లిక్క‌ర్ స్కామ్‌లో సాక్షిగా విజ‌య‌సాయిరెడ్డి

వైఎస్సార్‌సీపీని వీడిన మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి, లిక్క‌ర్ స్కామ్‌లో సాక్షి.

వైఎస్సార్‌సీపీని వీడిన మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి, లిక్క‌ర్ స్కామ్‌లో సాక్షి. ఈ మేర‌కు విచారించాల‌ని అనుకుంటున్న‌ట్టు ఆయ‌న‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ నెల 18న విజ‌య‌వాడ సీపీ కార్యాల‌యానికి విచార‌ణ నిమిత్తం రావాల‌ని నోటీసులో పేర్కొన్నారు. సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాల‌ని కోరుతూ సీఆర్పీసీ సెక్ష‌న్ 160 కింద నోటీసులు ఇచ్చిన‌ట్టు సిట్ అధికారులు తెలిపారు.

ఆ మ‌ధ్య ఇదే విష‌య‌మై ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. లిక్క‌ర్ స్కామ్‌లో సూత్ర‌ధారి రాజ్ క‌సిరెడ్డి అని ఆయ‌న బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని వెల్ల‌డించారు. అలాగే జ‌గ‌న్ చుట్టూ కోట‌రీ వ‌ల్ల వైసీపీని వీడాల్సి వ‌చ్చింద‌ని విజ‌య‌సాయిరెడ్డి చెప్పారు. వాస్త‌వాలు చెప్పే ఏ ఒక్క‌ర్నీ జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్లేందుకు కోట‌రీ అనుమ‌తించ‌ద‌ని ఆయ‌న అన్నారు.

మ‌రోవైపు లిక్క‌ర్ స్కామ్‌లో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ బృందం అరెస్ట్ చేయాల‌ని అనుకుంది. అయితే ఆయ‌న ముందే అప్ర‌మ‌త్తం కావ‌డంతో అరెస్ట్ త‌ప్పింది. హైకోర్టులో మిథున్‌రెడ్డికి చుక్కెదురైనా, సుప్రీంకోర్టులో ముంద‌స్తు బెయిల్ ల‌భించింది. ఇదే కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రాజ్ క‌సిరెడ్డి కూడా ముంద‌స్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. అయితే విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కోర్టు ఆదేశించిన‌ప్ప‌టికీ, ఆయ‌న ఖాత‌రు చేయ‌లేదు.

ప్ర‌స్తుతం ఆయ‌న అజ్ఞాతంలో ఉన్నారు. అయితే రెండు రోజులుగా సిట్ బృందం హైద‌రాబాద్‌లో రాజ్ క‌సిరెడ్డికి సంబంధించిన కార్యాల‌యాల్లో, బంధువుల ఇళ్ల‌లో క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు. దేశం దాటి వెళ్లకుండా లుక్ఔట్ నోటీసులు కూడా జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. సాక్షిగా విజ‌యసాయిరెడ్డి వెల్ల‌డించే అంశాల‌పై ఉత్కంఠ నెల‌కుంది.

11 Replies to “లిక్క‌ర్ స్కామ్‌లో సాక్షిగా విజ‌య‌సాయిరెడ్డి”

  1. “మాడా మోహన రెడ్డి” ఈమధ్య ఈడి బట్టలు విప్పి చెయ్యడం మానేశాడట.. అందుకే ఈడు బయటకు వచ్చి నిజాలు చెప్పేస్తున్నాడు..

    11 మోహన రెడ్డి కోసం చంచల్ లో మగ ఖైదీ లు వెయిటింగ్ అంటా

  2. “మాడా మోహన రెడ్డి” ఈమధ్య ఈడి బట్టలు విప్పి చెయ్యడం మానేశాడట.. అందుకే ఈడు బయటకు వచ్చి నిజాలు చెప్పేస్తున్నాడు..

    11 మోహన రెడ్డి కోసం చంచల్ లో మగఖైదీ లు వెయిటింగ్ అంటా

  3. *”అయ్యో గ్రేట్ఆంధ్రా మళ్లీ మొదలయ్యిందా? రోజూ లేవగానే కాస్ట్ కాస్ట్ అంటూ అరుపులు వేయకపోతే మీకు నిద్ర పట్టదేమో! ఏమైనా నిజంగా ఓ షేsమ్ అనేది మీ జీవితంలో ఉందా? రాజకీయ నేతల కోసం కుల ప్రోపగాండా చేయడమే మీకు ఉన్నతమైన జర్నలిsజం అనిపిస్తోంది.

    పబ్లిక్ మాత్రం చాలా క్లియర్గా చూపించింది – 175 సీట్లలో 11 సీట్లు మాత్రమే ఇచ్చింది మీ అభిమాన పార్టీకీ. అది ఓ ఓటింగ్ కాదు గురూ… ప్రజల చెంపపెట్టే! అయినా ఇంకా అదే కుల పాడే పాట పాడుతూనే ఉన్నారు. ఎంత ఓవరా మీరు!

    మీరు జర్నలిస్ట్ అనుకోవడం అన్నదే ఒక జోక్ లా ఉంది. బేసిక్ ఎథిక్స్, నిజాsయితీ ఎక్కడా కనబడటం లేదు. ‘ఇండిపెండెంట్ మీడియా’ అని చెప్పుకుంటూ ఉంటే, ఏం గురూ… నిజాsల నుండి ఇండిపెండెంట్ అని అర్థం పెట్టుకోవాలా?

    ఒక్కసారి అద్దంలో చూసుకోండి. కనీసం అప్పుడు అయినా మిగిలి ఉన్న షేsమ్ గుర్తుకు వస్తుందేమోs!”**

  4. “మిధున్ “రెడ్డి”, కసి”రెడ్డి”, విజయ సాయి “రెడ్డి”…

    చివరకి ఈ స్కాం చిక్కుముడి ఏ _ _ _ “రెడ్డి” దగ్గర వీడుతుందో..

    అర్ధం అవుతుందా????

Comments are closed.