మినీ జ‌మిలీకి కేంద్రం క‌స‌ర‌త్తు!

మినీ జ‌మిలీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ వ్యూహాత్మ‌కంగా ముందుకెళుతున్న‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

దేశ వ్యాప్తంగా ఒకే ద‌ఫా ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని బీజేపీ కోరుకుంటోంది. జ‌మిలీ ఎన్నిక‌ల‌పై మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో క‌మిటీ ఏర్పాటు చేసి, నివేదిక కూడా తెప్పించుకుంది. జ‌మిలీ ఎన్నిక‌ల ఆవ‌శ్య‌క‌త‌పై దేశ వ్యాప్తంగా ఆరోగ్య‌క‌ర‌మైన చ‌ర్చ‌లు నిర్వ‌హించాల‌ని బీజేపీ నాయ‌క‌త్వం పిలుపునివ్వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. దేశ‌మంతా ఒకేసారి ఎన్నిక‌లు జ‌ర‌ప‌డం ప్ర‌స్తుతానికి వీలు కాద‌నే అభిప్రాయంలో బీజేపీ వుంది.

అందుకే మినీ జ‌మిలీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ వ్యూహాత్మ‌కంగా ముందుకెళుతున్న‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు 2027లో జ‌ర‌గ‌నున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీపై వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌వేళ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీకి వ్య‌తిరేక ఫ‌లితాలు వ‌స్తే, దాని ప్ర‌భావం పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌పై ప‌డుతుందని బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ఆందోళ‌న చెందుతోంది.

అందుకే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ఆ పార్టీ తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అదే స‌మ‌యంలో ఆ స‌మయానికి ఆరు నెల‌ల ముందు లేదా వెనుక అసెంబ్లీ కాల‌ప‌రిమితి పూర్తి చేసుకునే రాష్ట్రాల్లో కూడా ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని, త‌ద్వారా మినీ జ‌మిలీ చేప‌ట్టిన‌ట్టు అవుతుంద‌ని కేంద్రం వ్యూహాత్మ‌కంగా అడుగులు ముందుకేస్తోంది.

అందుకే జ‌మిలీ ఎన్నిక‌ల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న తీసుకురావాల‌ని బీజేపీ భావిస్తోంది. ప్ర‌స్తుతానికి ఢిల్లీ బీజేపీ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం మేర‌కు 2027, న‌వంబ‌ర్‌లో మినీ జ‌మిలీ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇది మ‌రింత వేగం అందుకోనుంది.

3 Replies to “మినీ జ‌మిలీకి కేంద్రం క‌స‌ర‌త్తు!”

  1. జమిలి ఎన్నికలు రావాలని కోరుకుంటున్న మా అన్నయ్య ఏం కావాలి ఏపి లో లోక్సభ ఎన్నికలు మాత్రమే జరిగితే..

Comments are closed.