నాతో నేను.. నాలో నేను

కథ రాయడమంటే మామూలు విషయం కాదు. కనీసం 60 సీన్లు రాసుకోవాలి.

ఓ సినిమాకు కథ రాయడంలో ఒక్కో దర్శకుడికి ఒక్కో పద్ధతి ఉంటుంది. అనీల్ రావిపూడి తన టీమ్ తో పాటు వైజాగ్ వెళ్లి కథ కొలిక్కి వచ్చేవరకు కూర్చుంటాడు. ఇక పూరి జగన్నాధ్ అయితే బ్యాంకాక్ వెళ్లిపోతాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ లాంటి దర్శకులు తమ ఇంట్లోనే ఏకాంతంగా కూర్చొని కథలు రాసుకుంటారు.

ఇలా ప్రతి దర్శకుడికి ఓ శైలి ఉంటుంది. మరి ఇన్ని సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ స్టయిల్ ఏంటి? అతడు తన టీమ్ తో కథను డిస్కస్ చేస్తాడా? అసలు ఆర్జీవీ లాంటి వ్యక్తి ఓపిగ్గా కూర్చొని కథ రాయగలడా?

ఈ ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా సమాధానమిచ్చాడు ఆర్జీవీ. ఓ సినిమాకు కథ రాయాలన్నప్పుడు ఏకాంతంగా కూర్చుంటాడట వర్మ. కొంతమంది దర్శకుల్లా ఏదో ఒక డెస్టినేషన్ కు వెళ్లడం తనకు ఇష్టం ఉండదని, తన ఇంట్లోనే కూర్చొని కథ రాసుకుంటానని శెలవిచ్చాడు.

అంతేకాదు, ఇప్పటికీ తనే సొంతంగా టైపు చేసి కథ రాసుకుంటాడట వర్మ. ఒకరికి నెరేట్ చేస్తూ టైపు చేయించే పద్ధతి తనది కాదని, తన మనసులో అనుకున్న స్టోరీని తనే ఇంగ్లిష్ లో టైపు చేసి రాసుకుంటానని అన్నాడు.

కథ రాయడమంటే మామూలు విషయం కాదు. కనీసం 60 సీన్లు రాసుకోవాలి. ఒక్కో సీన్ కు చాలా డిస్క్రిప్షన్ ఉంటుంది. అవన్నీ తనే టైపు చేస్తానంటున్నాడు వర్మ.

ఇలా కథ మొత్తం రెడీ అయిన తర్వాత ఆ డ్రాఫ్ట్ ను తన డైరక్షన్ డిపార్ట్ మెంట్ కు ఇస్తాడట. వాళ్లు ఇచ్చిన సూచనలు నచ్చితే తీసుకుంటాడట. లేదంటే తను రాసుకున్న డ్రాఫ్ట్ నే ఫైనల్ చేస్తాడట. ఓ సినిమా తీయడానికి ముందు వర్మ చేసే కథా కసరత్తు ఇది.

11 Replies to “నాతో నేను.. నాలో నేను”

  1. ఈయన సినిమాల్లో కథలు కూడా ఉంటాయా … కెమెరా యాంగిల్స్ తప్ప ఇతనికి కదలగురుంచి అవగాహన లేదు.. ఆ యాంగిల్స్ కూడా చూసి చూసి పాచిపట్టి చూడటం మానేశారు

  2. ఫైబర్‌నెట్‌ డబ్బు… కొటి పదిహెను లక్షలు ఎలా తిన్నాడు? అది చెప్పరా GA?

Comments are closed.