త్రివిక్రమ్-నో ఆప్షన్

అదిగో వెంకీ, ఇదిగో రామ్ ఇలాంటి వార్తలకు బన్నీ అస్సలు తొందరపడరు. సో త్రివిక్రమ్ కు మాగ్జిమమ్ నో ఆప్షన్.

గుంటూరుకారం సినిమా విడుదల తరువాత నుంచి వెయిట్ చేస్తున్నారు దర్శకుడు త్రివిక్రమ్. హీరో బన్నీ ఎప్పుడు వస్తారా అని. ఎందుకంటే త్రివిక్రమ్‌కు ఇప్పుడు మిగిలిన వన్ అండ్ ఓన్నీ ఆప్షన్. ఎన్టీఆర్ సహా మిగిలిన టాప్ హీరోల డేట్ లు ఏవీ ఇప్పట్లో అందుబాటులో లేవు. అందుకే 2024 నుంచి వెయిటింగ్ లో వున్నారు.

పుష్ప 2 తరువాత బన్నీ నేరుగా తన దగ్గరకే వస్తారని ఎదురు చూస్తూ ఏడాదికి పైగా గడిపేసారు. కానీ బన్నీ అలా రాకుండా అట్లీ వైపు మొగ్గారు. త్వరగా ఓ సినిమా చేయాలని, అట్లీ సినిమా మొదలుపెట్టి, అది కొంత వరకు చేసి త్రివిక్రమ్ సినిమా మీదకు వస్తా అని చెప్పారని వార్తలు వినిపించాయి.

కానీ పరిస్థితి చూస్తుంటే అలా జరుగుతుందా అని అనిపిస్తోంది. అట్లీ సినిమా కూడా చాలా పెద్ద స్కేల్ సినిమా. అలాంటి సినిమా ప్రారంభించిన తరువాత మధ్యలో మళ్లీ అటు ఇటు మరో సినిమా మీదకు రావడం అంటే అంత సలువు కాదు. పైగా గెటప్ లు, మేకోవర్లు వుంటాయి. అందువల్ల త్రివిక్రమ్- బన్నీ సినిమా ప్రారంభం అయ్యే వరకు వెయిటింగ్ లిస్ట్ లోనే వున్నట్లు లెక్క.

ఇలాంటి నేపథ్యంలో చాలా గ్యాసిప్ లు వినిపిస్తూ వస్తున్నాయి. రామ్ తో సినిమా అని, విక్టరీ వెంకటేష్ తో సినిమా అని. నిజానికి వెంకీ-రామ్ ఇలా వీళ్లంతా రెడీగా వుంటారు త్రివిక్రమ్ అంటే. కానీ మార్కెట్ సరిపోదు. వంద.. నూట యాభై కోట్ల రేంజ్ సినిమా చేయడానికి త్రివిక్రమ్ కాల్ షీట్‌లను వృధా చేసుకుంటారా నిర్మాతలు? త్రివిక్రమ్ తో సినిమా అంటే పాన్ ఇండియా లెవెల్ వుండాలని చూసుకుంటారు.

వెంకీతో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా 300 కోట్లు చేసిందిగా అని అనొచ్చు. కానీ అద్భుతాలు అన్ని సార్లూ జరగవు. పోనీ అలా అని బన్నీ కోసమే వెయిట్ చేస్తూ వుండిపోవడమేనా అని అనుకుంటే అట్లీ సినిమా తరువాత కూడా వస్తారని గ్యారంటీ లేదు. పుష్ప 3 అనేది ఒకటి వుండనే వుంది. సందీప్ వంగాతో సినిమా చేయాలనే ఆలోచన వుంది.

ఇలాంటి నేపథ్యంలో త్రివిక్రమ్ ఏం చేయాలి? బన్నీ నుంచి క్లారిటీ వచ్చే వరకు వేచి వుండాల్సిందే. ఆప్షన్ లేదు. అదిగో వెంకీ, ఇదిగో రామ్ ఇలాంటి వార్తలకు బన్నీ అస్సలు తొందరపడరు. తను అనుకున్నట్లే తాను ముందుకు వెళ్తారు. సో త్రివిక్రమ్ కు మాగ్జిమమ్ నో ఆప్షన్.

7 Replies to “త్రివిక్రమ్-నో ఆప్షన్”

  1. లెవెన్”మోహిని” పవన్ నాలుగో భార్య

    T-h-i-s s-t-r-a-i-g-h-t a-w-a-y l-o-o-k-s l-i-k-e a Y-C-P fa-ke ac-co-u-nt. Th-ey a-r-e b-es-t i-n s-co-l-di-ng th-eir famil-ies. An-y-t-h-ing fo-r vot-es :). Sa-d s-ta-t-e of Y-C-P.

  2. లె-వె-న్”-మోహి-ని” ప-వ-న్ నాలు-గో భా-ర్య

    T-h-i-s s-t-r-a-i-g-h-t a-w-a-y l-o-o-k-s l-i-k-e a Y-C-P fa-ke ac-co-u-nt. Th-ey a-r-e b-es-t i-n s-co-l-di-ng th-eir famil-ies. An-y-t-h-ing fo-r vot-es :). Sa-d s-ta-t-e of Y-C-P.

Comments are closed.