బన్నీ- ముగ్గురు అమ్మాయిలతో…!

ఎవరి పాత్ర ఎంత మేరకు, ఎవరు మెయిన్ హీరోయిన్, మిగిలిన ఇద్దరికి ఏ మేరకు పాత్రలు వుంటాయి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో స్టార్ట్ చేయబోయే సినిమా ముచ్చట ఇది. ఈ సినిమాకు దర్శకుడు అట్లీ. ఈ కాంబినేషన్ అనౌన్స్ మెంట్ నే సెన్సేషన్ అయింది. ఓ మంచి క్రేజీ చిన్న వీడియోను కట్ చేసి వదిలారు. కానీ ఆ చిన్న వీడియోలో చెప్పింది చాలా వుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. సినిమాకు సిజి పనులు చాలా వున్నాయి. అందుకే వెల్ ప్లాన్డ్ గా ముందుకు వెళ్తున్నారు.

ఈ సినిమా కోసం హీరోయిన్ల వేట మొదలైంది. హీరోయిన్లు అని ఎందుకు అనడం అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు హీరోయిన్ల అవసరం వుందని తెలుస్తోంది. ఎవరి పాత్ర ఎంత మేరకు, ఎవరు మెయిన్ హీరోయిన్, మిగిలిన ఇద్దరికి ఏ మేరకు పాత్రలు వుంటాయి ఇలాంటి వివరాలు అన్నీ తెలియాల్సి వుంది.

ఒక హీరోయిన్ గా జాన్వి కపూర్ ను తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత మరో ఇద్దరు హీరోయిన్లు ఎవరైతే బాగుంటుంది అనే కన్నా, ఎవరైతే డేట్ లు అవైలబుల్ గా వుంటాయి అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ భారీ బడ్జెట్ ను వీలయినంత వేగంగా తీయాల్సి వుంది. ఎందుకంటే సిజి వర్క్ లు అన్నీ విదేశీ సంస్థల్లో చేయించాల్సి వుంది. దానికి చాలా టైమ్ పడుతుంది.

One Reply to “బన్నీ- ముగ్గురు అమ్మాయిలతో…!”

Comments are closed.