సిద్దు జొన్నలగడ్డ-బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో భోగవిల్లి ప్రసాద్ నిర్మిస్తున్న జాక్ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు. సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎవరూ ఎదురుచూస్తున్నట్లు లేదు. ఇలాంటి నేపథ్యంలో ట్రయిలర్ వచ్చింది.
బొమ్మరిల్లు భాస్కర్ ఓ డిఫరెంట్ జానర్ ను ఈసారి ట్రయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మంచోడా..చెడ్డోడా..అసలు ఎవరు ఈ జాక్ అనే విధంగా క్యారెక్టర్ డిజైన్ చేసారు. ఒక విధంగా చెప్పాలంటే పూరి జగన్నాధ్ స్టయిల్ క్యారెక్టరైజేషన్.
సిద్దు జొన్నలగడ్డ అటు టిల్లు క్యారెక్టర్ నుంచి బయటపడాలి. అలా అని మరీ బయటకు వచ్చేయకూడదు. ఈ రెండింటికి న్యాయం చేసేలా క్యారెక్టర్ ను తయారు చేసినట్లు కనిపిస్తోంది.
ట్రయిలర్ కట్ బాగుంది. ఎక్కడా రిపీట్ అని కానీ, బోరింగ్ అని కానీ లేకుండా కట్ చేసారు. కీలకమైన కేసులను దర్యాప్తు చేసే అధికారిగా ప్రకాష్ రాజ్, వాళ్ల కేసులను తన్నుకుపోయే పారలల్ ఇన్విస్టిగేటర్ గా సిద్దు కనిపించారు.
అసలు సిద్దు ఎవరు? ఎందుకు పారలల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అన్నది పాయింట్. అదే సిద్దు మళ్లీ ప్రకాష్ రాజ్ టీమ్ తో ఎందుకు కలిసారు అన్నది మరో పాయింట్. సిద్దు స్టయిల్ ఫన్ వుండేలా చూసుకున్నారు. సిద్దు మీద మరీ యాక్షన్ దిశగా వెళ్లకపోవడం బాగుంది. వైష్ణవీ చైతన్య జస్ట్ గ్లామర్ డాల్ నా, పాత్ర వుందా అన్నది ట్రయిలర్ లో రివీల్ కాలేదు.
మొత్తం మీద ఇప్పటి వరకు అండర్ డాగ్ గా వున్న జాక్ సినిమాకు ఈ ట్రయిలర్ కాస్త బజ్ ను పెంచుతుంది. అందులో సందేహం లేదు. ట్రయిలర్ కోసం వేసిన కొన్ని డైలాగులు సెన్సారులో ఎగిరిపోయెే అవకాశం వుంది.