కల వేరు, జీవితం వేరు. కలలో జీవించడం వేరు. ఈ విషయంలో రకుల్ అదృష్టవంతురాలు. తను చిన్నప్పట్నుంచి ఎలాంటి కలలు కన్నానో, ప్రస్తుతం అలాంటి జీవితాన్నే ఆస్వాదిస్తున్నానని తెలిపింది.
“వెండితెరపై మెరవాలని చిన్నప్పట్నుంచి కలలు కనేదాన్ని. దాని కోసం ఎంతో కష్టపడ్డాను. ఎన్నో త్యాగాలు చేశాను. ప్రస్తుతం నా డ్రీమ్ లైఫ్ ను అనుభవిస్తున్నాను.”
అందంగా ఉంటేనే వెండితెరపై రాణిస్తామనే విషయాన్ని రకుల్ కొట్టిపారేస్తోంది. అందమనేది పైకి కనిపించేది కాదని, అంతర్గతంగా దాగుంటుందని చెబుతోంది. మన కళ్లలో, నవ్వులో అందం కనిపించాలని అంటోంది. అలా కనిపించే ప్రతి ఒక్కరు అందంగా ఉంటారని చెబుతోంది.
ప్రస్తుతం పలు హిందీ సినిమాలతో రకుల్ బిజీగా ఉంది. ఆమె నటించిన 2 సినిమాలు ఈ ఏడాదిలో రిలీజ్ అవ్వబోతున్నాయి. మరోవైపు సైఫ్ అలీఖాన్ తో కలిసి రేస్-4 ప్రాజెక్టులో ఆమె నటించే అవకాశం ఉంది.
సరే మరి గుండు చేయించుకుని అవకాశాలు సంపాదించి అప్పుడు చెప్పు అంతహ సౌందర్య గురించి.
Nice dream
కలలను నిజం చేసుకొనేదానికి ఎంతో కష్టం అవసరం. కష్టం లేకుండా ఫలితాలు రావు రావు రావు రావు గాక రావు
Vellu fadeout ainna heroines rakul ki hit movies levu