నాగబాబు కేరాఫ్ పిఠాపురం?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. అయిన వెంటనే పిఠాపురం పర్యటనకు వెళ్తున్నారు.

కౌన్సిల్, రాజ్యసభ సభ్యులకు ఓ నియోజకవర్గం అంటూ స్పెసిఫిక్ గా వుండదు. వాళ్లు వాళ్లకు నచ్చిన నియోజకవర్గాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. వాళ్లకు వచ్చే నిధులు ఏమైనా వుంటే కావాలంటే అక్కడే ఖర్చు పెట్టవచ్చు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. అయిన వెంటనే పిఠాపురం పర్యటనకు వెళ్తున్నారు. ఆల్రెడీ మంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా వున్నారు. మరి అదే పిఠాపురం వెళ్లి, అక్కడ పర్యటనలు చేయాలి అని నాగబాబు ఎందుకు సిద్దం అవుతున్నారు? ఇదీ ప్రశ్న.

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయగానే పిఠాపురం బయలుదేరి వెళ్తున్నారు. దత్తపీఠం దర్శనానికో, శక్తి పీఠం సందర్ననానికో కాదు, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభోత్సవాలు చేస్తారట. నిజానికి అవన్నీ చేయాల్సింది లోకల్ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్. మధ్యలో నాగబాబు ఏమిటి?

దాదాపు ఏడాది అవుతోంది పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ ఎన్నికై. కానీ నియోజక వర్గంలో పట్టుమని పది రోజులు వుండలేదనే విమర్శ వుంది. మరోపక్కన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ బాగా యాక్టివ్ అవుతున్నారు. పర్యటనలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇన్ చార్జ్ లతో ఎన్నాళ్లు నెట్టుకువస్తారు.

బహుశా అందుకే ఇక నాగబాబు పిఠాపురం మీద దృష్టి పెడతారేమో? పిఠాపురంలో వుంటూ జనాలకు దగ్గరగా వుంటూ, పవన్ తరపున అర్జీలు స్వీకరించి, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారేమో? కొద్ది రోజులు ఆగితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

12 Replies to “నాగబాబు కేరాఫ్ పిఠాపురం?”

  1. ఇక్కడ చంద్రబాబు గారికి అమిత్ షా గారికి అష్టి పంచాయితీ లు ఏమి లేవు ఆయన ప్రత్యేక హోదా ఇస్తానని బీజేపీ మోసం చేసిందని రాష్ట్రము తరపున పోరాటం చేసినారు బాబు గారు మన రాష్ట్రానికి కూడా ఒక అంబి వున్నాడు అని గ్రహించలేక పోయారు మన అంబి బీజేపీ తో రహస్య పొత్తు పెట్టుకొని బీజేపీ కి భరోసా ఇవ్వగలిగేరు కానీ బీజేపీ చేసిన మోసం దెబ్బ అప్పటి వరకు కలిసి వున్నా బాబు గారి మీద పడింది అది కాక వివేకా హత్య కేసు కోడి కత్తి ముప్పై రెండు కమ్మ డీస్పీ లు పింక్ డైమండ్ ఇవన్నీ బాబు గారికి సంబంధం లేకపోయినా జనం నమ్మటం తో చతికిల పడ్డారు ఎలక్షన్ లో గెలిచినా మరుక్షణం వైసీపీ నాయకులూ కేసు లన్నిటి లో స్టే లు తెచ్చుకొని పోలవరాన్ని ప్రత్యేక హోదాని అటకెక్కించేసి ఏది వదలకుండా విచ్చలవిడి అవినీతి అరాచకం తో రీసెంట్ ఎలక్షన్ లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంటికి తల గొరిగి పంపించిన సిగ్గు లేకుండా అప్పటి విషయం రాయమనడం లో అర్థమేముంది బాబు గారు ఎప్పటికి రాష్ట్రము కోసం పోరాటం చేసాడని జనాలకు అర్ధమైన తర్వాత రిజల్ట్స్ ఎలాగుందో వైసీపీ కి ఇప్పటికి అర్దమవకపోవడం మరి pity

  2. అసలు పిఠాపురాన్ని మన మేమిటి మన బతుకేమిటి అన్నది లేదు అంటే మీకు క్లారిటీ వచ్చేసింది భవిష్యత్తులో పోటీపడే పార్టీలు టీడీపీ జనసేన అని ఈ నిజాన్ని మీరు చెబితే మీకు పడే paytm డబ్బు ఆగిపోతుందని చెబుతులేదంతే మనోణ్ని వెర్రి వాణ్ణి చేసి డబ్బు కొట్టేస్తున్నారు పర్వాలేదు అది కష్టపడ్డా సొమ్ము కాదు కదా

Comments are closed.