సిద్దు సినిమా.. నైజాం వాష్ అవుట్

కనీసం అయిదు కోట్లు వెనక్కు ఇస్తే కనీసం నైజాం, సీడెడ్ ఏరియాలకు సర్దుబాటు చేయాల్సి వుంది.

ఒకటి కాదు, రెండు కాదు, ఎనిమిది కోట్లు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ కు తీసుకున్న సినిమా జాక్. హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన జాక్. అతగాడు అంతకు ముందు చేసిన టిల్లు సిరీస్ కలెక్షన్లు చూసి మార్కెట్ అయిన రేంజ్ ఎనిమిది కోట్లు. దీంట్లో కనీసం కోటి రూపాయలు వసూలు కాలేదు. పైగా విడుదల ఖర్చులు యాభై నుంచి డెభై అయిదు లక్షలు వుంటాయి. ఇంత దారుణమైన డిజాస్టర్ తనకు క్రేజ్ వుందనుకుంటున్న ఓ హీరోకి రావడం అంటే ఏమనుకోవాలి? ఇప్పుడు దీని తరువాత రాబోయే తెలుసుకదా మార్కెటింగ్ పరిస్థితి ఏమిటి?

సాధారణంగా సినిమా డిజాస్టర్ అయితే నిర్మాత లేదా హీరో ముందుకు వచ్చి యాభై నుంచి 79 శాతం వరకు వెనక్కు ఇవ్వడం అన్నది ఓ పద్దతి. దీనికి నిర్దిష్టమైన రూలు గట్రా ఏమీ లేదు. అజ్జాత వాసి నుంచి ఇప్పటి వరకు నడుస్తున్న వ్యవహరాలు ఇలాగే వున్నాయి. పది కోట్ల మేరకు రెమ్యూనిరేషన్ తీసుకున్నారు సిద్దు జొన్నలగడ్డ అని సమాచారం. అందువల్ల కనీసం అందులో సగమైనా వెనక్కు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత వుంది.

ఎందుకంటే సీడెడ్, ఆంధ్రలో కూడా బయ్యర్లు నష్టపోయారు. నిర్మాత నైజాంతో కలిపి మూడు ఏరియాల బయ్యర్లను ఆదుకోవాలి. అలా అని నిర్మాతకు ఏమీ లాభాలు వచ్చేయలేదు. వాటిల్లోంచి కొంత వెనక్కు ఇవ్వడానికి ఏమి ఇచ్చినా నిర్మాతకు ఇప్పుడు అదనపు నష్టం తప్ప వేరు కాదు. పైగా జిఎస్టీలు కూడా కట్టుకోవాల్సి వుంది నిర్మాతే . అందువల్ల ఎక్కువగా వెనక్కు ఇవ్వాల్సింది సిద్దునే. కనీసం అయిదు కోట్లు వెనక్కు ఇస్తే కనీసం నైజాం, సీడెడ్ ఏరియాలకు సర్దుబాటు చేయాల్సి వుంది. ఇంకా ఏపీ వుంటుంది. అది కాక ఓవర్ సీస్ వుండనే వుంది.

సిద్దు ప్రస్తుతానికి ఇంకా ఏమీ స్పందించలేదు. స్పందించే అవకాశం వుందని తెలుస్తోంది. అయితే ఒకటి రెండు కోట్లు కంటితుడుపు సర్దుబాటు అయితే ఏ మూలకు చాలదు. కనీసం అయిదు కోట్లు వెనక్కు ఇస్తేనే కొంత ఊరట వుంటుంది మూడు ప్రాంతాల బయ్యర్లకు. కానీ అంత మేరకు రెమ్యూనిరేషన్ వదులుకుంటారా..చూడాలి.

13 Replies to “సిద్దు సినిమా.. నైజాం వాష్ అవుట్”

  1. హీరో ఒక్కడే కాదు…. డైరెక్టర్+కథా రచయిత+ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వొచ్చిన చీఫ్ గెస్ట్…వీళ్ళు కూడా వాళ్ళ రెమ్యునరేషన్ వెనక్కు ఇచ్చేయాలి

  2. జగన్, తనని నమ్ముకుని పోటీ చేసిన MLA లు ఓడిపోతే వాళ్ళకి,,ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బు లో కనీసం దశమ భాగమైనా తిరిగి ఇచ్చాడా?

    వాళ్ళు గెలిచి నప్పుడు నెల నెల వారి వసూళ్లు చేసుకున్నాడు కదా.

    1. కనీసం, తన ప్రభుత్వ టైమ్ లో గ్రామాలు, మండల కేంద్రాలు లో సివిల్ కాంట్రాక్టులు చేసిన చిన్న చితక కాంట్రాక్టర్లు కి న్యాయంగా రావలసి నా బకాయిలు ఐన ఇప్పించాడ ?

  3. Orey nayana 1st mee annaku cheppi aa Koti Emmanu floods appudu promise chesindhi….thuuu mee bathuku cheda….pakka vallaku buddi chepthavu mee annaku kuda cheppi koncham gaddi pettu

Comments are closed.