గోశాల‌లో రికార్డుల తారుమారుపై అనుమానాలు!

ముందుగా గోశాల‌లో రికార్డుల్ని మాయం కాకుండా చూడాల్సిన అవ‌స‌రం వుంది

కార‌ణాలేవైనా ఎస్వీ గోశాల‌లో గోమాత‌లు ప్రాణాలు కోల్పోవ‌డం అత్యంత విచార‌క‌రం. ఎన్ని ప్రాణాలు పోయావ‌న్న‌ది త‌ర్వాత సంగ‌తి. అయితే టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న కరుణాక‌ర‌రెడ్డి ఆరోప‌ణ‌ల‌కు వివ‌ర‌ణ ఇచ్చే సంద‌ర్భంలో చైర్మ‌న్ బీఆర్ నాయుడు చేసిన కామెంట్స్ ప‌లు అనుమానాల‌కు దారి తీస్తోంది.

కొన్ని రికార్డుల‌ను గ‌తంలో గోశాల అధికారిగా ప‌ని చేసిన హ‌రినాథ‌రెడ్డి తీసుకెళ్లార‌ని ఆరోపించారు. తాజా ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో అత‌నిపై నింద‌లు వేసి, గోవుల వివ‌రాల‌కు సంబంధించిన రికార్డుల‌ను మాయం చేసే కుట్ర జ‌రుగుతోంద‌నే ప్ర‌చారానికి తెర‌లేచింది. అందుకే టీటీడీ చైర్మ‌న్ వ్యూహాత్మ‌కంగా హ‌రినాథ‌రెడ్డి రికార్డులు తీసుకెళ్లార‌ని ఆరోపించార‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. తాజా సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో గోశాల‌లో రికార్డులు మాయం చేసే కుట్ర‌తోనే, ప‌ద్ధ‌తి ప్ర‌కారం ఆరోప‌ణ‌లు చేశార‌ని వారు చెబుతున్నారు.

క‌నీస వివ‌రాల‌తో కూడా ప్రెస్‌మీట్‌కు బీఆర్ నాయుడు రాక‌పోవ‌డాన్ని త‌ప్పు ప‌డుతున్నారు. గోమాత‌లు ప్రాణాలు పోయాయ‌నే తీవ్ర ఆరోప‌ణ‌లు రాగానే, వాటికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను మీడియా ముందు పెట్టి వుంటే బాగుండేది. కానీ ఆయ‌న ఆ ప‌ని చేయ‌లేదు. వివ‌రాల్ని చీఫ్ పీఆర్వో ఇస్తార‌నే స‌మాధానం త‌ప్ప‌, మ‌రో మాట లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

ముందుగా గోశాల‌లో రికార్డుల్ని మాయం కాకుండా చూడాల్సిన అవ‌స‌రం వుంది. ప్ర‌తిదీ డిజిట‌లైజేష‌న్ అయిన ఈ కాలంలో గ‌తంలో ప‌ని చేసిన అధికారి రికార్డుల్ని తీసుకెళ్లార‌నే చెప్ప‌డంలోనే ఏదో మ‌త‌ల‌బు వుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఈ వివాదం ఇంకెంత కాలం న‌డుస్తుందో చూడాలి.

One Reply to “గోశాల‌లో రికార్డుల తారుమారుపై అనుమానాలు!”

  1. మొన్నటి దాకా ప్రవీణ్ పగడాల ది హత్య అని వాటికన ముఠా మొత్తం గొడవ చేశారు.

    ఎవడో బోడి లింగం గాడు జగన్ పార్టీ లో పాస్టర్ అంట, వాడు తెగ ఊగి పోయాడు. చివరికి, పాపం ప్రవీణ్ పగడాల పరువు నీ పూర్తిగా తీసేసారు, నిజాలు బయటకి వచ్చి.

    ఇక్కడ కూడా ఎవడో తిరుమల లో హిందూ వేషం లో విన్న వాటిక*న్ గొ*ర్రె బి*డ్డ ప్లాన్ లాగ వింది.

Comments are closed.