ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చి, ఆ కుర్చీలో కూర్చోవాలని తండ్రీకొడుకులు పగటి కలలు కంటున్నారని కేసీఆర్, కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో అక్రమ సంపాదనతో లాభపడ్డ నేతలే తమ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నట్టు ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రశ్నే లేదని ఆయన అన్నారు.
ధరణి పోర్టల్‌తో భూములను ఆక్రమంగా దోచుకుని, అనుయాయులకు కట్టబెట్టారని మంత్రి ఆరోపించారు. కేసీఆర్ హయాంలో అక్రమంగా దోచుకున్న భూముల్ని తమ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని పొంగులేటి అన్నారు. తప్పు చేసిన బీఆర్ఎస్ నేతలకు సంకెళ్లే వేసి తీరుతామని ఆయన హెచ్చరించారు.
ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎంత మంది ఎమ్మెల్యేలను కొంటారో కొనాలని మంత్రి పొంగులేటి సవాల్ విసరడం గమనార్హం. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరని ఆయన తేల్చి చెప్పారు.
రేవంత్‌రెడ్డి సర్కార్‌లో మంత్రి పొంగులేటి కీలక మంత్రి. ఎమ్మెల్యేలను చేర్చుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారం కాదని, ప్రతిపక్ష బీఆర్ఎస్‌లోకి వెళ్తారని మంత్రి పొంగులేటి ఎందుకు అనుకుంటున్నారో అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
havata