వివాదాస్పద స్టెప్పులపై వర్మ కామెంట్

డాన్సుల్ని కూడా వివాదాస్పదం చేయడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. స్టెప్పులపై గోల ఎప్పట్నుంచో ఉందంటున్నాడు.

ఈమధ్య తెలుగు సినిమాల్లో డాన్సులు కూడా వివాదాస్పదమౌతున్న సంగతి తెలిసిందే. మిస్టర్ బచ్చన్ నుంచి మొదలుపెడితే, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ వరకు చాలా సినిమాల్లో కొరియోగ్రఫీ కాంట్రవర్సీ అవుతూనే ఉంది.

డాన్సుల్ని కూడా వివాదాస్పదం చేయడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. స్టెప్పులపై గోల ఎప్పట్నుంచో ఉందంటున్నాడు.

“స్టెప్పులపై గోల ఎప్పట్నుంచో ఉంది. ఏది చేసిన అది కొందరికి నచ్చదు, కొందరికి నచ్చుతుంది. భూమి పుట్టినప్పట్నుంచి ఇది ఉంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతి ఒక్కడికి నోరు ఉంటుంది, ఆ నోటికి ఒక ఓపీనియన్ ఉంటుంది. ఇలాంటి వాటిల్లో కూడా నైతికత-అనైతికత అని ఆలోచిస్తే, ఇక ఎవ్వడూ బయట తిరగలేడు.”

ఏం చేసినా ఇష్టపడేవాళ్లు, వ్యతిరేకించేవాళ్లు ఉంటారని… వ్యతిరేకించేవాళ్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తారని.., నచ్చినోళ్లు టికెట్ కొని సినిమా చూస్తారని అంటున్నాడు ఆర్జీవీ. వీళ్లలో ఎవరిది కరెక్ట్ అని ఎలా చెబుతామని ప్రశ్నిస్తున్నాడు. నచ్చడం, నచ్చకపోవడం అనేది నిరంతరం జరిగుతుందని.. డాన్స్ లపై కూడా రాద్దాంతం చేయడం ఆపేయాలని అంటున్నాడు.

4 Replies to “వివాదాస్పద స్టెప్పులపై వర్మ కామెంట్”

Comments are closed.