వీళ్లంతా ఎవ‌రూ.. ఎప్పుడూ చూసిన‌ట్టు లేదే!

టీటీడీ ఎస్వీ గోశాల‌లో గోమాత‌ల మృతి రాజ‌కీయ రంగు పులుముకుంది.

టీటీడీ ఎస్వీ గోశాల‌లో గోమాత‌ల మృతి రాజ‌కీయ రంగు పులుముకుంది. ఈ విష‌య‌మై కూట‌మి ప్ర‌భుత్వానికి రాజ‌కీయంగా తీవ్ర న‌ష్టం జ‌రిగింది. దీంతో న‌ష్ట నివార‌ణ‌కు కూట‌మి నేత‌లు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇందులో భాగంగా వివ‌ర‌ణ ఇచ్చేందుకు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, బోర్డు స‌భ్యుడు భానుప్ర‌కాశ్‌రెడ్డి, చంద్ర‌గిరి ఎమ్మెల్యే పులివ‌ర్తి నాని, శాప్ చైర్మ‌న్ ర‌వినాయుడు మీడియా ముందుకొచ్చారు.

వీళ్ల‌లో పులివ‌ర్తి నాని మిన‌హాయిస్తే, మిగిలిన ముగ్గురితో కూట‌మికి, ప్ర‌జ‌ల‌కు సంబంధం ఏంటి? ఎవ‌రు వీళ్లంతా? అధికారం వ‌చ్చాక చెలాయిస్తున్నారే అని టీడీపీ, జ‌న‌సేన నేత‌లు అనుకునే ప‌రిస్థితి. చంద్ర‌బాబునాయుడి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేసిన ఒక టీవీ చానెల్ అధిప‌తిగా మాత్ర‌మే బీఆర్ నాయుడి పేరు వినిపించింది. టీడీపీతో త‌న‌కు గాఢ‌మైన అనుబంధ‌మ‌ని ఆయ‌న చెప్పుకుంటారే త‌ప్ప‌, ఎప్పుడూ ఆయ‌న్ను పార్టీ స‌మావేశాల్లో చూసిన వాళ్లు లేరు.

టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విని ఆశించిన టీటీడీ ముఖ్య నాయ‌కులు చాలా మంది ఉన్నారు. అదృష్టం మాత్రం బీఆర్ నాయుడిని వ‌రించింది. అలా ఆయ‌నిప్పుడు అంద‌రికీ క‌నిపిస్తున్నారు. టీడీపీ కోసం జైళ్ల‌కు సైతం వెళ్లిన వాళ్లు, నిట్టూర్చుకుంటూ కూచోవాల్సిన దుస్థితి. వ‌చ్చిన అవ‌కాశాన్ని ఆయ‌న స‌ద్వినియోగం చేసుకుంటున్నారా? అంటే… టీడీపీ నాయ‌కులే చెప్పే స‌మాధానాలు వింటే షాక్ తింటారు.

టీటీడీ బోర్డు స‌భ్యుడు భానుప్ర‌కాశ్‌రెడ్డి గురించి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది. ప్ర‌జ‌ల‌తో ఏ మాత్రం సంబంధం లేకుండా, కేవ‌లం పైవాళ్ల‌ను మెప్పిస్తూ, మోస్తూ రాజ‌కీయాల్లో ఎలా ప‌బ్బం గ‌డుపుకోవ‌చ్చో నిలువెత్తు ఉదాహ‌ర‌ణ ఎవ‌ర‌ని అడిగితే, తిరుప‌తి వాసులు అత‌ని పేరే చెబుతారు. తిరుమ‌ల శ్రీ‌వారిని అత్య‌ధికంగా వాడుకున్న వాళ్లెవ‌రైనా ఉన్నారంటే, రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రూ భాను పేరే చెబుతారు. ఒక్కొక్క‌రిలో ఒక్కో టాలెంట్ వుంటుంది. మా వాడిలో ఆ టాలెంట్ వుంద‌ని బీజేపీ నేత‌లు చ‌మ‌త్క‌రిస్తుంటారు. శ్రీ‌వారిని న‌మ్ముకుని భ‌క్తిపార‌వ‌శ్యంలో బ‌తికే వాళ్లు సామాన్యులైతే, నిత్యం భ‌క్తిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకునే వాళ్లు నాయ‌కుల రూపాల్లో క‌నిపిస్తున్నార‌ని తిరుప‌తి లోక‌ల్స్ కామెంట్స్ ఆసక్తిక‌రం.

శాప్ చైర్మ‌న్ ర‌వినాయుడు… మంత్రి నారా లోకేశ్ కోటాలో నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీలో మొద‌టి జాబితాలోనే చోటు ద‌క్కించుకున్నారు. టీడీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు తిరుప‌తిలో అధికార ప‌క్షానికి వ్య‌తిరేక పోరాటాల్లో ఎక్క‌డా ఇత‌ను పాల్గొన‌డాన్ని చూడ‌లేద‌ని సొంత పార్టీ శ్రేణులు అంటున్నాయి. వ‌డ్డించే వాడు మ‌నోడైతే, క‌డాన ఉన్నా అన్నీ స‌మ‌కూరుతాయ‌నేందుకు ర‌వినాయుడే ఉదాహ‌ర‌ణ‌. ఇప్పుడు తిరుప‌తిలో ర‌వినాయుడి మాట‌కే చెల్లుబాటు ఎక్కువ‌.

