రీసెంట్ గా సౌత్ లో సరైన సక్సెస్ అందుకోలేకపోయింది నయనతార. హిందీలో ఆమె నటించిన జవాన్ సినిమా పెద్ద హిట్టయినప్పటికీ, మళ్లీ బాలీవుడ్ లో సినిమాలు చేయాలేని ఆమె అనుకోవడం లేదు. సౌత్ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తోంది. కానీ సరైన సక్సెస్ రావడం లేదు.
ఈ నేపథ్యంలో భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో మరోసారి నటించాలని నయనతార ఫిక్స్ అయింది. త్వరలోనే ఈ సినిమా ప్రకటన రాబోతోంది. చివరిసారి 2022లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో సినిమా చేసింది నయనతార.
ఇన్నాళ్లూ తన పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది నయన్. అయితే ఈసారి విఘ్నేష్ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేయబోతోంది. అంటే ఇందులో ఓ స్టార్ హీరో నటిస్తాడన్నమాట. నయనతార గ్లామర్ పాత్రలో కనిపించబోతోంది. బహుశా అందుకేనేమో తనను లేడీ సూపర్ స్టార్ అని పిలవొద్దంటూ ఈమధ్య ఆమె విజ్ఞప్తి చేసింది.
రీసెంట్ గా ఆమె నటించిన టెస్ట్ అనే సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. అది డిజాస్టర్ అవ్వడమే కాదు, నయనతార నటనపై కూడా విమర్శలు వచ్చాయి. దాదాపు పదేళ్ల తర్వాత ఈ తరహా విమర్శలు రావడంతో నయనతార జాగ్రత్త పడుతోంది. ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమా చేయడానికి ఇది కూడా ఓ కారణం కావొచ్చు.