హీరోయిన్లు మాత్రమేనా.. హీరోలెక్కడ?

కొంతమంది రియాక్ట్ అయి, మరికొంతమంది సైలెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే వాదన మొదలవుతుంది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న 400 ఎకరాలపై ఇప్పుడు జోరుగా వివాదం నడుస్తోంది. ప్రభుత్వం అభివృద్ధి అంటోంది, విద్యార్థులు ప్రకృతి వినాశనం అంటున్నారు. మధ్యలో హీరోయిన్లు కూడా స్టూడెంట్స్ కు మద్దతుగా నిలిచారు.

సమంత, రేణుదేశాయ్, ఇషా రెబ్బా లాంటి చాలామంది ఈ ఇష్యూపై స్పందించారు. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాళ్లు ఎటువైపు మొగ్గుచూపారు, ఎవరికి మద్దతిచ్చారనే విషయాన్ని పక్కనపెడితే, అసలీ వివాదంపై హీరోలు ఎందుకు స్పందించడం లేదనేది ప్రశ్న.

సమంత, రేణు దేశాయ్, ఇషా రెబ్బా లాంటి వాళ్లంతా గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లోనే ఉంటారని, వాళ్లకు అర్బన్ ఫారెస్ట్ గురించి బాగా తెలుసని అంటున్నారు కొంతమంది. అదే టైమ్ లో నాగచైతన్య, రామ్ చరణ్, ప్రభాస్, రానా లాంటి హీరోలు కూడా అదే ప్రాంతాల్లో ఉంటున్నారు కదా. వాళ్లకు కూడా దీనిపై అంతోఇంతో అవగాహన ఉంది. మరి వాళ్లెందుకు స్పందించడం లేదు?

ఓ విషయంపై స్పందించాలా వద్దా అనేది సెలబ్రిటీల ఇష్టం. కాకపోతే కొంతమంది రియాక్ట్ అయి, మరికొంతమంది సైలెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే వాదన మొదలవుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ రగడపై కూడా ఈ చర్చ మొదలవ్వడానికి ఇదే కారణం. ఇప్పటివరకు ఒక్క హీరో కూడా దీనిపై స్పందించకపోవడం గమనార్హం.

ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన స్టయిల్ లో ఇండస్ట్రీని గాడిన పెట్టారనే ప్రచారం నడుస్తోంది. ఇప్పుడీ వివాదంపై స్పందిస్తే మొత్తానికే మోసం వస్తుందని పరిశ్రమ భయపడుతోందా..?

7 Replies to “హీరోయిన్లు మాత్రమేనా.. హీరోలెక్కడ?”

  1. ట్రి పు ల్ వన్ జీ వో ఎ త్తే సి న ప్పు డు లే వ ని నో ళ్లు

    ఇ ప్పు డు లే స్తు న్నా యి.

    అం త కం టే గొ ప్ప లం గ్ స్పే సా ఇ ది

  2. కేటీఆర్ గాడు ఫోన్ టాప్ చేసి డ్రగ్స్ లో ఇరుక్కున్న హీరోయిన్లును లొంగదీసుకున్నాడు హీరోల దగ్గర డబ్బు , రియల్ స్టేట్ దందా చేసాడు అందుకే వాళ్ళు స్పందించటం లేదు

Comments are closed.