భూమ‌న‌పై ఫిర్యాదు.. త‌ర్వాత ఏంటి?

టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డిపై ఎట్ట‌కేల‌కు తిరుప‌తి ఎస్పీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రాజుకు ఫిర్యాదు చేశారు.

ఎస్వీ గోశాల‌లో గోవులు మృతి చెందాయ‌ని ఆరోపించిన టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డిపై ఎట్ట‌కేల‌కు తిరుప‌తి ఎస్పీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రాజుకు ఫిర్యాదు చేశారు. టీటీడీ అధికారుల‌కు బ‌దులు, పాల‌క మండ‌లి స‌భ్యుడు ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం. భూమ‌న‌పై రాజ‌కీయంగా ఫిర్యాదు చేసిన‌ట్టే క‌నిపిస్తోంది. ఎందుకంటే ఆయ‌న‌పై ఎస్పీకి బీజేపీ నాయ‌కుడైన టీటీడీ బోర్డు స‌భ్యుడు ఫిర్యాదు చేయ‌డంతోనే రాజ‌కీయ కోణంలో చూస్తున్నారు.

టీటీడీ ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించింద‌ని ఆ సంస్థ భావిస్తుంటే భూమ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారులు ఫిర్యాదు చేసి వుండేవాళ్ల‌ని అంటున్నారు. కానీ గోవుల మృతి చెంద‌డం వాస్త‌వమే అని, అయితే సంఖ్య‌లో తేడా వుంద‌ని మాత్ర‌మే టీటీడీ అధికారుల అభిప్రాయం. అందుకే ఈ వ్య‌వ‌హారాన్ని ఇంత‌టితో విడిచి పెట్టాల‌ని టీటీడీ ఉన్న‌తాధికారులు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అయితే టీటీడీ బోర్డు స‌భ్యుడు రాజ‌కీయంగా కొంద‌రి మెప్పు కోస‌మే తిరుప‌తి ఎస్పీకి ఫిర్యాదు చేశార‌నే వాద‌న వినిపిస్తోంది. భూమ‌న‌పై ఎలాంటి సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేయాలో స‌ద‌రు బీజేపీ నాయ‌కుడు త‌న ఫిర్యాదులో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. వైసీపీ అధికారంలో ఉన్న‌పుడు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన వాళ్లే, ఇప్పుడు టీటీడీ ప్ర‌తిష్ట గురించి నీతులు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

టీటీడీని రాజ‌కీయాల‌కు దూరంగా ఉంచాల‌ని ఉప‌న్యాసాలు ఇస్తూ, మ‌రోవైపు అదే ప‌ని వాళ్లే చేస్తుండ‌డాన్ని భ‌క్తులు గ‌మ‌నిస్తున్నారు. టీటీడీ స‌భ్యుడి ఫిర్యాదు మేర‌కు భూమ‌న‌పై ఎలాంటి చ‌ర్య‌ల‌కు పోలీసులు ఉప‌క్ర‌మిస్తారో చూడాలి. మ‌రోవైపు దేవుడి కోసం తాను జైలుకెళ్ల‌డానికైనా సిద్ధ‌మ‌ని ఇప్ప‌టికే భూమ‌న ప్ర‌కటించారు.

15 Replies to “భూమ‌న‌పై ఫిర్యాదు.. త‌ర్వాత ఏంటి?”

    1. అవును.. నీ జగన్ రెడ్డి ని, నీ జగన్ రెడ్డి సంకలు నాకే నీలాంటి అడ్డ గాడిదలను కాస్తున్నాను..

      కామెంట్స్ రాస్తే.. PAYTM కోసం రాస్తున్నాను అంటారు..

      కామెంట్స్ రాయకపోతే.. గాడిదలను మేపుతున్నాడా అంటారు..

      ఎందుకు అంత భయం, బాధ, కుళ్ళు, ఏడుపు..?

      ..

      గత మూడు వారాలుగా స్టాక్ మర్కెట్స్ లో ఒడిదుడుకులతో కాస్త బిజీ గా ఉన్నాను..

      మీ జగన్ రెడ్డి చెప్పినట్టు.. కళ్ళు మూసుకుని పడుకో.. మాకు వేరే పనులున్నాయి..

  1. ఏముంది …విచారణ..అరెస్ట్… జగన్ ఫోన్ కాల్. పొన్నవోలు సొల్లు…రేమండ్

  2. ఏముంది…విచారణ అరెస్ట్, జగన్ ఫోన్ కాల్..పొన్నవోలు సొల్లు, రి మాండ్

  3. *”అయ్యో గ్రేట్ఆంధ్రా మళ్లీ మొదలయ్యిందా? రోజూ లేవగానే కాస్ట్ కాస్ట్ అంటూ అరుపులు వేయకపోతే మీకు నిద్ర పట్టదేమో! ఏమైనా నిజంగా ఓ షేsమ్ అనేది మీ జీవితంలో ఉందా? రాజకీయ నేతల కోసం కుల ప్రోపగాండా చేయడమే మీకు ఉన్నతమైన జర్నలిsజం అనిపిస్తోంది.

    పబ్లిక్ మాత్రం చాలా క్లియర్గా చూపించింది – 175 సీట్లలో 11 సీట్లు మాత్రమే ఇచ్చింది మీ అభిమాన పార్టీకీ. అది ఓ ఓటింగ్ కాదు గురూ… ప్రజల చెంపపెట్టే! అయినా ఇంకా అదే కుల పాడే పాట పాడుతూనే ఉన్నారు. ఎంత ఓవరా మీరు!

    మీరు జర్నలిస్ట్ అనుకోవడం అన్నదే ఒక జోక్ లా ఉంది. బేసిక్ ఎథిక్స్, నిజాsయితీ ఎక్కడా కనబడటం లేదు. ‘ఇండిపెండెంట్ మీడియా’ అని చెప్పుకుంటూ ఉంటే, ఏం గురూ… నిజాsల నుండి ఇండిపెండెంట్ అని అర్థం పెట్టుకోవాలా?

    ఒక్కసారి అద్దంలో చూసుకోండి. కనీసం అప్పుడు అయినా మిగిలి ఉన్న షేsమ్ గుర్తుకు వస్తుందేమోs!”**

  4. ఐదేళ్ల జగన్‌ పాలనలో ప్రతి అడుగులోనూ హిందువుల విశ్వాసాలతో ఆటలాడుకున్నాడు. శ్రీరాముని విగ్రహం తల నరికేశారు. లక్ష్మీనరసింహస్వామి వారి రథాన్ని తగలబెట్టారు. దుర్గమ్మ వెండి రథంలోని సింహాలను మాయం చేశారు. సీతమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు గోవులు చనిపోయాయంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడు

Comments are closed.