జ‌న‌సేన ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ‌, ఇత‌ర నాయ‌కులంతా ఇత‌ని ముందు డ‌మ్మీల‌య్యారని కూట‌మిలోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పోలీస్ అధికారులు సైతం ర‌వినాయుడి మాట‌కే ప్రాధాన్యం ఇస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కేవ‌లం లోకేశ్‌కు స‌న్నిహితుడ‌నే ముద్ర ప‌డ‌డంతో ర‌వినాయుడు అధికారాన్ని చెలాయిస్తున్నారు. భ‌విష్య‌త్‌లో అధికారం పోతే, ర‌వినాయుడి అడ్ర‌స్ ఎక్క‌డుంటుందో ఎవ‌రికీ తెలియ‌ద‌నే సెటైర్స్ కూడా లేక‌పోలేదు.

టీడీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు, పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాల‌ని త‌పించిన వాళ్లంతా ఇప్పుడు ఎక్క‌డున్నారో ఎవ‌రికీ తెలియ‌డం లేదు. కూట‌మి పాల‌న‌లో లాబీయిస్టులకు ఉన్నంత ప్రాధాన్యం, నిఖార్సైన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు ఏ మాత్రం లేద‌నేందుకు ఉదాహ‌ర‌ణ‌గా వీళ్ల ముగ్గురి పేర్లను కూట‌మి నేత‌లు చెబుతున్నారు.

ఒక్క పులివ‌ర్తి నాని మాత్రం చంద్ర‌గిరిలో చెప్పుకోద‌గ్గ స్థాయిలో పాల‌క‌ప‌క్షంతో పోరాడారు. ఆయ‌న ఒక్క‌రే నిన్న‌టి ప్రెస్‌మీట్‌లో జ‌నానికి తెలిసిన నాయ‌కుడు. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ప్ర‌జాద‌ర‌ణ కంటే, ఇత‌రేత‌ర అంశాల్లో టాలెంట్ ఉన్న వాళ్ల‌కే అధికారంలో ఉన్న పెద్ద‌ల అండదండ‌లు వుంటాయ‌నే అభిప్రాయానికి ఇదో చిన్న ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే అని కూట‌మి నేత‌లు అంటున్నారు.

13 Replies to “వీళ్లంతా ఎవ‌రూ.. ఎప్పుడూ చూసిన‌ట్టు లేదే!”

  1. నువ్వు అఙ్ఞానానివి అని అందరు అలాగే అనుకుంటే ఎలా? మాకు భాను ప్రకాష్ బాగానే తెలుసు. నువ్వు వేసిన ఫోటో లో నరిసింహ యాదవ్ కనిపిస్తున్నారు. మాజీ తుడా చైర్మన్ గా , ప్రస్తుత యాదవ సంఘం చైర్మన్ ఆయన సుపరిచితమే

  2. అంటే వాళ్లెవరూ సజ్జల, సుబ్బారెడ్డి,vsr, అనంత బాబు, గోరంట్ల, గుట్కా, వంశీ అంతటి గొప్పవాళ్ళు కాదని అంటావు.

  3. ఎప్పుడూ చూడకపోతే ఇప్పుడు చూడండి. కొత్తతరం వస్తే ఎప్పుడు చూడలేదని పాతవారైతె ఎప్పుడు పాతవారేనా అని పేజీలు నింపితే ఏలా GA సారు. ఎదో ఒక కళ వారిలో ఉంటేనే ఏలినవారు కరుణిస్తారని మీకు తెలియని విషయమా గురువు గారు!

  4. ప్రజలందరికీ తెలిసిన వ్యక్తా మన సఖల శాఖా మంత్రి గారు గత ఐదేళ్లు రాష్ట్రం అంతా ఆయన చేతుల్లోనే నడిచింది మరి..

  5. లె-వె-న్”-మోహి-ని” ప-వ-న్ నాలు-గో భా-ర్య

    T-h-i-s s-t-r-a-i-g-h-t a-w-a-y l-o-o-k-s l-i-k-e a Y-C-P fa-ke ac-co-u-nt. Th-ey a-r-e b-es-t i-n s-co-l-di-ng th-eir famil-ies. An-y-t-h-ing fo-r vot-es :). Sa-d s-ta-t-e of Y-C-P.

  6. తిరుమల లడ్డు పైన వీరంతా ఎక్కడ ఉన్నారు … తిరుపతి తొక్కిసలాటలో ప్రజలు చనిపోతే వీళ్లంతా ఎక్కడ ఉన్నారు అప్పుడు ఎవరి పైన వీరు మాట్లాడినారు,,, అక్కడ గోశాల లో జర్గుతున్న దాని పైన ఏ కదా భూమాన మాట్లాడుతుంది

Comments are closed.