అనుమానాలు పెంచుతున్న టీటీడీ ఈవో మాటలు!

నానా ఆరోపణలు చేసిన తర్వాత.. గోశాల నిర్వహణపై ప్రజలకు అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.

భూమన కరుణాకర రెడ్డి .. టీటీడీ గోశాలలో గోవులు చనిపోతున్నాయని ఫోటోల సహా చూపించి ఆరోపణలు చేశారు. టీటీడీ అధికారులు, పాలక మండలి ఛైర్మన్, ముఖ్యమంత్రి వాటిని ఖండించారు. అబద్ధాలు అని, మార్ఫింగ్ ఫోటోలు అని అన్నారు. దానికి జవాబుగా.. అవి మార్ఫింగ్ ఫోటోలు కాదని, ఎలాంటి విచారణ అయినా చేయించుకోవచ్చునని కరుణాకర రెడ్డి చెప్పారు. దానికి జవాబుగా టీటీడీ ఏం చేయాలి? కేసుపెట్టి విచారణ జరిపించాలి. చేతనైతే భూమన చెప్పింది తప్పు అని నిరూపించాలి. కానీ.. టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతున్న మాటలు గమనిస్తే.. గోశాల నిర్వహణపై అనుమానాలు పెరుగుతున్నాయే తప్ప.. నివృత్తి కావడం లేదు.

ఇప్పుడు గోశాలలో నిర్వహణ బాలేదు, ఆవులు చచ్చిపోతున్నాయని అంటోంటే.. గత అయిదేళ్ల వైసీపీ కాలంలో నిర్వహణ ఎలా ఉన్నదనే విషయంలో టీటీడీ ఈవో శ్యామల రావు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. గత అయిదేళ్లలో అక్కడ దుర్భర పరిస్థితులు ఉన్నాయని, దాణా కొనుగోలులో భారీ స్కామ్ జరిగిందని, నాసిరకం దాణా- కాలం చెల్లిన మందులు ఇచ్చి వాటి ప్రాణాల మీదకు తెచ్చారని, నాచుపట్టిన నీరు, పురుగులు పట్టిన దాణా పెట్టారని శ్యామలరావు నిందలు వేశారు.

సాధారణంగా విమర్శలకు కౌంటర్లు ఇస్తున్నప్పుడు రాజకీయ నాయకులు ఇలాగే మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఫలానా అన్యాయం జరుగుతోంది బాబూ అని ప్రతిపక్షాలు గొల్లుమంటే.. మీ హయాంలో అన్నేసి అన్యాయాలు జరగలేదా? అంటూ గోల చేయడం నాయకులకు అలవాటు. తమ మీద వచ్చిన విమర్శలకు సూటిగా జవాబు ఉండదు. ఎదుటివారిపై గతించిపోయిన వ్యవహారాల గురించి.. నిరాధార ఆరోపణలతో విరుచుకుపడడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు టీటీడీ ఈవో శ్యామలరావు తీరు కూడా ఇలాగే కనిపిస్తోంది.

ఆయన మాటల్లో చాలా ట్విస్టులు ఉన్నాయి. గత ప్రభుత్వం కాలంలో గోశాలలో అక్రమాలు జరిగాయని అంటూ..వాటిని అప్పటి అధికారులు తొక్కి పట్టారని అంటున్నారు. తొక్కిపెడితే వీరికి ఇప్పుడు మాత్రమే తెలిసిందా?ఇన్నాళ్లూ తెలియలేదా? అనేది ప్రశ్న. మరొకవైపు విజిలెన్స్ తనిఖీల్లో అప్పట్లోనే ఇవన్నీ బయటపడ్డాయని అంటూనే.. అప్పటి డైరక్టర్ హరినాధ్ రెడ్డి విజిలెన్స్ వారిని గోశాలలోకి రానివ్వలేదని ఆరోపిస్తున్నారు. ఆయన మాటలు పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయి.

సూటిగా చెప్పాలంటే.. టీటీడీ ఈవో స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి.. ఒక పవర్ పాయింట్ ప్రెజంటేషన్ కూడా ఇచ్చి, వీడియోలు ప్రదర్శించి.. నానా ఆరోపణలు చేసిన తర్వాత.. గోశాల నిర్వహణపై ప్రజలకు అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.

2 Replies to “అనుమానాలు పెంచుతున్న టీటీడీ ఈవో మాటలు!”

  1. Simple question : If previous government’s maintenance was bad, why did it take EO and TTD chairman 11 months to find it out. Why did EO and TTD chairman not look into the status of Goshala until leader of YCP raised this as an issue? Day after day, current TTstatements. Alliance leaders are getting deeper into this failure with their statements.

    Hope atleast now, they will realize their mistake and will start corrective actions instead of trying to blame YCP for everything.

Comments are closed.