యువి నుంచి ఇక వరుస రిలీజ్‌లు

ఇకపై యువి నుంచి వరుసగా సినిమా రిలీజ్ లు వుండబోతున్నాయి.

టాలీవుడ్‌లోని పెద్ద నిర్మాణ సంస్థల్లో యువి ఒకటి. మిర్చి, సాహొ, రాధేశ్యామ్ లాంటి పెద్ద సినిమాలు, మధ్యలో అనేక మిడ్ రేంజ్, చిన్న సినిమాలు చేస్తూ వస్తోంది. కానీ ఇటీవల వార్తల్లో మాత్రం వుండడం లేదు. చేతిలో సినిమాలు లేవా అంటే విశ్వంభర లాంటి భారీ సినిమా వుంది.

అనుష్కతో ఘాటీ, శర్వానంద్, వరుణ్ తేజ్, సంతోష్ శోభన్, అఖిల్ ఇలా చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు అనేకం వున్నాయి. కానీ విడుదలలు లేకపోవడంతో యువి సంస్థ పేరు ఎక్కువగా వినిపించడం లేదు.

ఇకపై యువి నుంచి వరుసగా సినిమా రిలీజ్ లు వుండబోతున్నాయి. గ్రాఫిక్స్ కారణంగా లేట్ అవుతూ వస్తున్న ఘాటీ, విశ్వంభర సినిమాలకు త్వరలో విడుదల డేట్ లు ప్రకటించబోతున్నారు. ఆ రెండు సినిమాలో ఈ సమ్మర్.. పోస్ట్ సమ్మర్ లో వరుసగా రాబోతున్నాయి. వాటి వెంటనే శర్వానంద్ సినిమా కూడా విడుదల చేస్తారు. దాని తరువాత సంతోష్ శోభన్ సినిమా వుంటుంది.

ఇప్పుడు నిర్మాణంలో వున్న వరుణ్ తేజ్ సినిమా కూడా ఈ ఏడాది సెకండాఫ్ లోనే విడుదల వుండే అవకాశం వుంది. అఖిల్ సినిమా ఇంకా ప్రారంభం కాలేదు. చేతిలో వున్న సినిమాల విడుదల జరిగిపోతే, కొత్త కాంబినేషన్లు సెట్ చేసుకునే పనిలో వున్నారు యువి అధినేతలు.

3 Replies to “యువి నుంచి ఇక వరుస రిలీజ్‌లు”

Comments are closed.