బొత్సకు బంపర్ ఆఫర్ నిజమేనా?

ఉత్తరాంధ్రాలో సీనియర్ నాయకుడు వైసీపీకి చెందిన శాసన మండలి ప్రతిపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ మీద ఇటీవల కాలంలో రాజకీయ పుకార్లు ఎక్కువ అయ్యాయి. ఆయన నిమ్మళంగా తన పని తాను చేసుకుంటూ…

ఉత్తరాంధ్రాలో సీనియర్ నాయకుడు వైసీపీకి చెందిన శాసన మండలి ప్రతిపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ మీద ఇటీవల కాలంలో రాజకీయ పుకార్లు ఎక్కువ అయ్యాయి. ఆయన నిమ్మళంగా తన పని తాను చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆయనకు ఏవేవో అంటగడుతున్నారు. ఆయనను ఫ్యాన్ నీడ నుంచి గాజు గ్లాస్ చేతిలో పట్టుకునేలా చేస్తున్నారు సోషల్ మీడియాలో అయితే బొత్స వైసీపీలో ఉండరు అనేలా ప్రచారం సాగుతోంది.

తాజాగా చూస్తే బొత్సను జనసేన అధినాయకత్వం తమ పార్టీలోకి ఆవ్హానించిందని వైసీపీ కంటే బాగా చూసుకుంటామని గౌరవ మర్యాదలకు లోటు లేకుండా వ్యవహరిస్తామని చెబుతూ భారీ హామీలు ఇచ్చిందని బంపర్ ఆఫర్లు కూడా ప్రకటించిందని పుకార్ల లాంటి వార్తలు వ్యాపిస్తున్నాయి.

బొత్స జనసేన అధినాయకత్వం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం మెగా ఫ్యామిలీతో ఆయనకు మంచి పరిచయాలు ఉండడం ఉత్తరాంధ్రాలో ఆ సామాజిక వర్గం అధికంగా ఉండడం, బొత్స తరచూ పవన్ ని కలుస్తూండడంతో ఈ పుకార్లకు మరింతగా బలం చేకూరుతోంది.

బొత్స సొంత తమ్ముడే నెల్లిమర్లలో జనసేనలో ఉండడం ఆయన అనుచరులు అభిమానులు కొందరు ఆ పార్టీ బెస్ట్ అని ఆయనకు సూచిస్తున్నారు అని కూడా ప్రచారం సాగుతోంది. అయితే బొత్స వైసీపీలో ఇపుడు కేబినెట్ ర్యాంక్ పదవిలో ఉన్నారు. 2028 దాకా ఆయన పదవికి ఢోకా అయితే లేదు.

అదే ఆయన వైసీపీని వీడితే జనసేనలో ఏ పదవి దక్కుతుంది అన్న ప్రశ్నలు వేస్తున్న వారూ ఉన్నారు. ఆయన మంత్రిగా దశాబ్దాల పాటు చేసిన వారు. ఇపుడు అదే కేబినెట్ హోదాను అనుభవిస్తున్నారు.

జగన్ కూడా ఆయనను మంచిగా చూసుకుంటున్నారు పార్టీ పరంగా చూస్తే విజయనగరం జిల్లాతో పాటు విశాఖలోనూ బొత్స హవాకు బ్రేకులు లేవనే అంటున్నారు. అయిదేళ్ళ పాలన తరువాత కూటమి మీద జనాభిప్రాయం ఎలా మారుతుందో తెలియదు అని అంటున్నారు.

రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన బొత్స ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ఇలా సడెన్ డెసిషన్స్ తీసుకోరు అని అంటున్నారు. అయితే పుకార్లు మాత్రం బొత్స జనసేనలోకే వెళ్తారు అది రేపో మాపో అనే అంటున్నాయి. బొత్స పెదవి విప్పి ఖండిస్తేనే వీటికి చెక్ పడుతుందేమో అని అంటున్నారు.

10 Replies to “బొత్సకు బంపర్ ఆఫర్ నిజమేనా?”

  1. బొత్స నా బొచ్చు పీకాలి. కుటంబం మొత్తం ఓడింది. ఏమీ పీకాడు. వైజాగ్ ఎంపీ బిగ్గెస్ట్ టీడీపీ విన్.

  2. బొత్స YCP లోనే ఉంటే నిస్వార్ధపరుడు, ప్రజాసేవకుడు అని రాయాలి..

    అదే గ్లాస్ గుర్తు కి మారితే దుర్మార్గుడు అవినీతిపరుడు ప్రజల్లో హవా తగ్గిపోయింది అని రాయాలి..

    రెండు వెర్షన్లు రాసి పెట్టుకొమ్మా..

    ఏది అవసరం అవుతుందో తెలీదు కదా

  3. అయ్యా గ్యాస్ ఆంద్ర ఆయన పార్టీ మారతాడు మారడో దేవునికి తెలియాలి. ఈ రకంగా పుకార్లు లేపి ఆయనకు ఇష్టం ఉందా లేకపోయినా ఈ మీడియా వారు ఆయనను మా పార్టీ మారేటట్టుగా చేస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు ?

    పొమ్మన లేక పొగబెట్టిన చందాన ? ఆయనను పార్టీ

    నుంచి తప్పించాలి అనుకున్నది ఎవరు ? ఎందుకు ?

    ప్రతి ఒక్కటి రాజకీయ కోణంలో నుంచి చూస్తే సమస్యలు ఇలాగే ఉంటాయి. ఈ వదంతులకు ఆద్యులు ఎవరు ఏమి ఆశించి ఈ వదంతులను ప్రచారం చేస్తున్నారు ? ఆయనకు సంబంధం లేని విషయాన్ని ఆయన ఆయనను ఎలా ఖండించమంటావురా గ్యాస్ ఆంధ్ర

Comments are closed.