కూటమి సర్కార్‌పై రాకూడని వాళ్లలోనే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే పంతాన్ని సాధించుకుని, కూటమి సర్కార్ అధికారంలోకి రావడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారు. వైసీపీ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత నింపడంలో ఉపాధ్యాయులు విజయవంతమైన పాత్ర పోషించారు. ఇదంతా వైసీపీ పాలన చివరి రెండేళ్లలో జరిగింది. అయితే ఉపాధ్యాయ వర్గాలను డీల్ చేయడంలో నాడు వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు సరైన పాత్ర పోషించకపోవడంతో, అనవసర వ్యతిరేకతను మూటకట్టుకున్నారు.
అయితే కూటమి ప్రభుత్వం పది నెలల పాలన పూర్తి చేసుకునే లోపే ఉపాధ్యాయులు రోడ్డెక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో వ్యతిరేకత మొదలైందంటే… ఆ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టే అనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సందర్భంగా తమకిచ్చిన హామీల్ని అమలు చేయడంలో ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోందంటూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టారు.
ఉపాధ్యాయులు, ఉద్యోగుల వారసులకు వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలని, 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన మూడు పెండింగ్ డీఏలు, సరెండర్ లీవ్ బకాయిలు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు నినాదాలు చేయడం గమనార్హం.
పది నెలల కాలంలోనే ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో కూటమి సర్కార్‌పై వ్యతిరేకత రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రచారం చేయడంలో వీళ్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తారు. సామాన్య ప్రజలకు హామీలిచ్చి, ఎగ్గొట్టినట్టు, ఉద్యోగుల్ని మోసగించడం సాధ్యం కాదు. అలా చేస్తే వాళ్లు ఊరుకునే ప్రశ్నే లేదు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు జస్ట్ ట్రైలర్ మాత్రమే ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు. ముందుంది ముసళ్ల పండగ అని వాళ్లు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
First ask them to cross check whether they get the bad mark if they fight now without fighting one year back.
అయ్యో ఈ నీతులు అన్నకి చెప్పి ఉంటే రెండు సింగిల్స్ నుండి తప్పించుకునేవాడు కదా?
దీన్ని బట్టి ఏమి అర్ధం అయ్యింది నీకు?
Chembu chata sardukovatamey..next
మా అన్నయ్య కి ఐదేళ్లు వ్యతిరేకత లేకుండా పరిపాలన చేశాడంటారా