బుగ్గ‌న స‌హా ప‌లువురు ముఖ్య నేత‌ల‌పై జ‌గ‌న్ సీరియ‌స్‌!

ఇక‌పై రాష్ట్ర క‌మిటీ పిలుపును లైట్‌గా తీసుకోవ‌ద్ద‌ని హిత‌వు చెప్పి పంపార‌ని వైసీపీ ముఖ్య నేత‌లు తెలిపారు.

గ‌త నెల‌లో వైసీపీ రాష్ట్ర పిలుపు ఫీజు పోరు కార్య‌క్ర‌మంలో పాల్గొన‌ని ప‌లువురు పార్టీ ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నాయ‌కుల‌పై వైఎస్ జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యార‌ని తెలిసింది. ఫీజు పోరులో పాల్గొన‌ని మాజీ మంత్రులు బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, ఆర్కే రోజా త‌దిత‌ర నాయ‌కులు రెండు రోజులుగా జ‌గ‌న్ ద‌గ్గ‌రికి వెళ్లి వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది.

విద్యార్థుల‌కు ఫీజు బకాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో, వాళ్ల‌కు హాల్ టికెట్లు ఇవ్వ‌కుండా ప‌రీక్ష‌లు రాయ‌కుండా అడ్డుకుంటామ‌ని ముఖ్యంగా ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ల యాజ‌మాన్యాలు హెచ్చ‌రించాయి.

ఈ నేప‌థ్యంలో విద్యార్థుల‌కు అండ‌గా వైసీపీ ఫీజు పోరు నిర్వ‌హించాల‌ని స్వ‌యంగా వైఎస్ జ‌గ‌న్ పిలుపు ఇచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 20 మందికి పైగా నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు ఫీజు పోరులో పాల్గొన‌కుండా, కుటుంబ స‌భ్యుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించి ఎక్క‌డికో వెళ్లిన‌ట్టు జ‌గ‌న్‌కు స‌మాచారం వ‌చ్చింది.

అలాంటి వాళ్లంద‌రినీ పిలిపించుకుని జ‌గ‌న్ గ‌ట్టిగా మంద‌లించిన‌ట్టు తెలిసింది. ఇలాగైతే భ‌విష్య‌త్‌లో ఇబ్బందులు వ‌స్తాయ‌ని హెచ్చ‌రించార‌ని స‌మాచారం. ఇక‌పై రాష్ట్ర క‌మిటీ పిలుపును లైట్‌గా తీసుకోవ‌ద్ద‌ని హిత‌వు చెప్పి పంపార‌ని వైసీపీ ముఖ్య నేత‌లు తెలిపారు. ప్ర‌తి అంశంపై జ‌గ‌న్ సీరియ‌స్‌గా ఉన్నార‌నేందుకు ఇదే నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు. త‌న‌కు ముఖ్య‌మ‌నే కార‌ణంతో కీల‌క కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌పోయినా ఫ‌ర్వాలేద‌నే వాళ్ల‌ను ఉపేక్షించ‌ననే సంకేతాల్ని జ‌గ‌న్ పంపిన‌ట్టు అయింది.

15 Replies to “బుగ్గ‌న స‌హా ప‌లువురు ముఖ్య నేత‌ల‌పై జ‌గ‌న్ సీరియ‌స్‌!”

  1. పాపం…బుర్ర కధల బుగ్గన అప్పట్లో respected రెడ్డి గారు ఇలా పోరులో పాల్గొనమని లెటర్ ఏమైనా రాశారా అని వెదికే పనిలో బిజీ గా ఉన్నాడు

  2. ఎండ లో టాన్ అవుతారు. మళ్ళీ అందం పోయిందని అంటావ్.. ఎట్టా సామీ మీతో

  3. ఇంతకీ ఫీజు పోరు లో నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నాడా? నాయకుడు ముందు నిలబడితే వెనకాల పార్టీ మొత్తం కదిలి వస్తుంది….

  4. పార్టీ లో ఉంటే ఎంత పోతే ఎంత అని వాళ్ళు ఉంటే వారికి హెచ్చరికలు పంపి ఏం ఉపయోగం

  5. తనను చూసే కదా ఓట్లు పడేవి మిగతా నాయకులు వల్ల ఓట్లు పడవు కదా వాళ్ళు కష్టపడితే ఎంత కష్టపడకపోతే

  6. జగనే సొంతగా ఆ ఫీజు కట్టి పోరాటం చేస్తే, అప్పుడు రంజు గా ఉండేది. ప్రభుత్వం కూడా డిఫెన్స్ లో పడేది.

    వాడికి సొంత జేబులో డబ్బు తీయడం ఇష్టం వుండదు. వాడు వేరేవాళ్ళని మాత్రం ఖర్చు పెట్టమంటాడు.

Comments are closed.