పవన్ ప్రారంభించిన పనులు మొదలు కాలేదు!

ఉప ముఖ్యమంత్రి హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో శంకుస్థాపన చేసిన పనులు ఇంకా మొదలు కాలేదు.

ఉప ముఖ్యమంత్రి హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో శంకుస్థాపన చేసిన పనులు ఇంకా మొదలు కాలేదు. మూడున్నర నెలలు గడిచినా రోడ్డు పనులు స్టార్ట్ కాకపోవడంతో గిరిజనులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి వచ్చి శ్రీకారం చుట్టినా పనులు ఎందుకు ప్రారంభం కావడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ఏడాది డిసెంబర్ 22న పవన్ కళ్యాణ్ అనంతగిరి మండలంలో పర్యటించి రోడ్ల కోసం శంకుస్థాపనలు చేశారు. అయితే ఈ రోడ్లకు మోక్షం కలుగక ఈ రోజుకీ గిరిజనులకు రహదారి సౌకర్యం లేకుండా పోయింది. డోలీల మోతతో గర్భిణులు అనారోగ్యం పాలు అయిన వారు బయట ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తోందని గిరిజనులు అంటున్నారు.

ఈ రోడ్డు పనులకు అటవీ శాఖ అనుమతులు ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అటవీ శాఖ ఆటంకాలను తొలగించి రోడ్లు వేయాల్సిన జిల్లా యంత్రాంగం ఈ విషయంలో ఏమి చేస్తోంది అని వారు ప్రశ్నిస్తున్నారు. పదిహేను రోజుల లోపల రోడ్ల పనులు ప్రారంభించకపోతే భారీ ఎత్తున ఆందోళన చేపడతామని ఆదివాసీలు హెచ్చరించారు.

ఇది పదకొండు గ్రామాల గిరిజనం సమస్య అని అధికారులు అర్ధం చేసుకోవాలని వారు కోరుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ శంకుస్థాపనల రోడ్ల పనులకు సంబంధించి చేశారు కానీ ఫాస్ట్‌గా అనుమతి లేకపోవడం వల్ల పనులు ఇంకా మొదలు కాలేదని అంటున్నారు. ఈ క్రమంలో గిరిజనుల సంక్షేమానికి నిధులు వెచ్చిస్తున్నామని పాలకులూ అధికారులూ చెబుతున్నారు కానీ ఆచరణలో మాత్రం ఆలస్యం జరుగుతోందని పనులు అవడం లేదని గిరిజన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

8 Replies to “పవన్ ప్రారంభించిన పనులు మొదలు కాలేదు!”

  1. మనోడు సినిమా ప్రారంభోత్సవాలు , రోడ్ల శంకుస్తాపనలది ఒకటె బతుకు . అవి ఎప్పటికి కంప్లీట్ అవుతాయో దేవుడికి కూడా తెలియదు.

    1. వెళ్లి బెంగళూర్ లో పడుకున్న మీ పనికిమాలిన దద్దమ్మ అడుగు 5 సంవత్సరాలు ఏం చేసావు అని

Comments are closed.