లోకేష్ డైలాగ్.. ముందు జాగ్రత్త వ్యవహారం కాదా?

పరిశ్రమలు రాకుండా అడ్డుకునే వారిని రెడ్ బుక్ లోకి ఎక్కిస్తా అని బెదిరించడం వెనుక ఈ వ్యూహం ఉన్నదనే అంటున్నారు.

ఎన్డీయే కూటమి పార్టీలు చంద్రబాబునాయుడు సారథ్యంలో అధికారంలోకి వచ్చి 9 నెలలు పైగానే అవుతోంది. నిరాటంకంగా వారి పరిపాలన సాగుతోంది. తమాషా ఏమిటంటే.. ఏడాది పాలనకు దగ్గర పడుతున్నారు గానీ.. ఇప్పటిదాకా సీఎం గానీ, డిప్యూటీ సీఎం గానీ, నారా లోకేష్ గానీ.. ఎక్కడ పబ్లిక్ లో మాట్లాడినా, ప్రెస్ మీట్ లో మాట్లాడినా.. జగన్మోహన్ రెడ్డిని తలచుకోకుండా ఉండలేకపోతున్నారు.

జగన్ చేసిన నష్టం పూడ్చలేకపోతున్నాం.. అనే మాట వల్లించకుండా వారి ఏ ప్రసంగమూ పూర్తి కావడం లేదు. ఇప్పుడు ఇలాంటి వక్రమైన వ్యూహాల క్రమంలో భాగంగా.. మరొక కొత్త స్ట్రాటెజీని ఎంచుకున్నారేమో అని.. నారా లోకేష్ మాటలను గమనిస్తే అర్థమవుతోంది.

నారా లోకేష్ ఏం అంటున్నారంటే.. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పనిచేయరు.. చేసే వాళ్లను చేయనివ్వరు’’ అని అంటున్నారు. ఇదేదో యథాలాపంగా.. ప్రతిపక్షం వారి మీద రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగా బురద చల్లేయడానికి అన్న మాటలాగా కనిపించడం లేదు. ఈ మాటల వెనుక ఒక వ్యూహమే ఉంది. ‘ఉపాధి కల్పనకు తెచ్చిన పరిశ్రమలను అడ్డుకుంటే రెడ్ బుక్ లోకి పేరు ఎక్కిస్తామని’ నారా లోకేష్ హెచ్చరిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిని వదిలిపెట్టం అంటున్నారు. సరిగ్గా ఈ మాటల దగ్గరే అనేక అనుమానాలు పుడుతున్నాయి.

ఈ తొమ్మిది నెలల కాలంలో.. ఇదిగో వచ్చేస్తున్నాయి.. అదిగో వచ్చేస్తున్నాయి.. అంటూ పెట్టుబడులు రాష్ట్రానికి వెల్లువెత్తుతున్నట్టుగా.. కూటమి పార్టీల నాయకులు అనేక కంపెనీల పేర్లను పదేపదే చెప్పుకున్నారు. ఆయా ప్రకటనల్లో ప్రతిదీ పెట్టుబడులు, ఉపాధికల్పనల రూపేణా రాష్ట్రానికి, యువతకు మేలు చేసేది కాదు. కొన్ని వారు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న వ్యాపారం మాత్రమే. అయితే.. పెద్ద సంస్థల పేర్లు ప్రస్తావిస్తూ.. ప్రతిదీ.. మసిపూసి మారేడుకాయ చేసేస్తూ.. రాష్ట్రానికి మహాద్భుత ప్రయోజనం ఒనగూరిపోతున్నట్టుగా డప్పు కొట్టుకుంటున్నారు.

కాగ్నిజెంట్ సహా.. అనేక పెద్ద కంపెనీలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించడం గురించి లోకేష్ ఇప్పటికే పదేపదే చెప్పారు. ఆ ఊసు ఎక్కడా కనిపించడం లేదు. ఇలాంటివి అనేకం ఉన్నాయి. ఇలా ప్రతిసారీ మాయమాటలు చెబుతూ.. కంపెనీల రాక గురించి ప్రజలను మభ్యపెట్టడం తెలుగుదేశానికి కొత్త కాదు.

గతంలో అయిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా వారు అనేక కంపెనీలు గురించి.. ఇదిగో వచ్చేస్తున్నాయి.. అంటూ ప్రకటించారు. కానీ ఆయా సంస్థలు అయిదేళ్ల కాలంలో రానేలేదు. ఈసారి కూడా మంత్రుల ప్రకటనలకు వాస్తవంగా సంస్థలు గ్రౌండింగ్ కావడానికి మధ్య చాలా వ్యత్యాసం నడిచే అవకాశం ఉంది. ఇలాంటి బెడదను తట్టుకోవడానికి నారా లోకేష్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారేమో అనిపిస్తోంది.

తోచినట్టుగా పలానా కంపెనీలు వస్తున్నాయని ప్రకటించేయడం.. తీరా అవి రాకపోతే.. ఆయా పరిశ్రమలు రాకుండా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని, వారికి ఆకాశ రామన్న లేఖలు రాసి బెదిరిస్తున్నారని ఆరోపణలు చేయడం ఒక కొత్త వ్యూహంలా కనిపిస్తోంది. పరిశ్రమలు రాకుండా అడ్డుకునే వారిని రెడ్ బుక్ లోకి ఎక్కిస్తా అని బెదిరించడం వెనుక ఈ వ్యూహం ఉన్నదనే అంటున్నారు. ఏ కంపెనీలు రాష్ట్రానికి రాకపోయినా సరే.. మేం వారికోసం అన్నీ సిద్ధం చేశాం.. కానీ వైసీపీ వారు బెదిరించి రాకుండా చేశారు.. అని చెప్పుకుంటూ రాబోయే నాలుగున్నరేళ్లూ గడిపేస్తారేమో అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.

14 Replies to “లోకేష్ డైలాగ్.. ముందు జాగ్రత్త వ్యవహారం కాదా?”

  1. Naa modda companies vachayi ..

    Ee pappesh gaadiki superman dress veyadaniki jocky, ap janallo chevi lo Lilly flower pettadaniki inkokati..

  2. ఆడలేక మద్దెలు ఓడు అన్నాడట వెనకటికి ఒకడు అసలు ప్రతిపక్షం companies ఎలా అడ్డుకుంటుంది.అధికారం లొ వున్న వాళ్ళు వాటా ఇవ్వాలి అని harass చేస్తారు. Jagan era లొ AP is no1 in ease of doing business rankings అర్థమైందా యువరాజా!

  3. ఆడలేక మద్దెలు ఓడు అన్నాడట వెనకటికి ఒకడు అసలు ప్రతిపక్షం companies ఎలా అడ్డుకుంటుంది.అధికారం లొ వున్న వాళ్ళు వాటా ఇవ్వాలి అని harass చేస్తారు. Jagan era లొ AP is no1 in ease of doing business rankings అర్థమైందా యువరాజా

Comments are closed.