని చాటుతూ డిక్ల‌రేష‌న్ ఇచ్చారు.

ఇవ‌న్నీ కూడా జ‌న‌సేన‌కు రాజ‌కీయంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అన్నా లెజినోవా త‌న కూతురు, కుమారుడిని క్రిస్టియ‌న్ మ‌త ఆచారాల‌కు అనుగుణంగా పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదే సందర్భంలో త‌న భ‌ర్త ప‌వ‌న్‌క‌ల్యాణ్ హిందుత్వ విశ్వాసాల‌నై గౌర‌వంతో ఆమె తిరుమ‌ల సంద‌ర్శ‌న‌కు వెళ్ల‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

తిరుమ‌ల‌లో అన్నా లెజినోవా ప్ర‌తి క‌ద‌లికా ఆమెపై ప్ర‌తి ఒక్క‌రిలో గౌర‌వం పెంచింద‌న‌డంలో సందేహం లేదు.

24 Replies to “మ‌న్న‌న‌లు అందుకుంటున్న‌ అన్నా లెజినోవా”

  1. ఇక్కడ ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయం ఏమీ లేదు. అక్కడి సంప్రదాయాల్ని గౌరవించింది . అందరూ పాటిస్తే అందరికీ గౌరవంగా ఉంటుంది. అది కనీస బాధ్యత. అందులో తప్పేం లేదు. This rule applies to all CM to PM . CM

    ante common man 🧍♂️.

  2. వేరే దేశం క్రైస్తవురాలు చక్కగా తల నీలాలు అర్పించారు.

    మరి ఇక్కడ హిందూ మతం లో పుట్టి, క్రైస్తవ మతం లోకి మారి ( ఇంకా హిందూ పేర్లు మాత్రం వదులుకోకుండా ఆ పెద్ద కులం పేర్లు వలన వచ్చిన బడాయి అనుభవిస్తూ) న జగన్ రెడ్డి కుటుంబం లో ఎవరు కూడా ఒక్కసారి తిరుమల లో గుండు కొట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా తిరుమల దేముడు గుడి నీ ఒక సెట్టింగ్ లాగ ఇంటి వెనుక వేసుకుని ఫోజులు కొట్టారు, హిందువుల్లో అమాయక వాళ్ళు ఓట్లు వేస్తారు అని.

  3. ఆడవారు శిరోముండనం చేయించుకోకూడదు, మూడు కత్తెర్లు ఇస్తారు. పవన్ తలనీలాలు ఇస్తే సరిపోయేది…ఏది ఏమైనా తెలిసో తెలియక జరిగిపోయిన దాని కంటే ..మా భరతదేశంలో పుట్టి సనాతన ధర్మం ని అనుసరించకపోగా, అవహేళన చేసే యెంతో మంది కి చెంప పెట్టు!

      1. గరికపాటి నరసింహ రావు గారు ఒక సందర్బాల్లో లో చెప్పినారు స్త్రీలు గుండు పైన కావాలి అంటే వీడియో చూడు యూట్యూబ్ లో కూడా ఉంది

        1. గరికిపాటి గారి ఒక్కో వీడియో లో ఆ ఆడియన్స్ కు తగ్గట్లు చెబుతారు. కానీ శాస్త్రము అనేది ఒకటి ఉంటుంది కదా, దాని వివరాలు ఇవ్వండి.

          ఒకవేళ ఆడవారి తల నీలాలు ఇవ్వకూడదు అని శాస్త్రంలో వుంటే, తిరుమల లో అసలు చేయరు కదా.

      2. గరికపాటి నరసింహ రావు గారు ఒక సందర్బాల్లో లో చెప్పినారు స్త్రీలు గుండు పైన కావాలి అంటే వీడియో చూడు యూట్యూబ్ లో కూడా ఉంది

      3. చదుకోవాలిసిన టైం లో సరిగ్గా చదువుకొని ఉంటె ఎవ్వరు ఎక్కడ ఎందులోనో తెలిసిఉండేది ..

Comments are closed.